Oats for Skin: ఓట్స్‌తో ఇలా ప్యాక్ వేస్తే మీ ముఖం చంద్రబింబంలా మెరిసిపోవాల్సిందే..!
ఓట్స్ ఆరోగ్యానికే కాదు చర్మ సంరక్షణకు కూడా మేలు చేస్తుంది. ఓట్స్‌లో ప్రోటీన్లు ఉంటాయి. ఇవి శరీరానికి, చర్మానికి మేలు చేస్తాయి. ఇందులో విటమిన్ ఇ కూడా ఉంది. ఇది చర్మ ఆరోగ్య ప్రయోజనాలకు అతి ముఖ్యమైన విటమిన్. ఇతర తృణధాన్యాలతో పోలిస్తే ఓట్స్ అధిక అమైనో ఆమ్లం, సిలికా కంటెంట్‌ను కలిగి ఉంటుంది. విటమిన్ ఇ ఒక
ఓట్స్ ఆరోగ్యానికే కాదు, ఆందాన్ని రెట్టింపు చేయడానికి కూడా సహాయపడతాయి. ఓట్స్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు చర్మాన్ని పునరుజ్జీవింపజేయడంలో సహాయపడతాయి. ఇవి చర్మంపై డెడ్ సెల్స్‌ను తొలగించడంలో సహాయపడతాయి. ఓట్స్‌లోని విటమిన్లు, ప్రొటీన్లు.. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది.. ఓట్ మీల్.. చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది.
ఓట్స్‌లోని సాపోనిన్‌లు.. చర్మాన్ని సున్నితంగా ఎక్స్‌ఫోలియేట్ చేసి, మృత కణాలను తొలగిస్తుంది. చర్మంలోని అదనపు నూనెను, ధూళిని నిర్మూలిస్తాయి. ఇందుకోసం పావు కప్పు పెరుగులో రెండు చెంచాల ఓట్స్ పొడి వేసి మిక్స్ చేయండి. దీన్ని ముఖానికి, చేతులకు పట్టింటి.. మర్దనా చేయాలి. ఆ తర్వాత 15 నిమిషాల పాటు ఆరనిచ్చి గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోండి. ఓట్స్ చర్మానికి క్లెన్సర్‌లా పనిచేస్తాయి. చర్మంపై పేరుకున్న మృత కణాలను, మురికినీ తొలగిస్తాయి. మీ చర్మాన్ని తాజాగా ఉంచుతాయి.
ఓట్స్ ఆరోగ్యానికే కాదు చర్మ సంరక్షణకు కూడా మేలు చేస్తుంది. ఓట్స్‌లో ప్రోటీన్లు ఉంటాయి. ఇవి శరీరానికి, చర్మానికి మేలు చేస్తాయి. ఇందులో విటమిన్ ఇ కూడా ఉంది. ఇది చర్మ ఆరోగ్య ప్రయోజనాలకు అతి ముఖ్యమైన విటమిన్. ఇతర తృణధాన్యాలతో పోలిస్తే ఓట్స్ అధిక అమైనో ఆమ్లం, సిలికా కంటెంట్‌ను కలిగి ఉంటుంది. విటమిన్ ఇ ఒక యాంటీఆక్సిడెంట్. ఇది చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసి రక్షిస్తుంది.
మీ ముఖంపై ఉన్న ముడతలను తొలగించేందుకు ఓట్ మీల్ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి. బెస్ట్‌రిజల్ట్స్‌ని గమనిస్తారు. ఓట్స్‌మిల్ ఫేస్ ప్యాక్ కోసం ముందుగా..ఒక చిన్న బొప్పాయి ముక్క, రెండు టేబుల్ స్పూన్ల గ్రౌండ్ ఓట్స్, కొంచెం నీరు, ఒక టీస్పూన్ బాదం నూనె వేసి ప్యాక్ తయారు చేయండి. దీన్ని మీ ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల బాగా ఆరనివ్వండి.. ఆ తర్వాత కడిగేయండి. ఈ ఫేస్ ప్యాక్ వల్ల మచ్చలు తొలగిపోయి చర్మానికి మంచి మెరుపు వస్తుంది.
1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ ఓట్ మీల్, 1 టేబుల్ స్పూన్ తేనెను రోజ్ వాటర్ తో మిక్స్ చేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. దీన్ని మీ ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో మీ ముఖాన్ని కడగాలి. ఈ ప్యాక్‌ని అన్ని చర్మ రకాల వారు ప్రయత్నించవచ్చు.
2 టేబుల్ స్పూన్ల ఓట్స్, 3 టేబుల్ స్పూన్ల పాలు మిక్స్ చేసి ప్యాక్ తయారు చేయండి. తర్వాత ఈ ప్యాక్‌ని మీ ముఖం, మెడకు అప్లై చేయండి. ఆరిన తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. డార్క్ స్కిన్, సన్ టాన్స్ తొలగించడానికి ఇది బెస్ట్ ఫేస్ ప్యాక్ అని చెప్పొచ్చు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..