AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: పాపం బిడ్డ .. వెరైటీగా ప్రపోజ్ చేద్దాం అనుకున్నాడు.. కానీ బెడిసికొట్టింది..!

కొందరు తాము ప్రేమించిన వారికి గ్రీటింగ్ కార్డ్స్, గులాబీలు ఇవ్వడమే కాదూ చాక్లెట్స్, చీరలు, గోల్డ్ రింగ్స్ వంటి కాస్ల్టీబహుమతుల రూపంలో తమ ప్రేమను వ్యక్త పరుస్తున్నారు. ఇక మరికొందరు వెరైటీ కోసం అందరీ ముందు స్టంట్స్‌ చేస్తూ తన ప్రియురాలిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఇక్కడ వైరల్‌ అవుతున్న వీడియోలో వ్యక్తి కూడా అలాంటి పనినే చేశాడు. రిస్క్ తో కూడిన ప్రపోజల్ చేశాడు.

Watch: పాపం బిడ్డ .. వెరైటీగా ప్రపోజ్ చేద్దాం అనుకున్నాడు.. కానీ బెడిసికొట్టింది..!
Love Proposals
Jyothi Gadda
|

Updated on: Jun 17, 2024 | 4:39 PM

Share

అందరి ముందు గాళ్‌ఫ్రెండ్‌కి తన లవ్ ప్రపోజ్ చేసి ఆమెను తన ప్రేమలో పడేయాలనుకున్న ఓ యువకుడు ప్లాన్‌ బెడిసి కొట్టింది. ప్రేమించిన వారికి తమ ప్రేమను తెలియజేయడం కోసం ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. ఇటీవలి కాలంలో ఇలాంటి లవ్‌ ప్రపోజల్స్ లో చిత్ర విచిత్ర సంఘటనలు జరుగుతున్నాయి. అవన్నీ సోషల్ మీడియాలో చేరి వైరల్‌ అవుతున్నాయి. కొందరు తాము ప్రేమించిన వారికి గ్రీటింగ్ కార్డ్స్, గులాబీలు ఇవ్వడమే కాదూ చాక్లెట్స్, చీరలు, గోల్డ్ రింగ్స్ వంటి కాస్ల్టీబహుమతుల రూపంలో తమ ప్రేమను వ్యక్త పరుస్తున్నారు. ఇక మరికొందరు వెరైటీ కోసం అందరీ ముందు స్టంట్స్‌ చేస్తూ తన ప్రియురాలిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఇక్కడ వైరల్‌ అవుతున్న వీడియోలో వ్యక్తి కూడా అలాంటి పనినే చేశాడు. రిస్క్ తో కూడిన ప్రపోజల్ చేశాడు. కాస్త డిఫరెంట్‌ స్టైల్లో తన ప్రేయసికి ప్రపోజల్ చేయాలనుకున్నాడు.. నడిరోడ్డుపై బొక్క బోర్లా పడ్డాడు. ఈ వీడియో నెట్టింట్ల తెగ వైరల్ అవుతుంది.

వైరల్ వీడియోలో ఒక యువతి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. అంతలోనే అటుగా ఒక బైక్‌ దూసుకొస్తూ కనిపించింది. ఆమె ఓ క్షణం పాటు ఆగి ఆ బైక్‌వైపుకు చూస్తుంది. బైక్‌పై ఇద్దరు యువకులు వస్తున్నాయి. వెనకాల కూర్చున్న వ్యక్తి చేతిలో ఫ్లవర్‌ బోకే కూడా ఉంది. అతడు.. రోడ్డుపై నిలబడి ఉన్న యువతికి లవ్‌ ప్రపోజ్‌ చేయనున్నట్టుగా వీడియో చూస్తే తెలుస్తుంది. ప్రేమించిన యువతికి వెరైటీగా ప్రపోజ్‌ చేయాలనుకున్న ఆ యువకుడు..ఊహించని ప్రమాదం ఎదురైంది. ప్రస్తుతం ఈ ఫన్నీ ఇన్సిడెంట్‌ నెటిజన్లను తెగ నవ్విస్తోంది. వీడియో చూస్తే మీరు కూడా నవ్వకుండా ఉండలేరు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Los chuyines (@thechuyss)

బైక్‌పై వెనకాల కూర్చుని, చేతిలో పుష్పగుచ్చం పట్టుకుని లవర్‌కి ప్రపొజ్‌ చేద్దామనుకున్న అతడు.. ఆమెకు సమీపంలోకి రాగానే.. బైక్‌పైనుంచి ఒక్కసారిగా కిందపడిపోయాడు.. బైక్‌ వేగానికి అతడు పల్టీలు కిందపడి పల్టీలు కొట్టాడు. జరిగిన సీన్‌ చూసి సదరు యువతి సైతం నవ్వుకుంది. కానీ, పాపం ఆ ప్రియుడి పరిస్థితి ఎలా ఉందో తెలియలేదు. వీడియో మాత్రం నెట్టింట తెగ సందడి చేస్తోంది. నెటిజన్లు లైకులు, కామెంట్లు, షేర్లతో హోరెత్తిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?