Watch Video: పోయేకాలం వచ్చిదంటే ఇదే మరీ..! యువతి డేంజర్‌ బైక్‌ స్టంట్‌ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!!

అసాధారణ రీతిలో బైక్‌పై కూర్చొన్న మాధవి హ్యాండిల్స్‌ వదిలేసి డేంజర్‌ స్టంట్‌ చేసింది. కొన్ని డ్యాన్స్ స్టెప్పులు వేసింది. గులాబీతో పోజులిచ్చింది. మాధవి చేసిన డేంజర్‌ బైక్‌ స్టంట్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. పోలీసులు ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Watch Video: పోయేకాలం వచ్చిదంటే ఇదే మరీ..! యువతి డేంజర్‌ బైక్‌ స్టంట్‌ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!!
Hands Free Bike Riding
Follow us

|

Updated on: Jun 16, 2024 | 9:36 PM

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా ట్రెండ్‌ కొనసాగుతోంది. ట్విట్టర్‌,ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా గ్రూపులు, పోస్టులతో యువతి బిజీబిజీగా మారిపోయారు. ఈ క్రమంలోనే రీల్స్‌ పిచ్చి కూడా చాలా మందిలో ముదిరిపోయిందనే చెప్పాలి. అలాంటిదే ఇక్కడ కూడా ఓ యువతి చేసిన పని అందరికీ ఆగ్రహం తెప్పిచ్చింది. సోషల్‌ మీడియాలో రీల్‌ కోసం ఒక యువతి ప్రమాదకరంగా బైక్‌ నడిపింది. ఒక పక్కకు కూర్చొన్న ఆమె బైక్‌ హ్యాండిల్స్‌ వదిలేసి స్టంట్‌ చేసింది. డ్యాన్స్‌ మూమెంట్లతోపాటు రోజ్‌ ఫ్లవర్‌తో ఫోజులిస్తూ హల్‌చల్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్‌నెట్‌ వేదికగా సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యింది.

వైరల్‌ వీడియో మహారాష్ట్రలోని పూణేలో జరిగిన సంఘటనగా తెలిసింది. వీడియోలో కనిపించిన యువతి..మాధవి కుంభార్‌ తరచుగా బైకింగ్ వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంది. ఈ సారి యువతి ప్రమాదరంగా RX 100 బైక్‌తో స్టంట్ చేసింది. ఒక పక్కకు కూర్చొని బైక్ హ్యాండిల్స్‌ వదిలేసింది.1.6 మిలియన్‌ ఫాలోవర్లు ఉన్న ఆమె తాజాగా ఇలాంటి బైక్‌ స్టంట్‌కు సంబంధించిన రీల్‌ చేసింది. అసాధారణ రీతిలో బైక్‌పై కూర్చొన్న మాధవి హ్యాండిల్స్‌ వదిలేసి డేంజర్‌ స్టంట్‌ చేసింది. కొన్ని డ్యాన్స్ స్టెప్పులు వేసింది. గులాబీతో పోజులిచ్చింది. మాధవి చేసిన డేంజర్‌ బైక్‌ స్టంట్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. పోలీసులు ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా, మాధవి హ్యాండ్స్ ఫ్రీ బైక్ రైడ్ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో ఆ యువతి ప్రమాదకరంగా బైక్‌పై స్టంట్‌ చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పటి వరకు ట్రాఫిక్‌ పోలీసులు ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని సమాచారం.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Latest Articles