వాన కబురు.. ద్రోణి ప్రభావంతో రేపు, ఎల్లుండి ఏపి వ్యాప్తంగా పిడుగులతో కూడిన వర్షాలు.. ఆయా జిల్లాలకు..

సాయంత్రం 6 గంటల నాటికి కాకినాడ రూరల్లో 83మిమీ, ఏలూరు జిల్లా నిడమర్రు 80.7మిమీ, విజయనగరంలో 70మిమీ, అల్లూరి జిల్లా కూనవరంలో 48.5మిమీ, తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో 47.5మిమీ, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో 45మిమీ, కృష్ణా జిల్లా పమిడిముక్కలలో 31.5మిమీ చొప్పున నమోదైన వర్షపాతం.

వాన కబురు.. ద్రోణి ప్రభావంతో రేపు, ఎల్లుండి ఏపి వ్యాప్తంగా పిడుగులతో కూడిన వర్షాలు.. ఆయా జిల్లాలకు..
Ap Rain Alert
Follow us
P Kranthi Prasanna

| Edited By: Jyothi Gadda

Updated on: Jun 16, 2024 | 8:33 PM

ద్రోణి ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా ప‌లు చోట్ల వ‌ర్షాలు కురుస్తాయ‌ని విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ వెల్ల‌డించింది. రేపు అల్లూరి, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్‌, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయ‌ని తెలిపింది. రేపు, ఎల్లుండి అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని పేర్కొంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

రేపు అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అలాగే అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు,నంద్యాల,శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య , చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం .

ఎల్లుండి అల్లూరి సీతారామరాజు, శ్రీసత్యసాయి, వైయస్ఆర్, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అలాగే పార్వతీపురంమన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం .

ఇవి కూడా చదవండి

ఇవాళ సాయంత్రం 6 గంటల నాటికి కాకినాడ రూరల్లో 83మిమీ, ఏలూరు జిల్లా నిడమర్రు 80.7మిమీ, విజయనగరంలో 70మిమీ, అల్లూరి జిల్లా కూనవరంలో 48.5మిమీ, తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో 47.5మిమీ, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో 45మిమీ, కృష్ణా జిల్లా పమిడిముక్కలలో 31.5మిమీ చొప్పున నమోదైన వర్షపాతం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…