Banana Hair Mask: పట్టులాంటి మెరిసే జుట్టు కోసం అరటిపండు హెయిర్‌ మాస్క్‌..! ఒక్కవాష్‌లోనే అద్భుతం చూస్తారు..

తలలోని వెంట్రుకలు పొడిబారినట్లయితే, దాంతో జుట్టు రాలడం మొదలవుతుంది. జీవనశైలి, కాలుష్యం, హార్మోన్ల మార్పులు, హెయిర్ ట్రీట్‌మెంట్ మొదలైన కారణాల వల్ల జుట్టు ప్రభావితమవుతుంది. బలహీనమైన జుట్టు సమస్యను నయం చేయడానికి, కొద్ది రోజుల్లోనే పట్టులాంటి కురులు కావాలంటే.. మీరు అరటిపండు హెయిర్‌ మాస్క్‌ను ఉపయోగించవచ్చు. అదేలా ఉపయోగపడుతుందో ఇక్కడ తెలుసుకుందాం..

Banana Hair Mask: పట్టులాంటి మెరిసే జుట్టు కోసం అరటిపండు హెయిర్‌ మాస్క్‌..! ఒక్కవాష్‌లోనే అద్భుతం చూస్తారు..
Banana Hair Masks
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 16, 2024 | 6:45 PM

ప్రస్తుత కాలంలో చాలా మంది చిన్న వయస్సులోనే జుట్టు రాలిపోవడం, నెరసిన జుట్టు వంటి వివిధ సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. జుట్టు పొడిబారడం, రాలిపోవడం, అకాల జుట్టు రాలిపోవడం, జుట్టు పొడిగా మారడానికి అనేక కారణాలున్నాయి. జుట్టు పొడిగా మారితే అది జుట్టు రాలిపోయే సమస్యకు దారితీస్తుంది. జీవనశైలి, కాలుష్యం, హార్మోన్ల మార్పులు, హెయిర్ ట్రీట్‌మెంట్ మొదలైన కారణాల వల్ల జుట్టు ప్రభావితమవుతుంది. బలహీనమైన జుట్టు సమస్యను నయం చేయడానికి మీరు అరటిపండును ఉపయోగించవచ్చు. అరటిపండులో విటమిన్ యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి.

జుట్టును బలోపేతం చేయడానికి, పొడితన్నాని తగ్గించడానికి అరటి పండు హెయిర్ మాస్క్ ఉపయోగించవచ్చు. ఈ బనానా మాస్క్‌ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అరటిపండుతో పాటు కొన్ని పదార్థాలను కలుపుకుని ఈ మాస్క్‌ను తయారుచేస్తారు. దీన్ని జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు పొడిబారడం తగ్గించి జుట్టు మూలాలను బలపరుస్తుంది.

ఆలివ్ నూనె- అరటిపండు..

ఇవి కూడా చదవండి

అరటిపండు పేస్ట్‌లా చేసి, దానికి ఆలివ్ ఆయిల్‌ను అవసరం మేరకు రాసి జుట్టు మూలాలకు అప్లై చేయాలి. ఆ తర్వాత హెయిర్ క్యాప్ వేసుకుని 30 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఆలివ్ నూనెకు బదులుగా మీరు అరటిపండుతో పాటు కొబ్బరి నూనెను కూడా ఉపయోగించవచ్చు.

పెరుగు- అరటిపండు..

అరటిపండు, పెరుగు రెండూ ఇంట్లో సులభంగా దొరుకుతాయి. ఈ హెయిర్ మాస్క్‌ను తయారు చేయడానికి, అరటిపండు పేస్ట్‌లో పెరుగు వేసి బాగా మిక్స్‌ చేయాలి. చక్కటి హెయిర్ మాస్క్‌ తయారవుతుంది. రెండింటినీ బాగా మిక్స్ చేసి, సిద్ధం చేసుకున్న పేస్ట్‌ని జుట్టు మూలాలపై అప్లై చేయండి. అరగంట పాటు అలాగే వదిలేసి, ఆ తర్వాత శుభ్రంగా వాష్ చేయండి.. ఇలాంటి ఇంటి చిట్కాలను తరచూ పాటించటం వల్ల తొందరలోనే మీ జుట్టు బలంగా, ఒత్తుగా మారుతుంది.

గుడ్లు- అరటిపండు..

జుట్టు స్ట్రాంగ్ గా, సాఫ్ట్ గా మారాలంటే అరటిపండ్లతో పాటు గుడ్లను కూడా వాడుకోవచ్చు. దీని కోసం అరటిపండు, గుడ్డు మిక్స్ చేసి పేస్ట్ లా చేసి జుట్టుకు పట్టించాలి. 30 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై జుట్టును షాంపూతో కడగాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..