AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: బాధ్యతలు తీసుకున్న క్షణం నుంచే సమూల మార్పులకు శ్రీకారం..టీటీడీ కొత్త ఈవో సంచలనం..!

టిటిడి అధికార యంత్రాంగం ఉండగా సిబ్బంది పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సర్వ దర్శనం భక్తుల క్యూలైన్లలో లోపించిన పారిశుద్ధ్యం పట్ల అసహనం వ్యక్తం చేశారు.ఇద్దరు శానిటరీ ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు మెమోలు జారీ చేశారు. భక్తులకు సరఫరా చేస్తున్న తాగునీటి పరిశుభ్రంగా లేకపోవడంపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు టీటీడీ ఈవో శ్యామలరావు.

Tirumala: బాధ్యతలు తీసుకున్న క్షణం నుంచే సమూల మార్పులకు శ్రీకారం..టీటీడీ కొత్త ఈవో సంచలనం..!
Syamala Rao
Raju M P R
| Edited By: Jyothi Gadda|

Updated on: Jun 16, 2024 | 8:10 PM

Share

తిరుమల తిరుపతి దేవస్థానం సమూల మార్పులకు ప్రభుత్వం సమయతమైంది. ఇందులో భాగంగానే సీనియర్ ఐఏఎస్ అధికారి శ్యామలరావును రంగంలోకి దింపింది. 1997 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన శ్యామల రావు టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచే కొరఢా ఝుళిపిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు వరాహస్వామివారిని దర్శించుకున్న తర్వాత శ్రీవారి సన్నిధిలో ఈవోగా బాధ్యతలు చేపట్టారు శ్యామలరావు. రంగనాయక మండపంలో వేద పండితుల ఆశీర్వచనం అనంతరం మీడియా సమావేశం కూడా నిర్వహించారు. డ్యూటీని డివైన్‌గా భావించే టీటీడీ ఈవో శ్యామల రావు ఆ వెంటనే తిరుమలలో తనిఖీలు నిర్వహించారు.

బాధ్యతలు చేపట్టిన వెంటనే రంగంలోకి దిగిన ఈఓ టీటీడీ సమూల మార్పుల దిశగా అడుగులు వేశారు. సర్వదర్శనం క్యూలైన్లను పరిశీలించిన ఈవో శ్యాములరావు నందకం గెస్ట్ హౌస్ నుంచి శిలాతోరణం ద్వారా నారాయణగిరి షెడ్లు వరకు నడిచి వెళ్లి వాస్తవ పరిస్థితులను తెలుసుకున్నారు. భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు.

తనిఖీల్లో ఈఓ వెంట టిటిడి జేఈఓ లు వీరబ్రహ్మం, గౌతమి, టిటిడి అధికార యంత్రాంగం ఉండగా సిబ్బంది పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సర్వ దర్శనం భక్తుల క్యూలైన్లలో లోపించిన పారిశుద్ధ్యం పట్ల అసహనం వ్యక్తం చేశారు.ఇద్దరు శానిటరీ ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు మెమోలు జారీ చేశారు. భక్తులకు సరఫరా చేస్తున్న తాగునీటి పరిశుభ్రంగా లేకపోవడంపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు టీటీడీ ఈవో శ్యామలరావు.

ఇవి కూడా చదవండి

మీడియాతో ఆయాన మాట్లాడుతూ బోర్డు పరిపాలనలో మరింత పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకురావడమే తన ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…