Vegetable Prices: ధరల మోత..! చుక్కలు చూపిస్తున్న కూరగాయ ధరలు.. సెంచరీ దాటిన పచ్చిమిర్చి
గతంలో మూడు వందల రూపాయల కూరగాయలు కొనుగోలు చెస్తే వారం రొజులకి సరిపడేది.ఇప్పుడు కనీసం రెండు రోజులకి కూడ సరిపోవడం లేదు..ఈధరలు మరింత పెరిగే అవకాశం వుందని వ్యాపారస్తులు చెబుతున్నారు... కొత్త పంట చేతికి వచ్చేంత వరకి ధరలు సామాన్యడికి అందుబాటులో ఉండవు.
వర్షకాలం మొదలైనా కూరగాయల ధరలు మండిపోతున్నాయి…సామాన్యుడికిఅందుబాటులో లేకుండా కూరగాయల ధరలు పెరిగిపోయాయి… దాదాపు నా అన్ని రకాల కూరగాయల ధరలు సెంచరీకి దగ్గరగా ఉన్నాయి.ఈసీజన్ లొ అందరికి అందుబాటులో ఉండే అకుకూరల ధరలు కుడా పెరిగిపోయాయి.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సరైన వర్షాలు కురియలేదు … ఇప్పటి కీ ఎండలు మండిపోతున్నాయి. దీనితో కూరగాయల సాగు పైనా ప్రభావం చూపింది..గణనీయంగా కూరగాయల దిగుబడి తగ్గింది…చాల చొట్ల భూగర్భ జలాలు అడుగంటిపోయాయి.ప్రస్తుతం బహిరంగ మార్కెట్ లో అన్ని రకాల కూరగాయాల ధరలు నలభై శాతం వరకి పెరిగాయి..
పచ్చి మిర్చి కిలోకి వంద,చిక్కడు కిలో కి నూట ఇరవై,క్యారెట్ వంద,కాకరకాయ తొంభై ,కాలిఫ్లవర్ ఎనభై, అకుకూరలు కిలొకి డెబ్భై రూపాయల వరకి ధర పలుకుతుంది… గతంలో మూడు వందల రూపాయల కూరగాయలు కొనుగోలు చెస్తే వారం రొజులకి సరిపడేది.ఇప్పుడు కనీసం రెండు రోజులకి కూడ సరిపోవడం లేదు..ఈధరలు మరింత పెరిగే అవకాశం వుందని వ్యాపారస్తులు చెబుతున్నారు… కొత్త పంట చేతికి వచ్చేంత వరకి ధరలు సామాన్యడికి అందుబాటులో ఉండవు.
ఇప్పటికి ఎండ తీవ్రత ఉంది.దింతో.. కొత్త పంట సాగు చేయడం కష్టంగా మారింది. వర్షాలు కురియక పోతే.. కూరగాయల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది..
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..