Telangana: గుండె కుడి వైపు ఉందని భార్యను వదిలేసిన భర్త.. ఆపై ఏం చేశాడో తెలుసా..?
ఖమ్మంలో ఓ యువతి భర్త కోసం ఆరేళ్లుగా పోరాటం చేస్తోంది. ఆమెకు గుండె కుడి వైపు ఉందనే నెపంతో పెళ్లయిన 15 రోజులకే వదిలేశాడు ఆ భర్త. యువకుడు తండ్రి పోలీస్ డిపార్డ్‌మెంట్‌లో విధులు నిర్వహిస్తుండటంతో తనకు న్యాయం జరగడం లేదంటూ యువతి ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన భర్తను చూపించాలంటూ వెళ్లిన ప్రతిసారీ తనపై అత్తామామలు విచక్షణారహితంగా దాడి చేశారని, తమకు న్యాయం చేయాలంటూ యువతి వేడుకుంటోంది.
ఖమ్మంలో ఓ యువతి భర్త కోసం ఆరేళ్లుగా పోరాటం చేస్తోంది. ఆమెకు గుండె కుడి వైపు ఉందనే నెపంతో పెళ్లయిన 15 రోజులకే వదిలేశాడు ఆ భర్త. యువకుడు తండ్రి పోలీస్ డిపార్డ్‌మెంట్‌లో విధులు నిర్వహిస్తుండటంతో తనకు న్యాయం జరగడం లేదంటూ యువతి ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన భర్తను చూపించాలంటూ వెళ్లిన ప్రతిసారీ తనపై అత్తామామలు విచక్షణారహితంగా దాడి చేశారని, తమకు న్యాయం చేయాలంటూ యువతి వేడుకుంటోంది.
ఖమ్మం నగరానికి చెందిన వెంకటేశ్వర్లు విజయలక్ష్మి దంపతుల కుమార్తె గంగాభవానిని బోనకల్లులో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేసే వెంకటేశ్వర్లు కుమారుడు భాస్కరాచారికి ఇచ్చి 2018 లో వివాహం జరిపించారు, పెళ్లయిన 15 రోజులకే అదనపు కట్నం కోసం గంగాభవానిపై వేధింపులు మొదలుపెట్టారు భర్త కుటుంబం. అంతేకాదు గంగాభవానికి గుండె కుడివైపు ఉందని ఆ విషయం తనకు చెప్పకుండా పెళ్లి చేశారంటూ ఆమెను పుట్టింటికి పంపించేశారు. దీంతో 2019లో ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్ లో గంగాభవాని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు పోలీసులు. కేసు విచారించిన న్యాయస్థానం తీర్పు వెలువడే వరకు ప్రతి నెల 15 వేల రూపాయలు మనో వర్తి చెల్లించాలని ఆదేశించింది. ఎన్ని రోజులైనా భాస్కరాచారి స్పందించకపోవడంతో బాధితురాలు గంగాభవాని హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా గంగభవానికి అనుకూలంగా ప్రతి నెల పదివేల రూపాయలు మనోవర్తి చెల్లించాలని ఆదేశించింది.
అయినా భాస్కరాచారి కుటుంబం పట్టించుకోలేదు, 2022లో ఖమ్మం కోర్టులో రాజీ కుదుర్చుకుని 13 లక్షల రూపాయల ఇస్తామని పెద్ద మనుషుల ముందు అంగీకరించిన భాస్కరాచారి కుటుంబం, తర్వాత ఆ విషయాన్ని పట్టించుకోలేదు. మనోవర్తి డబ్బులు అడిగేందుకు భర్త జాడ తెలుసుకునేందుకు తన తల్లితో కలిసి గంగాభవాని బోనకల్లులోనే అత్తమామల ఇంటికి వెళ్లగా గంగాభవానిపై అత్తమామలు వెంకటేశ్వర్లు, అన్నపూర్ణ విచక్షణ రహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన గంగాభవాని కి ఖమ్మంలోనే ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు తల్లిదండ్రులు.
30 లక్షల కట్నం తీసుకుని పెళ్లయిన 15 రోజులకే గుండె కుడివైపు ఉందనే సాకుతో తనను ఇంటి నుండి తరిమేశారని, నాటి నుండి నేటి వరకు తన భర్త కోసం పోరాటం చేస్తున్నానని వేడు వెళ్లబోసుకుంది గంగాభవానీ. ఓవైపు ఆర్థికంగా, శారీరకంగా మరోవైపు మానసికంగా ఆరేళ్లుగా కృంగిపోతున్నానని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తుంది. తన భర్త భాస్కరాచారి పై ఇప్పటికే నాలుగు అరెస్టు వారెంట్లు ఉన్న పోలీసులు అతనిని కోర్టులో ప్రవేశపెట్టకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిపింది. తన మామ వెంకటేశ్వర్లు పోలీస్ హెడ్ కానిస్టేబుల్ గా పని చేయడం మూలంగానే పోలీసులు తమకు న్యాయం చేయడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారుల స్పందించి తనకు న్యాయం చేయాలని, తనపై విచక్షణ రహితంగా దాడి చేసిన తన మామ హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు పై చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేస్తోంది.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..