Telangana: 1ఫాదర్స్ డే రోజున అమానుష ఘటన… తల్లిని నడిరోడ్డుపైకి గెంటేసిన కొడుకులు..!

ఉన్న ఆస్తిని లాక్కున్న కన్న కొడుకులు.. కనిపెంచిన తల్లిని నడిరోడ్డుపాలు చేశారు. దీంతో ఆ తల్లి ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ రోడ్డు పక్కనే బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది. కోడళ్ల మధ్య గొడవల కారణంగా తనను బయటకి పంపించారని, తనకు న్యాయం చేయాలని వృద్ధురాలు వేడుకుంటోంది.

Telangana: 1ఫాదర్స్ డే రోజున అమానుష ఘటన... తల్లిని నడిరోడ్డుపైకి గెంటేసిన కొడుకులు..!
Mother On Road
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Jun 16, 2024 | 5:48 PM

ఉన్న ఆస్తిని లాక్కున్న కన్న కొడుకులు.. కనిపెంచిన తల్లిని నడిరోడ్డుపాలు చేశారు. దీంతో ఆ తల్లి ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ రోడ్డు పక్కనే బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది. కోడళ్ల మధ్య గొడవల కారణంగా తనను బయటకి పంపించారని, తనకు న్యాయం చేయాలని వృద్ధురాలు వేడుకుంటోంది.

జనగాం జిల్లా కోడకండ్ల మండల కేంద్రంలో పల్లె వెంకటమ్మకు ముగ్గురూ కొడుకులు ముగ్గురూ కూతుర్లు ఉన్నారు. భర్త చనిపోవడంతో పిల్లలే ప్రాణంగా కాలం వెళ్లదీస్తోంది. తల్లి పేరుతో ఉన్న అస్తులును ముగ్గురు కొడుకులు పల్లె భిక్షం, ఉప్పలయ్య, శివయ్య పంచుకుని వారి పేర్లతో మార్చుకున్నారు. అన్నదమ్ముల మధ్య గొడవల పోటీతత్వంతో తల్లిని ఇంట్లో నుంచి గెంటేశారు. ఎక్కడ ఉండాలో తెలియక ఆ తల్లి వెంకటమ్మ వీధిన పడింది. గత 15 రోజుల నుండి మండల కేంద్రంలోని గౌడ సంఘం కమిటీ హల్ సమీపంలో ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ బిక్కు బిక్కు మంటూ తల దాచుకుంటోంది. ఆమె దీనస్థితిని చూసి స్థానికులు చలించిపోయారు. గ్రామస్తులు దయ తలచి రోజుకు ఒక్క పూట భోజనం అందిస్తే, ఆ పూట కడుపు నింపుకుంటూ మరో పూట కడుపు మాడ్చుకుంటోంది.

వృద్ధురాలి పరిస్థితిని గమనించిన గ్రామ కుల పెద్దలు ఆమె కొడుకులను మందలించి ఇంటికి పంపించే ప్రయత్నం చేశారు. అయినా కుల పెద్దల మాటలను పట్టించుకోని కొడుకులు నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్పడంతో చేసేదీలేక వెనుదిరిగి వెళ్ళారు. తల్లిని తీసుకువెళ్లేందుకు కూతుళ్లు సైతం నిరాకరించారు. ఆస్తులు తీసుకున్న కొడుకులే తల్లిని సాకాలంటూ కూతుర్లు ముగ్గురు తేల్చి చెబుతున్నారు. దీంతో తన ఆస్తిని తన ఇల్లును తీసుకుని తనకు ఏం లేకుండా చేసి రోడ్డుపై వదిలేశారంటూ ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. గ్రామ కుల పెద్ద శ్రీశైలం డబ్బులు తీసుకుని కాలయాపన చేస్తున్నాడని ఆ తల్లి ఆరోపించింది. తన భూమిని తనకు ఇప్పించాలని, తనను ఎవరు చూసుకుంటే వాళ్లకే తదనంతరం ఆస్తి తీసుకోవాలని కోరుతోంది తల్లి పల్లె వెంకటమ్మ.

ఇదిలావుంటే, ఈ విషయాన్ని గ్రామస్తులు స్థానిక ఎస్సై బండి శ్రావణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంకటమ్మ కొడుకులను, కూతుళ్లను పిలిపించి మందలించారు. కొంత మారినట్లు కనిపించినా, కొద్దిరోజులకే యధావిధిగా వృద్ధురాలిని కమిటీ హాల్‌లోనే వదిలేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Latest Articles