AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: అమరావతి ఇక అన్‌స్టాపబుల్‌.. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్..

ఏపీలో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం.. ప్రాధాన్యతాక్రమంలో పని మొదలెట్టింది. అర్ధాంతరంగా ఆగిన అమరావతిని.. మళ్లీ పునరుజ్జీవం చేసే దిశగా అడుగులు వేస్తోంది. పట్టణాభివృద్ధిశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక పొంగూరు నారాయణ చేసిన వ్యాఖ్యలు, ప్రజారాజధానికి ఊతమిస్తున్నాయి. జస్ట్‌ రెండున్నరేళ్లలో..

AP News: అమరావతి ఇక అన్‌స్టాపబుల్‌.. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్..
Ap News
Ravi Kiran
|

Updated on: Jun 16, 2024 | 11:33 PM

Share

ఏపీలో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం.. ప్రాధాన్యతాక్రమంలో పని మొదలెట్టింది. అర్ధాంతరంగా ఆగిన అమరావతిని.. మళ్లీ పునరుజ్జీవం చేసే దిశగా అడుగులు వేస్తోంది. పట్టణాభివృద్ధిశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక పొంగూరు నారాయణ చేసిన వ్యాఖ్యలు, ప్రజారాజధానికి ఊతమిస్తున్నాయి. జస్ట్‌ రెండున్నరేళ్లలో అమరావతిని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తామంటూ.. ఆయన చేసిన కామెంట్స్‌ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అమరావతి ఇక అన్‌స్టాపబుల్‌ అనే చర్చ మొదలైందిప్పుడు.

అఖండ మెజార్టీతో ఏపీలో అధికారం దక్కించుకున్న ఎన్డీఏ కూటమి… తొలి ప్రాధాన్యతగా రాజధాని అమరావతిపై ఫోకస్‌ పెట్టింది. గతంలోనే మొదలై.. ప్రభుత్వం మారడంతో అర్ధాంతరంగా నిలిచిపోయిన ప్రజా రాజధానికి పనులకు శ్రీకారం చుట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఆ దిశగా ఇప్పటికే సీఆర్డీఏ అధికారులను అలర్ట్‌ చేసింది.

పురపాలక శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పొంగూరు నారాయణ .. తనపని మొదలెట్టేశారు. రాజధాని అమరావతి పనులు వేగవంతం చేయడమే.. మొదటి ప్రాధాన్యతగా తమశాఖ పనిచేస్తుందని స్పష్టం చేశారు. రెండున్నరేళ్లలో అమరావతిలో కీలక నిర్మాణాలు పూర్తి చేస్తామని చెప్పారు. పాత మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారమే రాజధాని అభివృద్ధిని ముందుకు సాగుతుందని తెలిపారు.

2014-19 మధ్య పురపాలిక మంత్రిగా పనిచేసిన నారాయణకు.. ఇప్పుడు మరోసారి అదేశాఖ దక్కడం విశేషం. అంతేకాదు, గతంలో ఆయన విధులు నిర్వర్తించిన చాంబర్‌లోనే మరోసారి బాధ్యతలు చేపట్టిన నారాయణ… ప్రపంచ టాప్‌5 రాజధానుల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. మూడు దశల్లో రాజధాని నిర్మాణం జరుగుతుందన్న నారాయణ.. తొలి విడత 48 వేలకోట్లు ఖర్చు అవుతుందన్నారు. మూడు దశలకు కలిపి లక్ష కోట్ల వరకు ఖర్చు అంచనా వేశామన్నారు.

ఫలితాలు రావడంతోనే.. రాజధాని ప్రాంతంలో.. అభివృద్ధిపనులకు బీజం పడింది. జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు మొదలెట్టిన సీఆర్డీఏ … తదిదశలో ఉన్న నిర్మాణాలను.. వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. తాజాగా, మంత్రి నారాయణ బాధ్యతలు స్వీకరించడంతో.. క్యాపిటల్‌లో డెవలప్‌మెంట్‌ మరింత స్పీడందుకుంటుందనే చర్చ జోరుగా సాగుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..