Andhra Pradesh: నెల్లూరులో జోరందుకున్న వలసలు.. పవర్ కోసం పార్టీ మారుతున్న నేతలు..!
ఓడలు బండ్లు.. బండ్లు ఓడలవుతాయి. ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా ఇదే ట్రెండ్ అవుతుంది. నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం ఇదే సామెత 2.0 కొనసాగుతోంది. 2019లో పదికి పది స్థానాలు గెలుచుకుంది వైసీపీ. అయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అదే పదికి.. పది స్థానాలను జిల్లాలో కైవసం చేసుకుని ఈ రికార్డు తిరగరాసింది.
ఓడలు బండ్లు.. బండ్లు ఓడలవుతాయి. ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా ఇదే ట్రెండ్ అవుతుంది. నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం ఇదే సామెత 2.0 కొనసాగుతోంది. 2019లో పదికి పది స్థానాలు గెలుచుకుంది వైసీపీ. అయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అదే పదికి.. పది స్థానాలను జిల్లాలో కైవసం చేసుకుని ఈ రికార్డు తిరగరాసింది. ఎమ్మెల్యేలందరూ టీడీపీ ఖాతాలోకి వెళ్ళగా, ఎమ్మెల్సీలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరూ కూడా అధికార పార్టీ వైపు పక్క చూపులు చూస్తున్నారట. నెల్లూరు నగర మేయర్ తో మొదలైన ఈ వలసల పర్వం ఎక్కడ దాకా వెళ్తుందో అన్నదీ హాట్ టాపిక్‌గా మారింది.
పదవి ఉంటే సరిపోదు.. ఆ పదవికి పవర్ ఉండాలి. పవర్ లేని పదవి ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే ఇదే ట్రెండ్ ప్రస్తుతం ఏపీ తోపాటు నెల్లూరు జిల్లాలో కూడా నడుస్తోంది. గతంలో వైసీపీలో గెలిచిన మేయర్ అబ్దుల్ అజీజ్ టీడీపీ ప్రభుత్వం రాగానే ఆ పార్టీలోకి మారిపోయారు. ఇదే పరిస్తితి ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో రిపీట్ అవుతోంది. వైసీపీలో మేయర్‌గా గెలిచిన స్రవంతి, ప్రస్తుతం టీడీపీ లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారట. కేవలం పదవి ఉంటే సరిపోదు పవర్ కూడా ఉండాలిగా అంటున్నారు నెల్లూరు జిల్లాలో పలువురు ప్రజా ప్రతినిధులు. పవర్ కోసం ఏ మాత్రం ఆలోచన లేకుండా పార్టీ మారేందుకు ఎవరికి వారు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది.
ఏపీలో నెల్లూరు జిల్లా వైసీపీకి స్ట్రాంగెస్టు జిల్లాగా కొనసాగింది. గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లా వైసీపీ పదికి పది స్థానాలతో పాటు రెండు పార్లమెంట్ స్థానాలు సాధించింది. నెల్లూరు మేయర్ తోపాటు 54 డివిజన్ కార్పొరేటర్లలతో కలిపి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు స్థానాలో వైసీపీ విజయం సాధించి, జిల్లాలోనే వైసీపీ కి స్టాంగెస్ట్ అని రుజువు చేసింది. అలాగే ఆ తరువాత జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లోనూ వైసీపీ సత్తా చాటింది.
నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ రెండు నియోజకవర్గాలు కూడా కార్పొరేషన్ పరిధిలో ఉన్నాయి. గత ఏడాదిన్నర క్రితం వైసీపీ రూరల్ సిట్టింగ్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలోకి వెళ్లడంతో, మేయర్ స్రవంతి కూడా కోటంరెడ్డి బాటలోనే పయనిస్తానని ఆయన వెంటే ఉంటానంటూ తేల్చి చెప్పింది. వైసీపీ మేయర్‌గా ఉంటూనే టీడీపీ లోకి వెళ్తున్నటు ప్రకటించారు. అయితే అది జరిగిన కొద్ది రోజులకే ఏమైందో ఏమో గాని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తమకు అవకాశం కల్పించారని అందుకే తాము వైసీపీ లోనే కొనసాగుతామంటూ మీడియా.ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల ఫలితాలు రావడం టీడీపీ అధికారంలోకి రావడంతో అందరూ ముందుగానే ఊహించినట్లే మేయర్ స్రవంతి దంపతులు వైసీపీకి రాజీనామా చేసి కీలక వ్యాఖ్యలు చేశారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తమకు అవకాశం ఇచ్చారని, వైసీపీ నేతలు బెదిరింపుల వల్ల పార్టీని వదిలి వెళ్లాల్సి వచ్చిందన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మన్నించి తమను అక్కున చేర్చుకోవాలని కన్నీరు పెట్టుకున్నంత పని చేశారు.
నెల్లూరు మేయర్‌తో మొదలైన వైసీపీ రాజీనామాల పర్వం జిల్లాలోని మిగినిన మున్సిపాలిటీలలో కొనసాగుతుందా అనే చర్చ మొదలైంది.. ఆత్మకూరులో మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికలకు ముందే ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి టీడీపీలో చేరిపోయారు. మిగిలిన వారిలో మరి కొంతమంది మున్సిపల్ కౌన్సిలర్లు టీడీపీలోకి వస్తారని అనుకుంటుంటే, అంత కంటే ఎక్కువగా పలువురు ప్రజా ప్రతినిధులే టీడీపీ గూటికి చేరేందుకు తొందర పడుతున్నారట. పవర్ ఉంటేనే పదవికి ఫలితం ఉంటుందంటూ బాహాటంగానే చెబుతున్నారట. లేదంటే పవర్ లేని పదవి ఉపయోగం లేదన్న ధోరణిలో కొందరు నేతలు ముందే సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారట. ఇక జిల్లాలో మిగిలిన ముగ్గురు ఎమ్మెల్సీలు, మున్సిపల్ చైర్‌పర్సన్లు ఎంత మంది వైసీపీలో ఉంటారు. ఎంత మంది టీడీపీలోకి వెళ్తారు అనేది వేచి చూడాల్సిందే..!
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…