Viral Video: స్పోర్ట్స్ బైక్‌ రైడ్‌ను ఎంజాయ్ చేస్తోన్న తాత, బామ్మ.. రియల్ రోమియో ఇతడే..

తాజాగా కెటిఎమ్ బైక్ కు సంబందించిన ఓ వీడియోలో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. అందులో ఓ వృద్ధ జంట ఏంటో సంతోషంగా కెటిఎమ్ బైక్ మీద వెళ్తోంది. ఈ వీడియోలో పెద్ద వయసున్న వ్యక్తీ కెటిఎమ్ బైక్ ను నడుపుతున్నాడు.. తాత వెనుక భార్య కూర్చుని ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తోంది. వీరు రోడ్డు మీద కెటిఎమ్ బైక్ మీద వెళ్తుండగా అటుగా వెళ్తున్న ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు ఉన్నారు.. ఇప్పుడు ఈ వీడియో ఓ రేంజ్ లో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఈ వృద్ధ జంట తమిళనాడుకు చెందినట్లు కట్టుబొట్టు చూస్తే తెలుస్తోంది.

Viral Video: స్పోర్ట్స్ బైక్‌ రైడ్‌ను ఎంజాయ్ చేస్తోన్న తాత, బామ్మ.. రియల్ రోమియో ఇతడే..
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Jun 17, 2024 | 6:12 PM

నేటి యువతీయువకులకు కార్లను నడపడం కంటే బైక్స్ ను నడపడాన్నే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా స్పోర్ట్స్ బైక్స్ ను ఎక్కువగా యువకులు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా కెటిఎమ్ బైక్స్ ను రైడ్ చేస్తూ యుత్ భలే ఎంజాయ్ చేస్తుంటారు. అయితే తాజాగా కెటిఎమ్ బైక్ కు సంబందించిన ఓ వీడియోలో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. అందులో ఓ వృద్ధ జంట ఏంటో సంతోషంగా కెటిఎమ్ బైక్ మీద వెళ్తోంది. ఈ వీడియోలో పెద్ద వయసున్న వ్యక్తీ కెటిఎమ్ బైక్ ను నడుపుతున్నాడు.. తాత వెనుక భార్య కూర్చుని ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తోంది. వీరు రోడ్డు మీద కెటిఎమ్ బైక్ మీద వెళ్తుండగా అటుగా వెళ్తున్న ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు ఉన్నారు.. ఇప్పుడు ఈ వీడియో ఓ రేంజ్ లో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఈ వృద్ధ జంట తమిళనాడుకు చెందినట్లు కట్టుబొట్టు చూస్తే తెలుస్తోంది.

తమిళనాడుకి చెందిన ఓ వృద్ద జంట KTM RC 390 బైక్ రైడ్ చేసుకుంటూ రోడ్డుమీద వెళ్తోంది. వైరల్ అవుతున్న వీడియో చూస్తే బైక్ ను నడుపుతున్న తాత గారితో పాటు వెనుక కూర్చుకున్న బామ్మ కూడా ప్రయాణాన్ని ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తోంది. వీరిద్దరి మధ్య బట్టలతో నింపిన ఓ బాస్కెట్ కూడా ఉంది. ఆ జంటను.. వారి సంతోషం చూస్తే చాలా సంతోషంగా ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు రోజులో ఎన్నో వీడియోలు చూస్తాం.. కానీ ఇలాంటి వీడియో మాత్రం బహు అరుదు అని చెప్పవచ్చు అని కామెంట్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను లక్షలాది మంది చూస్తున్నారు. పలువురు వృద్ధ జంటపై కామెంట్స్ చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాతగారు KTM బైక్ రైడ్ చేయడానికి వయసు ఒక క్వాలిఫికేషన్ కాదు.. అది ఒక సంఖ్య మాత్రమే అని నిరూపించాడు అని కామెంట్ చేయగా.. ఇష్టం, ఆసక్తి ఉంటే ఎలాంటి బైక్ ను అయినా రైడ్ చేయడం పెద్ద కష్టం కాదని తాతగారు కాదని చెప్పకనే చెప్పేశాడని ఫన్నీగా వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ వృద్ధ దంపతులు హ్యాపీగా బైక్ మీద ఎక్కడికో వెళ్తున్నారు. అయితే బైక్ రైడ్ చేస్తున్న తాతగారు హెల్మెట్ ధరించలేదు. గ్రామీణ ప్రాంతాల్లో బైక్ రైడ్ చేసేవారు ఇప్పటికి హెల్మెట్ ధరించడం అలవాటు చేసుకోలేదు.. తక్కువ దూరం లేదా పొలాలకు కూడా బండి మీద వెళ్ళే అలవాటు ఉంది. కనుక నిర్లక్ష్యం వద్దు హెల్మెట్ ధరించండి.. అనుకోని ప్రమాదం ఏర్పడితే ప్రాణాలను కాపాడే రక్షణ కవచం హెల్మెట్ అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మీరు కారును అమ్ముతున్నారా? ముందు ఇది చేయండి.. లేకుంటే కోర్టుకే..
మీరు కారును అమ్ముతున్నారా? ముందు ఇది చేయండి.. లేకుంటే కోర్టుకే..
ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే
ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం