- Telugu News Photo Gallery Be sure to keep these things in mind while donating blood, check here is details in Telugu
Blood Donation: బ్లడ్ డొనేట్ చేసేటప్పుడు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
రక్త దానం అనేది ఓ పుణ్య కార్యంగా చెప్తారు. ఎందుకంటే రక్త దానం చేయడం వల్ల ఓ మనిషి ప్రాణాలు కాపాడిన వారవుతారు. అంతే కాకుండా మీకు కూడా ఎంతో ఆరోగ్యం. అయితే రక్త దానం చేసేటప్పుడు కొన్ని రకాల విషయాలను తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాలి. అసలు రక్తదానాన్ని ఎవరు చేయవచ్చు? ఈ ప్రక్రియ ఎలా ఉంటుంది? ఏ విషయాన్ని గుర్తించుకోవాలి? అనేవి ఇప్పుడు తెలుసుకుందాం. మీరు రక్త దానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా.. అసలు మీకు రక్తదానం చేసే యోగ్యత ఉందో..
Updated on: Jun 18, 2024 | 3:24 PM

రక్త దానం అనేది ఓ పుణ్య కార్యంగా చెప్తారు. ఎందుకంటే రక్త దానం చేయడం వల్ల ఓ మనిషి ప్రాణాలు కాపాడిన వారవుతారు. అంతే కాకుండా మీకు కూడా ఎంతో ఆరోగ్యం. అయితే రక్త దానం చేసేటప్పుడు కొన్ని రకాల విషయాలను తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాలి. అసలు రక్తదానాన్ని ఎవరు చేయవచ్చు? ఈ ప్రక్రియ ఎలా ఉంటుంది? ఏ విషయాన్ని గుర్తించుకోవాలి? అనేవి ఇప్పుడు తెలుసుకుందాం.

మీరు రక్త దానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా.. అసలు మీకు రక్తదానం చేసే యోగ్యత ఉందో లేదో చెక్ చేసుకోవాలి. మీ ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రక్తదానాన్ని చేయాలి.

ఈ విషయాన్ని మీరు బ్లడ్ డొనేషన్ కేంద్రానికి వెళ్లి సంప్రదించవచ్చు. అదే విధంగా మీరు బ్లడ్ డొనేషన్ చేసేటప్పుడు.. మీ ఆరోగ్యం గురించి ప్రతీ విషయం దాచకుండా చెప్పాలి. లేదంటే రక్తం తీసుకున్న వ్యక్తిపై ప్రతికూల ప్రభావం పడొచ్చు.

రక్త దానం చేయడానికి ముందు.. ఆ తర్వాత రోజు.. నీళ్లను ఎక్కువగా తాగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. రక్తం తయారయ్యేందుకు వీలుగా.. ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి.

రక్త దానం చేసే సమయంలో ఆందోళన పడకుండా, భయం లేకుండా ఉండాలి. రక్త దానం చేశాక ఓ పావు గంట సేపు వరకూ విశ్రాంతి తీసుకోవాలి. వెంటనే లేచి ఎక్కడికీ వెళ్లకూడదు. దీని వల్ల కళ్లు తిరిగే ఛాన్స్ ఉంది. నీళ్లు ఎక్కువగా తాగాలి.




