Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitchen Cleaning Tips : ‘నో జిడ్డు, నో మరక’ ఇలా చేస్తే రెండు నిమిషాల్లో గ్యాస్‌ బర్నర్‌ తళతళ మెరుస్తుంది..!

నిజానికి గ్యాస్‌ బర్నర్‌పై నూనె లేదా గ్రేవీ పడితే, దాని రంధ్రాలు మూసుకుపోతాయి. దీని కారణంగా గ్యాస్‌ స్టౌవ్‌ మంట కూడా  తగ్గుతుంది. దీంతో గ్యాస్‌ ఎక్కువగా వృధా అవుతుంది. కానీ, దానిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తే తిరిగి కొత్తవిలా మెరుస్తాయి. మీరు కూడా మీ డర్టీ గ్యాస్ బర్నర్‌లను శుభ్రం చేయడంలో అలసిపోతున్నట్టయితే, వాటిని శుభ్రం చేయడంలో మీకు సహాయపడే కొన్ని చిట్కాలను ఇక్కడ తెలుసుకుందాం..

Kitchen Cleaning Tips : 'నో జిడ్డు, నో మరక' ఇలా చేస్తే రెండు నిమిషాల్లో గ్యాస్‌ బర్నర్‌ తళతళ మెరుస్తుంది..!
Kitchen Cleaning Tips
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 19, 2024 | 2:55 PM

వంటగదిని శుభ్రంగా, చక్కగా చూసుకోవటం కోసం ఆడవారు ఎంతో కష్టపడుతుంటారు. వంటగది పరిశుభ్రంగా ఉంటేనే మనం ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటాం. అయితే, ఇంట్లోని ఇతర భాగాలతో పోలిస్తే వంటగదిని శుభ్రం చేయడం శ్రమతో కూడికున్న పని. ముఖ్యంగా గ్యాస్ స్టౌవ్‌, బర్నర్ క్లీనింగ్ తలనొప్పిగా మారుతుంది. తరచూ పొయ్యిమీద పాలు, టీ, అన్నం, పప్పు వంటివి చిల్లడం, పొంగడం జరుగుతూ ఉంటుంది. దీంతో పదే పదే గ్యాస్‌ స్టౌవ్‌ జిడ్డుగా మారుతూ ఉంటుంది. నిజానికి గ్యాస్‌ బర్నర్‌పై నూనె లేదా గ్రేవీ పడితే, దాని రంధ్రాలు మూసుకుపోతాయి. దీని కారణంగా గ్యాస్‌ స్టౌవ్‌ మంట కూడా  తగ్గుతుంది. దీంతో గ్యాస్‌ ఎక్కువగా వృధా అవుతుంది. కానీ, దానిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తే తిరిగి కొత్తవిలా మెరుస్తాయి. మీరు కూడా మీ డర్టీ గ్యాస్ బర్నర్‌లను శుభ్రం చేయడంలో అలసిపోతున్నట్టయితే, వాటిని శుభ్రం చేయడంలో మీకు సహాయపడే కొన్ని చిట్కాలను ఇక్కడ తెలుసుకుందాం..

ఆపిల్‌ సైడర్‌ వెనిగర్‌ వాడి:

గ్యాస్‌ స్టౌవ్‌ బర్నర్‌ను మెరిసేలా చేయడానికి ఆపిల్ సైడర్‌ వెనిగర్‌ను ఒక పాత్రలో పోసి అందులో గ్యాస్ బర్నర్‌ను ముంచండి. కొంత సమయం తరువాత, నిమ్మకాయ, బేకింగ్ పౌడర్ అప్లై చేసి, టూత్ బ్రష్ సహాయంతో శుభ్రం చేయండి. ఇలా చేయడం వల్ల గ్యాస్ బర్నర్‌పై ఉండే మురికి శుభ్రపడి కొత్త బర్నర్‌లా మెరుస్తుంది.

ఇవి కూడా చదవండి

నిమ్మకాయ, జిన్‌తో శుభ్రం చేయండి:

గ్యాస్ బర్నర్‌ను శుభ్రం చేయడానికి, ఒక పాత్రలో వేడి నీటిని తీసుకొని అందులో నిమ్మరసం, జిన్ కలపండి. దీని తరువాత, బర్నర్‌ను కనీసం రెండు గంటలు అందులో నానబెట్టండి. రెండు గంటల తర్వాత, బర్నర్‌పై లిక్విడ్ సోప్ అప్లై చేసి, టూత్ బ్రష్‌తో రుద్దండి. ఇలా చేయడం ద్వారా బర్నర్ షైన్ తిరిగి వస్తుంది.

నీరు, వెనిగర్ తో శుభ్రం చేయండి:

బర్నర్ వెనిగర్ సహాయంతో సులభంగా శుభ్రం చేయవచ్చు. దీని కోసం మీరు ఒక పాత్రలో నీరు, వెనిగర్ కలపాలి. ఆ తరువాత అందులోనే బేకింగ్ సోడా వేసి బర్నర్‌ను ఒకటి నుండి రెండు గంటల పాటు నాననివ్వండి. దీని తరువాత బర్నర్ను తీసి టూత్ బ్రష్‌తో శుభ్రం చేయండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..