Madhya Pradesh: రాష్ట్ర మంత్రి సన్నిహితుడు, బీజేపీ యువ నేత దారుణ హత్య..!

బీజేపీ యువమోర్చా నగర ఉపాధ్యక్షుడు మోను కళ్యాణే ఆదివారం ఇండోర్‌లో దారుణ హత్యకు గురయ్యాడు. మోను మధ్యప్రదేశ్ ప్రభుత్వ కేబినెట్ మంత్రి కైలాష్ విజయవర్గియాకు అత్యంత సన్నిహితుడు. ఈ ఘటన నగరంలోని ఎంజీ రోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిమన్‌బాగ్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

Madhya Pradesh: రాష్ట్ర మంత్రి సన్నిహితుడు, బీజేపీ యువ నేత దారుణ హత్య..!
Bjp Leader
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 23, 2024 | 12:09 PM

బీజేపీ యువమోర్చా నగర ఉపాధ్యక్షుడు మోను కళ్యాణే ఆదివారం ఇండోర్‌లో దారుణ హత్యకు గురయ్యాడు. మోను మధ్యప్రదేశ్ ప్రభుత్వ కేబినెట్ మంత్రి కైలాష్ విజయవర్గియాకు అత్యంత సన్నిహితుడు. ఈ ఘటన నగరంలోని ఎంజీ రోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిమన్‌బాగ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. పాత కక్షల కారణంగా పీయూష్, అర్జున్ మోను కళ్యాణే కాల్చిచంపినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితులిద్దరూ పరారీలో ఉండడంతో వారి కోసం గాలిస్తున్నారు.

ఇండోర్ అసెంబ్లీ ఎన్నికల్లో క్రియాశీలకంగా వ్యవహారించిన మోను కళ్యాణే, కైలాష్ విజయవర్గీయ కుమారుడు మాజీ ఎమ్మెల్యే ఆకాష్ విజయవర్గీయ అత్యంత సన్నిహితుల్లో ఒకరు. మోను కళ్యాణ్‌కు అతి దగ్గరగా వచ్చిన దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. బుల్లెట్‌తో గాయపడిన మోనును అతని స్నేహితులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోను కళ్యాణ్ శనివారం రాత్రి భగవా యాత్రకు సిద్ధమవుతున్నాడు. ఇంతలో పియూష్, అర్జున్ అనే ఇద్దరు యువకులు బైక్‌పై చిమన్‌బాగ్ కూడలికి చేరుకున్నారు.

ఇద్దరూ బైక్ మీద కూర్చొని మోనుతో ఏదో చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఇంతలో బైక్‌పై వెనుక కూర్చున్న అర్జున్ పిస్టల్ తీసుకుని మోను కళ్యాణేపై కాల్పులు జరిపి పీయూష్‌తో పాటు అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితులు చిమ్నాబాగ్ కూడలిలో ఉన్న మోను స్నేహితులపై కూడా కాల్పులు జరిపారు. అయితే వారు ప్రాణాలతో బయటపడ్డారు. కైలాష్ విజయవర్గీయ కుమారుడు, ఇండోర్ 03 అసెంబ్లీ మాజీ ఎమ్మెల్యే ఆకాష్ విజయవర్గియా తన మద్దతుదారులతో మోను ఇంటికి చేరుకుని అతని కుటుంబ సభ్యులను కలుసుకుని వారిని ఓదార్చారు.

కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…