AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో ఇదేం ప్రేమ నాయనా..! మత్తుమందు ఇచ్చి అబ్బాయిని అమ్మాయిగా మార్చేశాడు

ఇష్టపడిన వారిని దక్కించుకోవడానికి ఎంతకైనా తెగించే సినిమా ప్రేమలు మీరు చాలానే చూసి ఉంటారు. అవతలి వ్యక్తికి ఎలాంటి ఫీలింగ్‌ లేకపోయినా జస్ట్‌ ఫీల్‌ మై లవ్‌.. అంటూ వెంటపడే రోమియోలు ఉన్నారు. కానీ ఇతనిది మాత్రం మామూలు ప్రేమకాదు. బలవంతంగానైనా తన ప్రేమను సొంతం చేసుకోవాలని.. అంతకుమించి ప్రవర్తించాడో ఉన్మాది. నచ్చిన యువకుడిని పెళ్లి చేసుకోవడం కోసం సస్పెన్స్‌ థ్రిల్లర్‌..

వామ్మో ఇదేం ప్రేమ నాయనా..! మత్తుమందు ఇచ్చి అబ్బాయిని అమ్మాయిగా మార్చేశాడు
Gender Change Surgery
Srilakshmi C
|

Updated on: Jun 21, 2024 | 12:01 PM

Share

లక్నో, జూన్‌ 21: ఇష్టపడిన వారిని దక్కించుకోవడానికి ఎంతకైనా తెగించే సినిమా ప్రేమలు మీరు చాలానే చూసి ఉంటారు. అవతలి వ్యక్తికి ఎలాంటి ఫీలింగ్‌ లేకపోయినా జస్ట్‌ ఫీల్‌ మై లవ్‌.. అంటూ వెంటపడే రోమియోలు ఉన్నారు. కానీ ఇతనిది మాత్రం మామూలు ప్రేమకాదు. బలవంతంగానైనా తన ప్రేమను సొంతం చేసుకోవాలని.. అంతకుమించి ప్రవర్తించాడో ఉన్మాది. నచ్చిన యువకుడిని పెళ్లి చేసుకోవడం కోసం సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మువీని మించి స్కెచ్‌ వేశాడు. అతనికే తెలియకుండ మత్తుమందిచ్చి.. ఏకంగా లింగ మార్పిడి ఆపరేషన్‌ చేయించి అమ్మాయిగా మార్చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని మన్సూర్‌పూర్‌లోని బేగ్‌రాజ్‌పూర్ మెడికల్ కాలేజీలో చోటు చేసుకున్న ఈ విచిత్ర సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన ఓంప్రకాష్‌కు సంజక్ గ్రామానికి చెందిన ముజాహిద్ (20)తో గత రెండేళ్లుగా పరిచయం. ఇటీవల ముజాహిద్ అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో మెడికల్‌ చెకప్‌ చేయిస్తానంటూ ఓంప్రకాశ్‌ జూన్‌ 3న మన్సూర్‌పుర్‌లోని బేగ్‌రాజ్‌పుర్‌ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ పలు పరీక్షలు చేసిన వైద్యులు ముజాహిద్‌కు చిన్న సర్జరీ చేయాలని చెప్పారు. ఆ మరుసటి రోజు అతడు సర్జరీకి సిద్ధమయ్యాడు. దీంతో ముజాహిద్‌ను ఆపరేషన్‌ థియేటర్‌లో బెడ్‌పై పడుకోబెట్టి, వైద్యులు మత్తు ఇంజక్షన్‌ ఇచ్చారు. వెంటనే వైద్యులు అతడి వ్యక్తిగత అవయవాలను తొలగించి లింగమార్పిడి శస్త్రచికిత్స చేశారు. అనంతరం ముజాహిద్ స్పృహలోకి రాగానే వైద్యులు తనను అమ్మాయిగా మార్చిన సంగతి గ్రహించారు. వైద్యులను ప్రశ్నించగా వాళ్లు చెప్పింది వినీ షాక్‌కు గురయ్యాడు. ఓం ప్రకాశ్‌ నాటకమాడి ఈ తతంగమంతా నడిపినట్లు తెలిసింది.

ఆ తర్వాత ఓంప్రకాశ్ అక్కడికి వచ్చి తానే ఇదంతా చేయించానని అంగీకరించాడు. ముజాహిద్‌ అంటే తనకు ఇష్టమని, జీవితాంతం తనతోనే ఉండేందుకు ఇలా చేశానని చెప్పాడు. పైగా పెళ్లి కూడా చేసుకుంటానని, అందుకు అన్ని ఏర్పాట్లు చేశానని చెప్పుకొచ్చాడు. దీంతో దిమ్మతిరిగిపోయిన ముజాహిద్‌ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పాడు. పోలీసులకు చెబితే తన కుటుంబం భూమిని లాగేసుకుంటానని, అతని తండ్రిని చంపేస్తానని బెదిరించాడు. కొన్నాళ్లు మానసిక వేధన అనుభవించిన బాధితుడు.. ఎలాగో ధైర్యం చేసి ఈ నెల 16న పోలీసులకు ఫిర్యాదు చేయడం ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. తన జీవితం నాశనం చేసిన ఓం ప్రకాశ్‌ను, అతనితోపాటు తనకు సర్జరీ చేసిన వైద్యులను కఠినంగా శిక్షించాలని, అలాగే రూ.2 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని బాధితుడు డిమాండ్‌ చేశాడు. ముజఫర్‌నగర్‌లోని స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ కేసు భారతీయ కిసాన్ యూనియన్ (BKU) నిరసనలకు దారితీసింది. ఈ కేసుపై దర్యాప్తు చేసి దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీనియర్ పోలీసు అధికారి రామశిష్ యాదవ్ హామీ ఇచ్చారు. అనంతరం ఓంప్రకాష్‌ను అరెస్టు చేయడంతో పాటు.. కేసుతో సంబంధం ఉన్న ఆసుపత్రి సిబ్బందిని పోలీసులు విచారిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.