యోగా అంటే కేవలం వ్యాయామం మాత్రమే కాదు... 6.68 లక్షల కోట్ల రూపాయల మార్కెట్

యోగా అంటే కేవలం వ్యాయామం మాత్రమే కాదు… 6.68 లక్షల కోట్ల రూపాయల మార్కెట్

Gunneswara Rao

| Edited By: Ravi Panangapalli

Updated on: Jun 21, 2024 | 11:46 AM

ఫార్ఛ్యూన్ బిజినెస్ ఇన్ సైట్స్ ప్రకారం చూస్తే.. యోగా క్లాతింగ్ మార్కెట్ 2022 నాటికి 25 బిలియన్ డాలర్లను దాటేసింది. 2030 నాటికి దీని మార్కెట్ 46 బిలియన్ డాలర్లను దాటేస్తుందని అంచనా. పైగా దీని కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్..అంటే CAGR.. 7.78 శాతముంది. సో.. ఓసారి ఈ లెక్కలు చూస్తే.. యోగా మార్కెట్ సైజ్ ఏ స్థాయిలో పెరుగుతోందో ఈజీగా అర్థమవుతుంది. ప్రభుత్వం కూడా దీనికి అధిక ప్రాధాన్యతను ఇస్తుండడంతో ప్రజలు కూడా యోగా బాట పట్టారు.

ఉదయాన్నే హ్యాపీగా నిద్రలేవండి. ఫ్రెష్ గా యోగా చేయండి. ఆ కాసేపు చేసే యోగాతో మీ ఒంటికి బలం, మనసుకు ప్రశాంతం. అలాగే దేశానికీ ఆర్థిక బలం. మేం యోగా చేస్తే.. దేశానికి ఆర్థికంగా ఎలా బలం చేకూరుతుంది అని మీరు అనుకోవచ్చు. కానీ ఇది నిజం. ఎంత నిజం అంటే.. మీరు చేసే యోగాకు సంబంధించిన అంతర్జాతీయ ఇండస్ట్రీ విలువ ఎంతో తెలుసా? 80 బిలియన్ డాలర్లు. అదీ యోగా సత్తా. యోగాకు, బిజినెస్ కు సంబంధం ఏంటి అనుకోవచ్చు. కానీ యోగా చేయడానికి వేసుకునే డ్రెస్, యోగా మ్యాట్, ఇంకా అవసరమైన వస్తువులు, యోగా స్టూడియోస్.. ఇలా చాలా రకాలుగా యోగాతో బిజినెస్ ముడిపడి ఉంటుంది. అందుకే దీని మార్కెట్ సైజ్ చిన్నదేమీ కాదు. మన దేశంలో రిటైల్ ఫిట్ నెస్ మార్కెట్ దాదాపు రెండున్నర బిలియన్ డాలర్లు ఉంటుంది. కొవిడ్ సమయంలో ఈ మొత్తం బిజినెస్ దాదాపు 154 శాతం పెరిగింది.

పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి

Published on: Jun 21, 2024 10:59 AM