2004లో ఈజేఎస్ (ఈనాడు జర్నలిజం స్కూల్) ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టాను. 2005 నుంచి సబ్ ఎడిటర్ గా ఈటీవీ2లో కెరీర్ మొదలైంది. న్యూస్, స్పెషల్ డెస్క్ లలో పనిచేశాను. 2007లో NTVలో సీనియర్ సబ్ ఎడిటర్ గా జాయిన్ అయ్యాను. బులెటిన్స్ తో పాటు స్టోరీబోర్డ్ హెడ్ గా చేశాను. ఎలక్షన్ డెస్క్ లో వర్క్ చేశాను. 2011 నుంచి 2022 వరకు TV5లో డైలీమిర్రర్ ప్రోగ్రామ్ తో పాటు స్పెషల్ డెస్క్ లో పనిచేశాను. 2014 ఎలక్షన్స్ డెస్క్ ని హ్యాండిల్ చేశాను. సరికొత్త థీమ్ తో ఎన్నికల కౌంటింగ్ ను ఆన్ స్క్రీన్ పై ప్రజెంట్ చేశాను. 2016 నుంచి TV5 వెబ్ సైట్ ఇన్ ఛార్జ్ గా కూడా వర్క్ చేశాను. హిందూధర్మం ఛానల్ ను కొన్నాళ్లపాటు హ్యాండిల్ చేశాను. 2022 లో బిగ్ టీవీలో డిజిటల్ హెడ్ గా జాయిన్ అయ్యాను. కొత్త ఛానల్ అయినా డిజిటల్ పరంగా ఎక్కువమందికి రీచ్ అవ్వడానికి కృషి చేశాను. 2023లో TV9 డిజిటల్ లో Executive Editorగా జాయిన్ అయ్యాను. 2016లో U.S. Consulate IVLP ప్రోగ్రామ్ కు సెలక్ట్ అయ్యాను. అమెరికాలో దాదాపు నెల రోజుల పాటు వివిధ రంగాల పనితీరును స్వయంగా తెలుసుకునే అవకాశం కలిగింది. ఆ అనుభవం నా వృత్తిలో బాగా ఉపయోగపడుతోంది.