Jani Master: జానీ మాస్టర్ లైఫ్ లో వంకర టింకర స్టెప్పులు.. ఇంతకీ ఏమిటి అసలు కహానీ?
జానీ మాస్టర్ కేసులో బాధితురాలిది మధ్యప్రదేశ్. ఆమె 2017లో ఓ డ్యాన్స్ షోలో పాల్గొంది. ఆ షో కు జడ్జ్ గా జానీ మాస్టర్ ఉన్నాడు. ఆ కార్యక్రమంలో బాధితురాలి పెర్ ఫార్మెన్స్ ఆయనకు నచ్చింది. తన దగ్గర డ్యాన్స్ అసిస్టెంట్ గా ఛాన్స్ ఇస్తానన్నాడు. 2019లో జానీ తనకు కాల్ చేశాడని.. తన టీమ్ లోకి ఆహ్వానించాడని చెప్పింది. అప్పటి నుంచి ఆమె కొరియోగ్రాఫర్ గా జానీ టీమ్ లో వర్క్ చేస్తోంది. కానీ ఈ ఘటనను అడ్డుపెట్టుకుని.. జానీ మాస్టర్ ఆమెపై ఎలాంటి అకృత్యాలకు పాల్పడ్డాడు?
మళయాళ చిత్రపరిశ్రమలో ఏం జరిగిందో చూశాం. ఆ దెబ్బకు తమిళ చిత్రపరిశ్రమ ఏం చేసిందో కూడా చూశాం. ఇప్పుడు టాలీవుడ్ లో అలాంటి అలెర్ట్ బెల్స్ మోగుతున్నాయి. ఓ మహిళా కొరియోగ్రాఫర్ తనపై జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు అని పోలీస్ కేసు పెట్టింది. దీంతో జానీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇప్పుడు జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ వ్యవహారంపై టాలీవుడ్ కూడా ఫోకస్ పెట్టింది. తెలుగు చిత్రపరిశ్రమలో లైంగిక వేధింపులపై విచారణకు సంబంధించి ఏర్పాటుచేసిన.. పరిష్కార ప్యానెల్ ముందుకు ఈ అంశం వెళ్లింది. మరిప్పుడు ఈ కేసులో ఏం తేలనుంది? చిత్రపరిశ్రమ పరంగా టాలీవుడ్ దీనికి ఎలాంటి పరిష్కారం చూపనుంది? బాధితురాలి విషయంలో జానీ ఎలాంటి దారుణాలకు పాల్పడ్డాడు? ఆ లేడీ కొరియాగ్రాఫర్ ఎదుర్కొన్న కష్టాలేంటి? ఇబ్బందులేంటి? తెలుగు చిత్రపరిశ్రమ.. బాధితురాలికి ఎలాంటి భరోసా ఇచ్చింది?
జానీ మాస్టర్ కేసులో బాధితురాలిది మధ్యప్రదేశ్. ఆమె 2017లో ఓ డ్యాన్స్ షోలో పాల్గొంది. ఆ షో కు జడ్జ్ గా జానీ మాస్టర్ ఉన్నాడు. ఆ కార్యక్రమంలో బాధితురాలి పెర్ ఫార్మెన్స్ ఆయనకు నచ్చింది. తన దగ్గర డ్యాన్స్ అసిస్టెంట్ గా ఛాన్స్ ఇస్తానన్నాడు. చెప్పినట్టుగానే ఆయన ఛాన్స్ ఇచ్చాడు. 2019లో జానీ తనకు కాల్ చేశాడని.. తన టీమ్ లోకి ఆహ్వానించాడని చెప్పింది. అప్పటి నుంచి ఆమె కొరియోగ్రాఫర్ గా జానీ టీమ్ లో వర్క్ చేస్తోంది. తను వర్క్ స్టార్ట్ చేసే టైమ్ కు బాధితారులు మైనర్ గా ఉంది. తనను తొలి నుంచీ మానసికంగా, లైంగికంగా వేధించాడన్నది బాధితురాలి ఆరోపణ. ఆమె మైనర్ గా ఉన్నప్పుడే.. ముంబైలో ఓ సినిమా షూటింగ్ కోసం జానీతోపాటు ఆమె.. ఇంకా ఇద్దరు అసిస్టెంట్లు వెళ్లారు. అక్కడ హోటల్లో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు పోలీస్ కంప్లయింట్ లో తెలిపింది. నార్సింగ్ లోని తన ఇంటిలో కూడా దారుణానికి పాల్పడ్డాడని.. ఆయన భార్య కూడా తన ఇంటికి వచ్చి దాడి చేసిందని చెప్పింది. ఎవరికైనా చెబితే.. వర్క్ లేకుండా చేస్తానని.. ఫిల్మ్ ఇండస్ట్రీలో అసలు పనే లేకుండా చేస్తానని జానీ బెదిరించినట్లుగా చెప్పింది. తన పరిస్థితిని అవకాశంగా తీసుకుని.. హైదరాబాద్ నుంచి వేరే ప్రాంతాలకు అవుట్ డోర్ షూటింగ్ లకు వెళ్లినప్పుడు లైంగికదాడికి పాల్పడేవాడని.. సినిమా చిత్రీకరణ సమయంలో వ్యానిటీ వ్యాన్ లోనూ అభ్యంతరకరంగా ప్రవర్తించేవాడని తెలిపింది. గత ఐదేళ్లుగా తనను ఎన్ని ఇబ్బందులకు గురి చేశాడో పోలీసులకు తెలిపింది.
జానీ మాస్టర్ వేధింపులు భరించలేక బాధితురాలు.. ఆయన టీమ్ నుంచి బయటకు వచ్చేసింది. తన కాళ్లమీద తాను నిలబడడానికి ప్రయత్నించింది. కానీ జానీ మాస్టర్.. పలుకుబడితో తనకు ప్రాజెక్టులు రాకుండా అడ్డుకున్నాడని ఆ బాధితురాలు ఆరోపించింది. తొలుత రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఆమె ఫిర్యాదు చేసింది. అక్కడి పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. బాధితురాలు నివసించే పరిధిలో ఉన్న నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు కేసు ట్రాన్స్ ఫర్ చేశారు. బాధితారులు చెప్పిన వివరాలతో ఈ కేసు పెద్ద మలుపు తిరిగింది. ఆమె మైనర్ గా ఉన్నప్పుడు జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో.. బాధితారులి స్టేట్ మెంట్ తో పోలీసులు.. జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషాపై ఇప్పటికే ఉన్న కేసులో పోక్సో చట్టాన్ని కూడా కలిపారు.
జానీ మాస్టర్ నెల్లూరులో ఉన్నాడని తెలుసుకుని.. అక్కడి పోలీసులతో సంప్రదింపులు చేసినట్లుగా తెలుస్తోంది. తరువాత నార్త్ ఇండియాలో ఉన్నట్టుగా.. సెల్ ఫోన్ సిగ్నల్స్ పరంగా చూస్తే.. లడఖ్ లో ఉన్నాడని తెలిసి అలెర్ట్ అయ్యింది. పోలీసులు.. జానీ మాస్టర్ కోసం.. నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. పరారీలో ఉన్న జానీ మాస్టర్ ను పట్టుకోవడానికి స్పెషల్ గా ఫోకస్ పెట్టారు. ఆయన ఫోన్ కాల్స్ పైనా దృష్టి పెట్టారు. చివరిగా ఆయన ఎక్కడికి వెళ్లాడు.. ఎవరెవరితో మాట్లాడాడు.. ఇలాంటి సమాచారాన్ని సేకరిస్తున్నారు. 2015లో కూడా జానీ మాస్టర్ ఓ మహిళను వేధింపులకు గురిచేశాడని తెలుస్తోంది. మళ్లీ ఇప్పుడు కూడా లైంగిక వేధింపుల కేసును ఫేస్ చేస్తునన్నాడు. ఇప్పుడు ఈ కేసులో ఆయనకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు ఫోకస్ పెట్టారు.
జానీ మాస్టర్ కేసులో బాధితురాలికి ఇప్పటికే వైద్య పరీక్షలు చేశారు. ఆమె స్టేట్ మెంట్ ను నార్సింగి పోలీసులు రికార్డ్ చేశారు. సఖి, భరోసా బృందాలు కూడా ఆమె నుంచి వివరాలు తీసుకున్నాయి. మరికొన్ని ఆధారాలను సేకరించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మైనర్ గా ఉన్నప్పటి నుంచి ఆమెకు బెదిరింపులు, లైంగిక వేధింపులు మొదలయ్యాయని తెలుస్తోంది. మతం మార్చుకుని.. పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ బెదిరించారని బాధితురాలు ఆరోపించింది. మతమార్పిడి చేసుకుని పెళ్లి చేసుకోవాలన్న అంశంపై బీజేపీ మహిళా మోర్చా కూడా మండిపడింది. జానీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఇక బాధితురాలు.. మహిళా సంఘాలతో కలిసి మహిళా కమిషన్ కు ఫిర్యాదు కూడా చేసింది.
తెలుగు చిత్రపరిశ్రమలో లైంగిక వేధింపులపై విచారణకు సంబంధించి ఏర్పాటుచేసిన.. పరిష్కార ప్యానెల్ ఈ ఇష్యూపై సీరియస్ గానే ఫోకస్ పెట్టింది. ఇప్పటికే బాధితురాలి ఫిర్యాదును రికార్డ్ చేసింది. ఈ అంశానికి సంబంధించి ఆధారాలు ఉన్నాయని చెబుతోంది. లైంగిక వేధింపులకు సంబంధించి టాలీవుడ్‌లో 2018 నుంచే ఓ కమిటీ ఉందని తెలిపింది. ఇక జానీ మాస్టర్ వ్యవహారంపై రిపోర్ట్ వచ్చిన తరువాత చర్యలు తీసుకుంటామంటోంది.
జానీ మాస్టర్ గతంలో జనసేన పార్టీలో చేరారు. పార్టీ కోసం ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని.. జానీ మాస్టర్ ను జనసేన ఆదేశించింది. ఈ ఆదేశాలను వెంటనే అమల్లోకి తీసుకువచ్చింది. సో.. జానీ మాస్టర్ కేసులో ఉచ్చు బిగుస్తోందని అర్థమవుతోంది. ఇక టాలీవుడ్ కూడా ఇండస్ట్రీ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
మరిన్ని ప్రీమియం కథనాల కోసం.. TV9 News యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి