Actor Vijay TVK: డీఎంకే, అన్నాడీఎంకేలను ఢీకొట్టి.. నిలిచి గెలిచే సత్తా విజయ్ కు ఏమేరకు ఉంది?

విజయ్ కు తమిళనాట ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. మాస్ లో గట్టి ఓటు బ్యాంకును సొంతం చేసుకునే అవకాశం ఉంది. అందుకే ఆయన రాజకీయ అరంగేట్రంతో పొలిటకల్ ప్రత్యర్థులు ఆందోళన చెందుతున్నారు. జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకే బలహీనపడిందని.. అందుకే అది రాజకీయంగా తమకు లాభిస్తుందని డీఎంకే భావిస్తూ వచ్చింది. అనుకున్నట్టుగానే.. డీఎంకే గత ఎన్నికల్లో విజయదుందిభి మోగించింది. ఇప్పటివరకు దాని దూకుడుకు ఎక్కడా అడ్డు లేకుండా పోయింది. ఇప్పుడు విజయ్ రాకతో.. డీఎంకే టెన్షన్ పడుతున్నట్టు కనిపిస్తోంది.

Actor Vijay TVK: డీఎంకే, అన్నాడీఎంకేలను ఢీకొట్టి.. నిలిచి గెలిచే సత్తా విజయ్ కు ఏమేరకు ఉంది?
Vijay
Follow us
Gunneswara Rao

| Edited By: Phani CH

Updated on: Oct 28, 2024 | 9:00 PM

లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలు. సెక్యూరిటీ కోసం ఆరు వేల మందికి పైగా పోలీసులు. 10 నుంచి 20 కిలోమీటర్ల మేర నడిచి వచ్చిన కార్యకర్తలు. 10 నుంచి 20 కిలోమీటర్ల మేర వాహనాల లైన్లు. సభ జరగడానికి రెండ్రోజుల ముందే వేదిక వద్దకు కుటుంబాలతో వచ్చి.. వంటలు వండుకుని.. అక్కడే బస చేసిన కొందరు అభిమానులు. 18 మెడికిల్ టీమ్స్, 22 అంబులెన్స్ లు. ఇవన్నీ తమిళ హీరో విజయ్ ఏర్పాటుచేసిన పార్టీ మహానాడు సభ సాక్షిగా జరిగిన ముచ్చట్లు. మాస్ లో పిచ్చ ఫాలోయింగ్ ఉన్న హీరో విజయ్.. పార్టీ పెడుతున్నాడు అన్న వెంటనే ఒక్కసారిగా తమిళనాడు అంతటా ఆయన పేరు మార్మోగిపోయింది. ఇళయదళపతి అంటే వారికి అంత ఇష్టం, అభిమానం. గత పదేళ్లుగా పాలిటిక్స్ లోకి వస్తున్నా వస్తున్నా అంటూ హింట్ ఇస్తున్న విజయ్.. ఈ ఏడాది ఫిబ్రవరి 22న అఫీషియల్ గా రాజకీయ ప్రవేశం చేశారు. ఈ ఏడాది ఆగస్టు 22న చెన్నైలోని టీవీకే హెడ్ ఆఫీసులో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అప్పుడు పార్టీ గీతాన్ని కూడా పాడారు. తరువాత ఎన్నికల కమిషన్ కూడా టీవీకే పార్టీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు పార్టీ తొలి మహానాడును లక్షలాదిమందితో విజయవంతంగా నిర్వహించడం, పార్టీ సిద్ధాంతాలు ఏమిటో.. భవిష్యత్ ప్రణాళిక ఏమిటో క్లియర్ కట్ గా చెప్పడం అన్నీ చకచకా జరిగిపోయాయి.

ఇదంతా ఓకే. ప్రజల్లో అభిమానమున్న సినీ హీరోలు ఎవరైనా ఇంతవరకు చేయడం పెద్ద కష్టం కాదు. కానీ అదే ప్రజాక్షేత్రంలో తొడగొట్టి.. కాకలు తీరిన డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలను ఢీకొట్టి.. ఓట్ల వేటలో వారిని పడగొట్టి నిలిచి గెలిచి చూపించడం అంటే మాటలు కాదు. మరి విజయ్ ఆ పని చేయగలడా? తన సినిమా ఛరిష్మాను.. అభిమానుల ఓటు బ్యాంకును.. పార్టీని గెలిపించే దిశగా మళ్లించగలడా? గతంలో లోకల్ ఎలక్షన్లలో పరోక్షంగా తన పార్టీ తరపున మద్దతిచ్చి వారిని గెలిపించినట్లుగా.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విక్టరీ కొట్టగలడా? ఈ ప్రశ్నలన్నింటికీ.. మహానాడే జవాబు అంటోంది.. తమిళగ వెట్రి కళగం – టీవీకే పార్టీ. ఇంతకీ టీవీకే పార్టీ అధ్యక్షుడిలో అంతగా ఆత్మవిశ్వాసం నింపిన పార్టీ మహానాడు.. నిజంగానే అన్ని ప్రశ్నలకూ జవాబిచ్చిందా?

రాజకీయాల్లో మార్పు రావాలి. టీవీకే పార్టీ చీఫ్, హీరో విజయ్ ఆకాంక్ష ఇదే. తను ఏ ఆశయంతో పాలిటిక్స్ లోకి వచ్చిందీ చెప్పాడు. పెరియార్, అన్నాదురై, అంబేద్కర్.. ఆశయ సాధనే లక్ష్యమన్నాడు. కాకపోతే పెరియార్ సిద్ధాంతాల్లో ఒక్కదానిని మాత్రం విజయ్ వ్యతిరేకించాడు. దేవుడు లేడన్న ఆయన మాటలతో విజయ్ ఏకీభవించలేదు. రాజకీయాలు పాములాంటివని.. కాటేస్తుందని తెలిసినా.. వెనక్కు తగ్గేది లేదన్నాడు. తాను ఎవరికీ Aటీమ్, B టీమ్ కాదనన్నాడు. రంగులు వేసుకునే వాళ్లకు రాజకీయాలు ఎందుకు అన్నవారికి సమాధానం చెప్పి తీరుతానన్నాడు విజయ్. దీనిని బట్టి ఆయన అజెండా ఏమిటో తమిళనాడు ప్రజలకు క్లారిటీ వచ్చింది.

జయలలిత మరణం తరువాత తమిళనాడులో పొలిటికల్ గా ఆ స్థాయిలో ఎదగాలని శశికళ ప్రయత్నించారు. జయ ఉన్నప్పుడు తెరవెనుక అయితే చక్రం తిప్పగలిగారు కాని.. తెరముందుకు మాత్రం రాలేకపోయారు. జైలుకు వెళ్లి వచ్చాక కూడా అనుకున్నంతగా ఆమె ప్రభావం తమిళ పాలిటిక్స్ పై పడలేదు. పాలిటిక్స్ లో చక్రం తిప్పుదామని అనుకున్న విజయ్ కాంత్.. అనుకున్నంతగా ప్రభావం చూపించలేకపోయారు. చివరకు ఆరోగ్యం సహకరించకపోవడంతో ఇబ్బందులూ తప్పలేదు. ఆయన మరణం తరువాత ఆయన వారసత్వాన్ని ఎవరూ కొనసాగించలేకపోయారు. నాడు తమిళగడ్డపై ఉన్న రాజకీయ వాతావరణాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని జెండా పాతుదామని అనుకున్న బీజేపీ అజెండా కూడా వర్కవుట్ కాలేదు. హీరో కమలహాసన్ కూడా పార్టీని పెట్టినా.. అనుకున్నంతగా తమ ముద్ర వేయలేకపోయారు.

రాజకీయాల్లోకి వస్తాను వస్తాను అని ఊరించి ఊరించి.. చివరకు డ్రాప్ అయ్యారు రజనీకాంత్. ఆయన తెలివైన పని చేశారంటున్నారు తమిళ తంబీలు. నిజానికి ఆయనకున్న మాస్ ఫాలోయింగ్.. అభిమానుల అండదండలు.. రాజకీయంగా వర్కవుట్ అవుతాయని అనుకున్నారు. తెలుగునాట ఎన్టీఆర్ రాజకీయాల్లో ఎలాంటి ప్రభంజనం సృష్టించారో అంతలా తన ముద్ర వేస్తారనుకున్నారు. కానీ ఆయనకు ఆరోగ్యం సహకరించకపోవడం, వయసురీత్యా హుందాగా వెనక్కు తగ్గారు. ప్రస్తుతం డీఎంకేదే తమిళ రాజకీయాల్లో పైచేయి. కాకపోతే అక్కడ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయముంది. అందుకే ఈలోపు తానేంటో చూపించి.. పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లి.. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు విజయ్.

ఇక విజయ్ కు తమిళనాట ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. మాస్ లో గట్టి ఓటు బ్యాంకును సొంతం చేసుకునే అవకాశం ఉంది. అందుకే ఆయన రాజకీయ అరంగేట్రంతో పొలిటకల్ ప్రత్యర్థులు ఆందోళన చెందుతున్నారు. జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకే బలహీనపడిందని.. అందుకే అది రాజకీయంగా తమకు లాభిస్తుందని డీఎంకే భావిస్తూ వచ్చింది. అనుకున్నట్టుగానే.. డీఎంకే గత ఎన్నికల్లో విజయదుందిభి మోగించింది. ఇప్పటివరకు దాని దూకుడుకు ఎక్కడా అడ్డు లేకుండా పోయింది. ఇప్పుడు విజయ్ రాకతో.. డీఎంకే టెన్షన్ పడుతున్నట్టు కనిపిస్తోంది. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్.. తన చిరకాల మిత్రుడు విజయ్ ప్రయత్నాన్ని అయితే అభినందించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టవచ్చన్నారు. నిర్మాతగా తాను తొలి సినిమాను విజయ్ హీరోగానే తీశానని చెప్పారు. కానీ తమిళనాడు మంత్రి రేగుపతి మాత్రం.. విజయ్ పార్టీ.. టీవీకే…. A టీమ్ లేదా B టీమ్ కాదు.. బీజేపీకి C టీమ్ అని విమర్శించారు. ఆదివారం నాటి టీవీకే భారీ బహిరంగ సభను.. మీటింగ్ కన్నా.. గ్రాండ్ ఫిల్మ్ ఫంక్షన్ గా అభివర్ణించారు. దీంతో డీఎంకే పై తన ప్రసంగంలో విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టిన విజయ్ కు ఇప్పుడు డీఎంకే గట్టి కౌంటర్ ఇచ్చినట్టయ్యింది. సో.. రెండు పార్టీల మధ్యా పొలిటికల్ వార్ మొదలైనట్టే.

తమిళనాడు పాలిటిక్స్ లో ఫ్రీ స్కీముల విషయంలో విజయ్ పార్టీ టీవీకే స్టాండేంటి? ఎందుకంటే.. ఫ్రీ స్కీమ్స్ కు తమిళనాడులో భారీగా రెస్పాన్స్ ఉంటుంది. డీఎంకే, అన్నాడీఎంకే వీటి విషయంలో ఎక్కడా తగ్గలేదు. ఆర్థిక వ్యవస్థ సహకరిస్తుందా లేదా అన్న సంగతి కన్నా.. ఓట్ల వేటే ముఖ్యం అన్నట్టుగా ఇలాంటి పథకాలు చాలా చోట్ల అమలవుతున్నాయి. మరి.. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్.. వీటి విషయంలో ఎలాంటి స్టాండ్ తీసుకుంటారో చూడాలి. అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా ముఖ్యమని అందరి బాటలోనూ నడుస్తారో.. లేదా వాటికి కోత విధిస్తారో.. పూర్తిగా చెక్ పెడతారో త్వరలో తేలుతుంది.

తమిళనాట ఉన్న రాజకీయ లాభాన్ని పొందడానికి విజయ్ చాలా జాగ్రత్తగా, తెలివిగా పావులు కదుపుతున్నాడు. సినిమాల్లో హిట్ కొట్టినంత ఈజీ కాదు.. పార్టీని గెలిపించడం. విజయ్ కూ ఈ విషయం తెలుసు. ప్రత్యర్థులతో పాటు.. సొంత పార్టీలోనూ కొన్ని సందర్భాల్లో సెగలు తప్పవు. రాజకీయంగా వాటన్నింటినీ ఫేస్ చేసి.. పాస్ అయితేనే.. రాటుదేలుతారు. ఇప్పుడు అత్యున్నత స్థానాల్లో ఉన్న నేతలంతా ఇలా వచ్చినవారే. సినీ రంగం నుంచి వచ్చిన విజయ్ కు మాస్ ఫాలోయింగ్ ఉండడం కలిసొచ్చే అంశం. కానీ అదొక్కటే ఆయనను అందలం ఎక్కిస్తుందని చెప్పలేం. కాకపోతే ఎంజీఆర్, ఎన్టీఆర్ ల ప్రస్తావన తీసుకువచ్చారు కాబట్టి.. రాజకీయాలను ఔపోసన పట్టారనే చెప్పచ్చు. వచ్చే రెండేళ్లలో ఆయన పార్టీ ఏమేరకు ప్రజలకు చేరువవుతుంది.. వారి విశ్వాసాన్ని ఏమేరకు చూరగొంటుంది అన్నదానిపైనే.. విజయ్ ఆశలు నెరవేరే అవకాశం ఉంది. కాకపోతే తమిళనాట నెక్స్ట్ జనరేషన్ పాలిటిక్స్ లో మాత్రం యుద్ధం మాత్రం విజయ్, ఉదయనిధి మధ్యే అని చెప్పచ్చు.

ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
చలికాలంలో ఈ గింజలు వేయించి తింటే.. మధుమేహం పూర్తిగా అదుపులోకి
చలికాలంలో ఈ గింజలు వేయించి తింటే.. మధుమేహం పూర్తిగా అదుపులోకి
ల్యాప్‌టాప్ చార్జింగ్ సమస్యకు టాటా..ఆసస్ ల్యాప్‌టాప్ ఫీచర్లివే.!
ల్యాప్‌టాప్ చార్జింగ్ సమస్యకు టాటా..ఆసస్ ల్యాప్‌టాప్ ఫీచర్లివే.!