AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India-Canada: కెనడా రాజకీయం వెనుక కథే వేరు.. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ట్రూడో మాస్టర్ స్ట్రాటజీ

తన ప్రభుత్వ మనుగడ కోసం, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం భారత వ్యతిరేక వాదనను కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీసుకున్నారు అన్నది క్లియర్ గా అర్థమవుతోంది. తన రాజకీయ ప్రయోజనాల కోసం మన దేశంతో దౌత్యపరమైన బంధాలను పణంగా పెట్టారంటే.. కెనడా ప్రధాని ట్రూడో ఏ స్థాయిలో పొలిటికల్ గేమ్ ఆడుతున్నారో క్లియర్ గా అర్థమవుతోంది. ఈ గేమ్ లో ట్రూడోకు ఎదురయ్యేది విజయమా? పరాజయమా?

India-Canada: కెనడా రాజకీయం వెనుక కథే వేరు.. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ట్రూడో మాస్టర్ స్ట్రాటజీ
India Canada Relations
Gunneswara Rao
|

Updated on: Oct 16, 2024 | 7:59 PM

Share

మీ దేశానికి మా దేశం ఎంత దూరమో.. మా దేశానికి మీ దేశం కూడా అంతే దూరం. కెనడాకు ఈ విషయం అర్థం కానట్టుంది. భారత్ లాంటి దేశంతో పెట్టుకుంటే ఏమవుతుందో ఇంకా దానికి తెలిసిరాలేదు. కేవలం సొంతగడ్డపై రాజకీయ ప్రయోజనాల కోసం, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం.. మనపై నిరాధార ఆరోపణలు చేస్తూ.. మన దేశంతో దౌత్యపరమైన సంబంధాలను పణంగా పెట్టారు కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో. చేయాల్సిందంతా చేసి.. ఇప్పుడు మొసలి కన్నీరు కారిస్తే ఏం లాభం? భారత్.. అంతర్జాతీయ పరిణామాలపై కాస్త జాగ్రత్తగా అడుగులేస్తుందని.. అందుకే తమకేమీ కాదులే అని కెనడా ప్రధాని ట్రూడో భావించినట్టుంది. ఇప్పుడు ఇండియా రియాక్షన్ చూసేసరికీ.. ట్రూడోకి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయ్యింది. అసలు.. ట్రూడో మనతో ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారు? ఎందుకు మనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు? మన విషయంలో ట్రూడో ఎందుకు అంత ఓవర్ యాక్టివ్ గా ఉన్నారు? దీని వెనుక అసలు కథేంటి? ఖలిస్తాన్‌ ఉగ్రవాది నిజ్జర్‌ హత్య కేసు విషయంలో కెనడా ఓవర్ యాక్షన్ చేస్తోంది. మనపై నిరాధార ఆరోపణలు గుప్పిస్తోంది. నిజ్జర్ హత్య వెనుక మన అధికారుల పాత్ర ఉందని.. కెనడా పార్లమెంటులో ప్రధాని ట్రూడో.. కిందటేడాది ఓ ప్రకటన చేశారు. దీనిపై మన దేశం తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఈ హత్య కేసుకు సంబంధించి ఆధారాలు ఉంటే ఇవ్వాలని అడిగింది....

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి