Rajasthan: సీఎం నేతృత్వంలో జర్మనీలో ఉన్నత స్థాయి బృందం పర్యటన.. కీలక ఒప్పందాలు!
రాజస్థాన్ ఆవిష్కరణలను స్వీకరించడం, సాంకేతిక పురోగతిని ప్రోత్సహించడం, అత్యాధునిక మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా తన విస్తృత సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయడానికి సిద్ధంగా ఉందని అన్నారు..
ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ నేతృత్వంలోని రాజస్థాన్ ప్రభుత్వ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం జర్మనీ పర్యటనలో రెండవ రోజు మ్యూనిచ్‌లో రైజింగ్ రాజస్థాన్ ఇన్వెస్టర్ రోడ్‌షోలో పాల్గొంది. రాజస్థాన్‌లో యూనిట్ల ఏర్పాటుకు జర్మనీ పెట్టుబడిదారులను ప్రభుత్వం ఆహ్వానించింది. ఇన్వెస్టర్ రోడ్‌షోలో ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, ఆటోమొబైల్, ESDM, సప్లై చైన్, లాజిస్టిక్స్, టూరిజం, పెట్రోలియం, మైనింగ్, పునరుత్పాదక ఇంధనం, రక్షణ, ప్యాకేజింగ్ మొదలైన రాజస్థాన్‌లోని వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టాలని జర్మన్ వ్యాపార సంఘం, వ్యాపార గ్రూప్‌లకు పిలుపునిచ్చారు.
భజన్‌లాల్ శర్మ మాట్లాడుతూ.. అడుగడుగునా మా ప్రభుత్వం అండగా ఉంటుందని మీ అందరికీ హామీ ఇస్తున్నాను అని అన్నారు. జర్మనీ శాస్త్రీయ ఆవిష్కరణలు, సాంకేతిక, అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. వారితో కలిసి మేము మా బలమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాలనుకుంటున్నామని అన్నారు. రాజస్థాన్ అనువైన ప్రదేశం. మాకు మంచి మౌలిక సదుపాయాలు, సమృద్ధిగా వనరులు ఉన్నాయన్నారు.
గ్లోబల్ కంపెనీలకు భారతదేశం సప్లయ్ చైన్ డెస్టినేషన్‌గా కనిపిస్తోందని, దాని చురుకైన, అభివృద్ధి-ఆధారిత విధానాల కారణంగా భారతదేశంలోని ఈ కంపెనీలకు నమ్మకమైన భాగస్వామిగా మారడానికి రాజస్థాన్ సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. మీ పెట్టుబడి సురక్షితంగా ఉండేందుకు రాజస్థాన్ ప్రభుత్వం అడుగడుగునా మీ వెంటే ఉందని పేర్కొన్నారు.
రాష్ట్ర పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు జర్మనీ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు, 2031-32 నాటికి రాజస్థాన్ పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రస్తుత 28 గిగావాట్ల నుంచి 115 గిగావాట్లకు పెంచుతామని ముఖ్యమంత్రి చెప్పారు. ఇందుకోసం రూ.5.4 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టాల్సి ఉంది. పునరుత్పాదక ఇంధన రంగంలో ప్రపంచ అగ్రగామిగా ఉన్న జర్మనీ రాజస్థాన్‌లో సౌర, పవన శక్తి రంగంలో ప్రాజెక్టులను ప్రారంభించగలదన్నారు.
జర్మన్ కంపెనీలతో అవగాహన ఒప్పందాలు:
మ్యూనిచ్‌లో నిర్వహించిన ఈ పెట్టుబడిదారుల షోలో రాజస్థాన్ ప్రభుత్వం ఆల్బాట్రాస్ ప్రాజెక్ట్స్, ఫ్లిక్స్‌బస్, పార్టెక్స్ ఎన్‌వి, వెయులీ టెక్నిక్స్ జిఎమ్‌బిహెచ్, ఇంగో ష్మిట్జ్ వంటి అనేక పెద్ద జర్మన్ కంపెనీలతో అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది. ఈ కంపెనీలు డిఫెన్స్, మొబిలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆటోమొబైల్, స్కిల్ డెవలప్‌మెంట్ రంగాలలో పని చేస్తాయి. ఈ సమయంలో ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రతినిధి బృందం జర్మనీకి చెందిన పెట్టుబడిదారులు, వ్యాపార వర్గాలు చర్చించి రాజస్థాన్‌లో పెట్టుబడులు పెట్టాలని వారిని ఆహ్వానించింది.
అలాగే ముఖ్యమంత్రితో పాటు జర్మనీలో ఉన్న ఉప ముఖ్యమంత్రి దియా కుమారి మాట్లాడుతూ, రాజస్థాన్ ఆవిష్కరణలను స్వీకరించడం, సాంకేతిక పురోగతిని ప్రోత్సహించడం, అత్యాధునిక మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా తన విస్తృత సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయడానికి సిద్ధంగా ఉందని అన్నారు. సాంకేతికత, ఇతర కీలక వ్యాపార రంగాలలో జర్మనీతో సహకరించుకోవడానికి రాజస్థాన్ ఆసక్తిగా ఉందన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి