Diabetes Danger Bells: భారతీయులను దెబ్బతీస్తున్న డయాబెటీస్.. సైలెంట్ కిల్లర్ లా మారిన స్వీట్ పాయిజన్
డయాబెటీస్ ను నియంత్రించలేకపోతే.. కిడ్నీలు, నరాలు, కళ్లు, గుండె ఆరోగ్యానికి ముప్పు తప్పదు. అయితే.. డయాబెటీస్ వచ్చినంత మాత్రాన జీవితమేదో ముగిసిపోయినట్టు కాదు. కుళ్లి కుళ్లి ఏడవాల్సిన పనీ లేదు. కాకపోతే.. జీవనశైలి మీద పట్టు మాత్రం ఉండాలి. ఏం తింటున్నారు, ఎంత తింటున్నారు, ఎప్పుడు తింటున్నారు అన్నది చాలా ముఖ్యం. ఒకవేళ లైఫ్ స్టైల్ సరిగా లేకపోతే ఏం జరుగుతుంది?

ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. దాదాపు పది కోట్ల మంది చేస్తున్న పోరాటమిది. పది కోట్ల కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్య ఇది. ఆ కుటుంబాల్లో దాదాపు 40 కోట్లమందిని మానసికంగా వేధిస్తోంది ఇది. దేశ జనాభాలో వీరి శాతం ఎంతో చెప్పనా.. 11.4 శాతం. యుద్ధం చేద్దామంటే శత్రువు దొరకడు. కంటికి కనిపించడు. అయినా పోరాటం తప్పదు. పేరుకు షుగరే.. కానీ తేడా వస్తే.. ప్రాణాంతకం. ఆ సైలెంట్ కిల్లర్ పేరు.. డయాబెటిస్. షుగర్ పేషెంట్ల నెంబర్ గురించి చెప్పుకున్నాం. కానీ డయాబెటీస్ బారిన పడడానికి ముందు ఒక స్టేజ్ ఉంటుంది. అదే ప్రీ డయాబెటీస్. మన దేశంలో ఈ స్టేజ్ లో ఉన్నవారు ఎందరో తెలుసా? 13 కోట్ల 60 లక్షలు. మన దేశ జనాభాలో వీరి శాతం ఎంతో చెప్పనా? 15.3 శాతం. మన దేశంలో మహారాష్ట్రలో ఉన్న జనాభా కంటే.. ఈ నెంబర్ చాలా ఎక్కువ. అంటే దేశంలో షుగర్ పేషెంట్లు, షుగర్ వచ్చే అవకాశం ఉన్న పేషెంట్ల నెంబర్ ను కలిపితే.. దాదాపు 24 కోట్లు. ఈ అంకె చూస్తే మతిపోతుంది. అంటే ఇండియాలో డయాబెటీస్ డేంజర్ బెల్స్ మోగుతున్నాయని అర్థమవుతుంది. దేశానికి సవాల్ విసురుతోంది. అలెర్ట్ అవ్వమని హెచ్చరిస్తోంది. అసలీ షుగర్ వ్యాధి.. స్వీట్స్ తింటే వస్తుందా? టెన్షన్ పెరిగితే వస్తుందా? ఎక్సర్ సైజ్ లేకపోతే వస్తుందా? అసలెందుకు వస్తుంది? నిజానికి చాలామందికి దీనిపై ఇప్పటికీ అవగాహన...




