AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: ఈ పండు గురించి మీకు తెలుసా.? లాభాలు తెలిస్తే అస్సలు వదలరు

ప్రకృతి ఒడిలో మనిషి ఆరోగ్యం ఇమిడి ఉంది. సహజ సిద్ధమైన పండ్లు తిని మనిషి తన ఆయుష్షును పెంచుకోవచ్చు అనడానికి అడవుల్లో దొరికే " గ్లూ బెర్రి" ఫ్రూట్ తింటే కలిగే ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు. గమ్ లాగ జిగురుగా ఉండే పండు అది. ఆ పండునే బంక నెక్కెర కాయలు అంటుంటారు. దట్టమైన అడవుల్లో ప్రకృతి సహజ సిద్ధంగా దొరికే ఈ పండ్లు మనుషుల..

Health: ఈ పండు గురించి మీకు తెలుసా.? లాభాలు తెలిస్తే అస్సలు వదలరు
Glueberry
N Narayana Rao
| Edited By: |

Updated on: Jun 21, 2024 | 10:41 AM

Share

ప్రకృతి మనిషి ఎన్నో రకాల పండ్లను అందిస్తుంది. వీటిలో సహజంగా లభించే ఎన్నో మంచి గుణాలు ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉపయోగపడుతాయి. పండ్లలో ఉండే పోషకాలు మనల్ని ఎన్నో రకాల వ్యాధుల నుంచి రక్షిస్తాయి. అందుకే పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సైతం సూచిస్తుంటారు. అయితే ప్రకృతిలో మనకు తెలియని పండ్లు కూడా కొన్ని ఉన్నాయి. అలాంటి వాటిలో ఒక పండు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రకృతి ఒడిలో మనిషి ఆరోగ్యం ఇమిడి ఉంది. సహజ సిద్ధమైన పండ్లు తిని మనిషి తన ఆయుష్షును పెంచుకోవచ్చు అనడానికి అడవుల్లో దొరికే ” గ్లూ బెర్రి” ఫ్రూట్ తింటే కలిగే ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు. గమ్ లాగ జిగురుగా ఉండే పండు అది. ఆ పండునే బంక నెక్కెర కాయలు అంటుంటారు. దట్టమైన అడవుల్లో ప్రకృతి సహజ సిద్ధంగా దొరికే ఈ పండ్లు మనుషుల రోగాలకు ఎంతో మేలు చేస్తాయి. అంతే కాదండోయ్…ఈ గ్లూ బెర్రీ పండ్లు అంటే అడవిలో ఎలుగు బంట్లు కు కూడా చాలా ప్రీతి.

బంక నెక్కర కాయల కోసం ఎలుగు బంటి చాలా ఇష్టంగా తింటుంది. చెట్టు కింద ఈ పండ్ల తొక్కలు పడి ఉన్నాయంటే…ఆ ప్రాంతంలో ఎలుగు బంటి ఉందని కూడా గిరిజనులు గుర్తిస్తారు. సహజంగా 40 ఏళ్లు పైబడిన వారికి మోకాళ్ళ నొప్పులు సహజంగా వస్తుంటాయి. అలాంటివారు ఈ బంకనెక్కర పండ్లు తింటే మోకాలిలో గుజ్జు తయారు అయ్యి మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ పండ్లను గుజ్జుగా చేసి తలకు మర్దన చేస్తే మైగ్రేన్ లాంటి తలనొప్పులు కూడా మటుమాయం అవుతాయని ఆయుర్వేద నిపుణురాలు డాక్టర్ కొనకల్ల సుధా తెలిపారు.

ప్రకృతి ఒడిలో సహజ సిద్ధంగా సీజనల్ కాసే పండ్లు తినడం వల్ల మనిషి ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటారని, అడవుల్లో దొరికే ఈ బంకనెక్కర కాయలను తినడం వల్ల మగవారిలో సెక్స్ సామర్థ్యాలు కూడా మెరుగవుతాయని ఆమె సూచించారు. తినడానికి కొంచెం వగరుగా ఉన్నప్పటికీ గ్లూ బెర్రీ ఫ్రూట్స్ మనుషుల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైన పండుగ ఆయుర్వేద వైద్య శాస్త్రంలో పేర్కొన్నట్లు చెబుతున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..