AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్ తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

బీట్ రూట్ ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బీట్ రూట్‌తో కేవలం శరీర ఆరోగ్యమే కాకుండా అందాన్ని కూడా పెంచుకోవచ్చు. అందాన్ని పెంచుకోవడంలో కూడా బీట్ రూట్ ఎంతో చక్కగా సహాయ పడుతుంది. కానీ బీట్ రూట్స్ తినడం చాలా మందికి ఇష్టం ఉండదు. కానీ అన్ని కూరగాయల్లో కంటే ఎక్కువ పోషక విలువలు ఉన్నవి బీట్ రూట్లు. వీటిని తినడం వల్ల ఎన్నో రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు. ముందే పలు దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా జాగ్రత్త..

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్ తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
Beetroot
Chinni Enni
|

Updated on: Jun 21, 2024 | 1:14 PM

Share

బీట్ రూట్ ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బీట్ రూట్‌తో కేవలం శరీర ఆరోగ్యమే కాకుండా అందాన్ని కూడా పెంచుకోవచ్చు. అందాన్ని పెంచుకోవడంలో కూడా బీట్ రూట్ ఎంతో చక్కగా సహాయ పడుతుంది. కానీ బీట్ రూట్స్ తినడం చాలా మందికి ఇష్టం ఉండదు. కానీ అన్ని కూరగాయల్లో కంటే ఎక్కువ పోషక విలువలు ఉన్నవి బీట్ రూట్లు. వీటిని తినడం వల్ల ఎన్నో రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు. ముందే పలు దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా జాగ్రత్త పడొచ్చు. అధిక బరువు, కొలెస్ట్రాల్, గుండె, షుగర్ వ్యాధి, రక్త హీనత సమస్యలను దూరం చేయడంలో బీట్ రూట్ ముందు ఉంటుంది. బీట్ రూట్ కంటే జ్యూస్ తాగడం ఇంకా మేలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి బీట్ రూట్ జ్యూస్ తాగితే ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మెమరీ పవర్ పెరుగుతుంది:

ప్రస్తుత కాలంలో మతి మరుపు, అల్జీమర్స్ వంటి వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి. సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యలను దూరం చేసి, తిరిగి బ్రెయిన్‌ని యాక్టీవ్ చేయడంలో బీట్ రూట్ జ్యూస్ చక్కగా సహాయ పడుతుంది. జ్ఞాపక శక్తిని, ఏకాగ్రతను పెంచుతుంది. పిల్లలకు ఈ జ్యూస్ ఇవ్వడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

కొలెస్ట్రాల్ తగ్గుతుంది:

ప్రస్తుత కాలంలో చాలా మంది చెడు కొలెస్ట్రాల్‌తో ఇబ్బంది పడుతున్నారు. బీట్ రూట్ జ్యూస్ తాగితే.. శరీరంలోని చెడు కొవ్వు కరిగి.. మంచి కొవ్వు పెరుగుతుంది. మలబద్ధకం సమస్య కూడా కంట్రోల్ అవుతుంది. దీంతో చక్కగా వెయిట్ లాస్ అవుతారు. ఎనర్జీ డ్రింక్స్‌ బదులు ఈ జ్యూస్ తాగితే చాలు.

ఇవి కూడా చదవండి

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది:

బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల శరీరంలో అనేక రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. దీంతో వైరస్, ఇన్ ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటారు. అంతే కాకుండా సీజనల్ వ్యాధులు దరి చేరకుండా ఆరోగ్యంగా ఉంటారు.

గుండె ఆరోగ్యం:

బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో బీట్ రూట్‌ని మించింది లేదు. తరచూ బీట్ రూట్ జ్యూస్ తాగితే.. ఎలాంటి గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

చర్మం మెరిసిపోతుంది:

బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల చర్మం ఎంతో అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. కొద్ది రోజుల్లోనే మీకు ఆ మార్పు ఖచ్చితంగా కనిపిస్తుంది. ముఖం మంచి గ్లో అవుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

పైసా పెట్టుబడి లేకుండా ఈ పని స్టార్ట్‌ చేయండి! నెలకు రూ.30 వేలు..
పైసా పెట్టుబడి లేకుండా ఈ పని స్టార్ట్‌ చేయండి! నెలకు రూ.30 వేలు..
ఫాస్ట్‌గా బరువు తగ్గాలనుకుంటున్నారా?అయితే ఈ డైట్ ప్లాన్ మీ కోసమే
ఫాస్ట్‌గా బరువు తగ్గాలనుకుంటున్నారా?అయితే ఈ డైట్ ప్లాన్ మీ కోసమే
టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ
టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ
హైదరాబాద్ ప్రజలకు ఊరట.. అక్కడ మరో పెద్ద రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..
హైదరాబాద్ ప్రజలకు ఊరట.. అక్కడ మరో పెద్ద రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..
ట్రాన్స్‌ఫార్మర్‌ ఆయిల్‌తో మోకాళ్ల నొప్పులు తగ్గుతాయా?
ట్రాన్స్‌ఫార్మర్‌ ఆయిల్‌తో మోకాళ్ల నొప్పులు తగ్గుతాయా?
20 ఏళ్లైన తగ్గని అందం.. ఛార్మీ, త్రిష ఇప్పటికీ అదే అల్లరి.
20 ఏళ్లైన తగ్గని అందం.. ఛార్మీ, త్రిష ఇప్పటికీ అదే అల్లరి.
రోజూ నిమ్మకాయ నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..? అసలు నిజాలు..
రోజూ నిమ్మకాయ నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..? అసలు నిజాలు..
మళ్లీ తగ్గిన బంగారం,వెండి ధరలు.. తులం గోల్డ్ హైదరాబాద్‌లో ఇప్పుడు
మళ్లీ తగ్గిన బంగారం,వెండి ధరలు.. తులం గోల్డ్ హైదరాబాద్‌లో ఇప్పుడు
ఏపీ ప్రజలకు ఫాగ్ హెచ్చరిక.. ఈ జిల్లాలకు వాతావరణశాఖ అలర్ట్ జారీ
ఏపీ ప్రజలకు ఫాగ్ హెచ్చరిక.. ఈ జిల్లాలకు వాతావరణశాఖ అలర్ట్ జారీ
బాలీవుడ్‌లో మరో ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ హీరోయిన్..
బాలీవుడ్‌లో మరో ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ హీరోయిన్..