పసుపులోని కర్కుమిన్ సమ్మేళనం శరీరంలో శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ సమ్మేళనంగా పనిచేస్తుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేయడంతోపాటు కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే అల్లంలో కూడా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇది జీర్ణవ్యవస్థతోపాటు కాలేయ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది.