చికెన్‌లో విటమిన్ బి12, ట్రిప్టోఫాన్, కోలిన్, జింక్, ఐరన్, కాపర్ వంటి పోషకాలు ఉంటాయి. చికెన్‌లో కొవ్వు తక్కువగా ఉంటుంది. అందుకే చికెన్‌ను లీన్ ప్రొటీన్ అంటారు. ప్రోటీన్ అవసరాలను తీర్చడానికి కోడి గుడ్ల కంటే చికెన్ ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. బరువు పెరగాలనుకుంటే, శరీరంలో ప్రోటీన్ లోపాన్ని త్వరగా పూరించడానికి చికెన్ తినవచ్చు. కానీ చికెన్ కంటే గుడ్లు సులభంగా జీర్ణమవుతాయి.