Kallakurichi Liquor Tragedy: కల్తీసార ఘటనలో 38కి చేరిన మరణాలు.. రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం స్టాలిన్‌

తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా కరుమాపురం గ్రామంలో వెలుగు చూసిన కల్తీ సారా కేసులో విచారణ కొనసాగుతుంది. ఈ వ్యవహారంలో మొత్తం బాధితుల సంఖ్య 156కు చేరినట్లు అధికారులు వెల్లడించారు. కల్తీసారా తాగి మొత్తం 38 మంది మృతిచెందినట్లు తమ ప్రకటనలో వెల్లడించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 118 చికిత్స పొందుతుండగా.. వీరిలో 24 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఆ కేసులో సీఐడీ పోలీసులు ఐదుగురు..

Kallakurichi Liquor Tragedy: కల్తీసార ఘటనలో 38కి చేరిన మరణాలు.. రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం స్టాలిన్‌
Kallakurichi Liquor Tragedy
Follow us

|

Updated on: Jun 21, 2024 | 8:36 AM

చెన్నై, జూన్‌ 21: తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా కరుమాపురం గ్రామంలో వెలుగు చూసిన కల్తీ సారా కేసులో విచారణ కొనసాగుతుంది. ఈ వ్యవహారంలో మొత్తం బాధితుల సంఖ్య 156కు చేరినట్లు అధికారులు వెల్లడించారు. కల్తీసారా తాగి మొత్తం 38 మంది మృతిచెందినట్లు తమ ప్రకటనలో వెల్లడించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 118 చికిత్స పొందుతుండగా.. వీరిలో 24 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఆ కేసులో సీఐడీ పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పరారీలో ఉన్న కీలక నిందితుడు చిన్నాదురై కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. దీనిపై సీరియస్‌ అయిన సీఎం స్టాలిన్‌ నిందితులు ఎవరైనా ఉపేక్షించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలంటూ అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు. చికిత్స పొందుతున్న బాధితులకు ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున తక్షణ సాయం అందిస్తామన్నారు.

మరోవైపు కళ్లకురిచిలో 37 మంది ప్రాణాలను బలిగొన్న హూచ్ విషాదం తమిళనాడులోని ఎంకే స్టాలిన్ ప్రభుత్వంపై నలుమూలల నుంచి ప్రకంపనలు సృష్టించింది. దుర్ఘటనకు సీఎం బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలంటూ అన్నాడీఎంకే నేత, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి డిమాండ్ చేశారు. విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కల్తీ మద్యం అమ్మకాలను అరికట్టడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని విమర్శించారు. తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (టాస్మాక్) నుంచి ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (IMFL) కొనుగోలు చేయకుండా గుడిసెలలో అక్రమంగా మద్యం తయారు చేసి, సాచెట్‌లలో దాదాపు రూ.50 ధరకు రోజువారీ కూలీలకు విక్రయిస్తు్న్నారని ఆరోపించారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, లేదంటే రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు దిగుతామంటూ విపక్షాలు పిలుపునిచ్చాయి.

రాష్ట్రంలో అనేక చోట్ల ఇదే జరుగుతుందని, కళ్లకురిచ్చిలో కూడా పోలీసులు కల్తీ మద్యం తయారీదారులతో చేతులు కలిపినట్లు స్థానికులు ఫిర్యాదు చేస్తున్నారు. పోలీస్‌స్టేషన్‌, పోలీస్‌ క్వార్టర్స్‌ సమీపంలో అక్రమంగా మద్యం తయారు చేసి విక్రయిస్తున్నట్లు తమ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. కాగా గత ఏడాది కూడా గత ఏడాది విల్లుపురం, చెంగల్‌పట్టులో కల్తీ మద్యం దుర్ఘటనలు చోటు చేసుకోగా దాదాపు 22 మంది మృతి చెందారు. అక్రమ మద్యం తయారీదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రకటించారు. నేరస్తులపై గూండా యాక్ట్‌ కింద కేసులు నమోదు చేశామని అప్పట్లో ప్రభుత్వం తెలిపింది. కానీ తాజాగా మళ్లీ ఇదే సీన్‌ రిపీట్‌ అవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
Video: ఇది కదా ఆనందమంటే.. భాంగ్రా స్టెప్పులేసిన కోహ్లీ, అర్షదీప్
Video: ఇది కదా ఆనందమంటే.. భాంగ్రా స్టెప్పులేసిన కోహ్లీ, అర్షదీప్
మ్యాచ్‌లో ఉత్కంఠ క్షణాలు మిస్సయ్యారా.. ఈ హైలైట్స్‌ వీడియో చూడండి
మ్యాచ్‌లో ఉత్కంఠ క్షణాలు మిస్సయ్యారా.. ఈ హైలైట్స్‌ వీడియో చూడండి
ఏం తినేటట్టు లేదు.. కొండెక్కిన కూరగాయల ధరలు.. దిగిరానంటూ మారాం..!
ఏం తినేటట్టు లేదు.. కొండెక్కిన కూరగాయల ధరలు.. దిగిరానంటూ మారాం..!
400 ఆలయాలతో పేర్చినట్లు ఉండే గ్రామం ఎక్కడో తెలుసా?
400 ఆలయాలతో పేర్చినట్లు ఉండే గ్రామం ఎక్కడో తెలుసా?
అర్జునుడి పాత్ర కోసం విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ ఏంతంటే..
అర్జునుడి పాత్ర కోసం విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ ఏంతంటే..
పాలతో అందం పదిలం.. మచ్చలేని మెరిసే చర్మం కోసం ఇలా ట్రై చేయండి..!
పాలతో అందం పదిలం.. మచ్చలేని మెరిసే చర్మం కోసం ఇలా ట్రై చేయండి..!
మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది: టీమిండియా క్రికెటర్లతో ప్రధాని
మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది: టీమిండియా క్రికెటర్లతో ప్రధాని
రిపోర్టే కీలకం.. పోలవరానికి విదేశీ నిపుణుల బృందం..
రిపోర్టే కీలకం.. పోలవరానికి విదేశీ నిపుణుల బృందం..
రాత్రి పడుకునే ముందు కాళ్లు కడిగితే ఏమవుతుందో తెలుసా..?
రాత్రి పడుకునే ముందు కాళ్లు కడిగితే ఏమవుతుందో తెలుసా..?
టాలీవుడ్‌లోనే ఫేమస్ సింగర్.. ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?
టాలీవుడ్‌లోనే ఫేమస్ సింగర్.. ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?