AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: శ్రీనగర్‌లో 7 వేల మందితో ప్రధాని మోదీ యోగాసనాలు

విదేశాల్లోనూ యోగా చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని ప్రధాని ఈ సందర్భంగా తెలిపారు. పదేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం నిర్వహించుకుంటున్నామని తెలిపిన మోదీ, 2015లో తొలిసారి యోగా గురించి ప్రస్తావించాక మార్పు మొదలైందని తెలిపారు. యోగా నేర్పేందుకు వందల సంఖ్యలో సంస్థలు వెలిశాయన్నారు. ఫ్రాన్స్‌కు చెందిన...

PM Modi:  శ్రీనగర్‌లో 7 వేల మందితో ప్రధాని మోదీ యోగాసనాలు
Pm Modi Yoga
Narender Vaitla
| Edited By: |

Updated on: Jun 21, 2024 | 11:43 AM

Share

గురువారం (జూన్‌ 20) అంతర్జాతీయ యోగా దినోత్సవం జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శ్రీనగర్‌లోని డాల్‌ సరస్సు సమీపాన నిర్వహించిన 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కశ్మీర్‌ ప్రజలతో యోగా చేశారు.

విదేశాల్లోనూ యోగా చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని ప్రధాని ఈ సందర్భంగా తెలిపారు. పదేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం నిర్వహించుకుంటున్నామని తెలిపిన మోదీ, 2015లో తొలిసారి యోగా గురించి ప్రస్తావించాక మార్పు మొదలైందని తెలిపారు. యోగా నేర్పేందుకు వందల సంఖ్యలో సంస్థలు వెలిశాయన్నారు. ఫ్రాన్స్‌కు చెందిన 101 ఏళ్ల మహిళా యోగా గురును ఈ ఏడాది పద్మశ్రీతో సత్కరించినట్లు మోదీ తెలిపారు. ఆమె ఎప్పుడూ భారత్‌కు రాకపోయినప్పటికీ.. యోగాపై అవగాహన కల్పించడం కోసం తన జీవితాన్ని ధారపోశారని కొనియాడారు.

ఇక ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు, సంస్థల్లో యోగాపై నేడు అధ్యయనాలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే అనేక పరిశోధనా పత్రాలు ప్రచురితమయ్యాయని తెలిపారు. యోగా ఇప్పుడొక దైనందిన కార్యక్రమమైందని మోదీ చెప్పుకొచ్చారు. యోగా ప్రాముఖ్యతను ప్రపంచదేశాధినేతలు అడిగి తెలుసుకున్నారని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే ఈ కార్యక్రమం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ కార్యక్రమానికి హాజరైన కొందరితో సరదాగా ముచ్చటించారు. వారితో కలిసి సెల్ఫీలకు పోజులిచ్చారు. ఈ సందర్భంగా కశ్మీర్‌ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. నిజానికి ప్రధాని ఏడు వేల మందితో కలిసి ఆసనాలు వేయాల్సి ఉండగా వర్షం కారణంగా అప్పటికప్పుడు వేదికను షేర్‌-ఏ-కశ్మీర్‌ సమావేశ కేంద్రానికి మార్చారు. యోగాసనాలు వేసిన అనంతరం ప్రధాని ప్రజలతో సెల్ఫీలు దిగారు. ఈ ఫొటోలను స్వయంగా ఆయన ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు. ఈ ఫొటోలతో పాటు.. ‘శ్రీనగర్‌లో యోగాసనాలు వేసిన తర్వాత దిగిన సెల్ఫీలు. డాల్ సరస్సు వద్ద అసమాన్యమైన చైతన్యం కనిపించింది’ అంటూ రాసుకొచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..