UGC-NET 2024 Paper Leak: ‘డార్క్‌నెట్‌లో యూజీసీ నెట్‌ పేపర్‌ లీక్‌.. అందుకే రద్దు! దయచేసి రాజకీయం చేయకండి’ కేంద్ర విద్యాశాఖ

ఈ ఏడాది జూన్‌ 18న జరిగిన యూజీసీ నెట్‌ జూన్‌-2024 పరీక్షలోనూ పేపర్‌ లీక్‌ జరిగినట్లు నివేదిక అందడంతో ఈ పరీక్షను రద్దు చేశామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ గురువారం (జూన్‌ 20) మీడియా సమావేశదంలో వెల్లడించారు. పరీక్ష జరిగిన ఒక రోజు తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు ఆయన తెలిపారు. డార్క్‌ నెట్‌లో యూజీపీ నెట్‌కు సంబంధించిన క్వశ్చన్‌ పేపర్లు ప్రత్యక్షమైనట్లు..

UGC-NET 2024 Paper Leak: 'డార్క్‌నెట్‌లో యూజీసీ నెట్‌ పేపర్‌ లీక్‌.. అందుకే రద్దు! దయచేసి రాజకీయం చేయకండి' కేంద్ర విద్యాశాఖ
UGC-NET 2024 Paper Leak
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 21, 2024 | 9:05 AM

న్యూఢిల్లీ, జూన్‌ 21: ఈ ఏడాది జూన్‌ 18న జరిగిన యూజీసీ నెట్‌ జూన్‌-2024 పరీక్షలోనూ పేపర్‌ లీక్‌ జరిగినట్లు నివేదిక అందడంతో ఈ పరీక్షను రద్దు చేశామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ గురువారం (జూన్‌ 20) మీడియా సమావేశదంలో వెల్లడించారు. పరీక్ష జరిగిన ఒక రోజు తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు ఆయన తెలిపారు. డార్క్‌ నెట్‌లో యూజీపీ నెట్‌కు సంబంధించిన క్వశ్చన్‌ పేపర్లు ప్రత్యక్షమైనట్లు గుర్తించామని, దీంతో పరీక్షను రద్దు చేస్తు్న్నట్లు బుధవారమే ప్రకటించామని ధర్మేంద్ర ప్రధాన్‌ పేర్కొన్నారు. మొన్న నీట్‌ యూజీ క్వశ్చన్‌ పేపర్, నిన్న నీట్‌ యూజీ పేపర్‌ లీక్‌లు వరుసగా చోటు చేసుకోవడంతో.. ఇటువంటి జాతీయ పరీక్షల నిర్వహణను పర్వవేక్షించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పనితీరును సమీక్షించడానికి కేంద్రం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తుందని ప్రధాన్ చెప్పారు.

రెండు పరీక్షల చుట్టూ ఉన్న వివాదాల కారణంగా దాదాపు 30.4 లక్షల మంది విద్యార్ధులు ప్రభావితమైనట్లు ఆయన తెలిపారు. యూజీసీ నెట్‌ పరీక్ష సమగ్రతను దృష్టిలో ఉంచుకుని పరీక్ష నిర్వహించిన 24 గంటల్లోపే పరీక్షను రద్దు చేశామని ఆయన అన్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనలిటిక్స్ యూనిట్ నుంచి యూజీసీకి పక్కా సమాచారం అందిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. నిర్దిష్ట ప్రాంతాలలో మాత్రమే పేపర్‌లీకేజీలు బయటపడ్డాయని, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు పుకార్లను నమ్మవద్దని, ప్రతిపక్ష పార్టీలు ఈ అంశాన్ని రాజకీయం చేయవద్దని ఆయన కోరారు.

అయితే ఈ పరీక్షపై తమకు ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని, విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సుమోటోగా ఈ చర్యలు చేపట్టినట్లు విద్యాశాఖ జాయింట్‌ సెక్రటరీ గోవింద్‌ జైశ్వాల్‌ గురువారం వెల్లడించారు. యేటా రెండుసార్లు నిర్వహించే UGC-NETకి కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. జూన్ ఎడిషన్ పరీక్ష జూన్ 18న పెన్ను, పేపర్‌ విధానంలో నిర్వహించగా.. దాదాపు 908,580 మంది అభ్యర్థులు 83 సబ్జెక్టులలో 1,200 కేంద్రాలలో పరీక్షలు రాశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.