Hyderabad: చిత్రపురి కాలనీలో భయానక ఘటన.. వాకింగ్‌కు వెళ్లిన మహిళపై 15 కుక్కల దాడి! వీడియో వైరల్
హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని చిత్రపురి కాలనీలో ఉదయం 6 గంటల సమయంలో నడుచుకుంటూ వెళ్తోన్న మహిళపై వీధికుక్కలు ఒకసారిగా దాడికి తెగబడ్డాయి. సుమారు 15 కుక్కలు మహిళను చుట్టుముట్టాయి. ఆమెను కరిచేందుకు విఫలయత్నం చేశాయి. చుట్టుముట్టిన వీధి కుక్కల బారి నుంచి తప్పించుకునేందుకు ఆ మహిళ గట్టిగా కేకలు వేసినా..
హైదరాబాద్, జూన్ 23: మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లిన మహిళపై వీధి కుక్కల గుంపు దాడి చేసిన ఘటన స్థానికంగా భయాందోళనలు కలిగిస్తుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 వీధి కుక్కలు పాశవికంగా దాడికి తెగబడ్డాయి. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని చిత్రపురి కాలనీలో శనివారం (జూన్ 22) ఉదయం ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని చిత్రపురి కాలనీలో ఉదయం 6 గంటల సమయంలో నడుచుకుంటూ వెళ్తోన్న మహిళపై వీధికుక్కలు ఒకసారిగా దాడికి తెగబడ్డాయి. సుమారు 15 కుక్కలు మహిళను చుట్టుముట్టాయి. ఆమెను కరిచేందుకు విఫలయత్నం చేశాయి. చుట్టుముట్టిన వీధి కుక్కల బారి నుంచి తప్పించుకునేందుకు ఆ మహిళ గట్టిగా కేకలు వేసినా అవి కాస్తైనా వెనకడుగు వేయలేదు. వాటి నుంచి తప్పించుకునే క్రమంలో మహిళ కిందపడిపోవడంతో కుక్కలన్నీ ఆమెపైకి ఎగబడ్డాయి. తనచేతులతో వాటిని అదిలిస్తూ ప్రాణాలు కాపాడుకునేందుకు ఆ మహిళ అష్టకష్టాలు పడింది. ఉదయం వేళ కావడంతో రోడ్డు కూడా నిర్మానుష్యంగా ఉండటంతో కుక్కలు రెచ్చిపోయాయి. ఇంతలో అటుగా ఓ ద్విచక్రవాహనదారుడు, కారు రావడంతో కుక్కలు అక్కడి నుంచి పలాయనం చిత్తగించాయి. కుక్కలదాడిలో మహిళ ప్రాణాలతో బయటపడినప్పటికీ.. ఆమెకు తీవ్రగాయాలయ్యాయి.
Today this incident happend in Chitrapuri hills MIG Manikonda, in this community there are almost 20 stray dogs.many kids got bitten be these dogs this year already.maintainence wont take any action. Ghmc is anyhow useless in this case. @sudhakarudumula @TheNaveena @TV9Telugu pic.twitter.com/uzmnmLjvt1
— vidyasagarReddy (@Sagarnani909) June 21, 2024
ఈ దృశ్యాలన్నీ అక్కడి సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బాధిత మహిళ భర్త ఈ షాకింగ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ప్రాంతంలో కుక్కల బెడద ఎక్కువైందని, ఈ మధ్య కాలంలో చాలా మంది పిల్లలు కూడా కుక్కల దాడికి బలైపోయారని పేర్కొన్నారు. వీధి కుక్కలకు ఇంటి బయట ఆహారం పెట్టొద్దని, వీటికి ఆహారం పెట్టి అలవాటు చేస్తే తన భార్యకు ఎదురైన పరిస్థితే మీకు కూడా రావొచ్చంటూ తన పోస్టులో విజ్ఞప్తి చేశారు. అదృష్టవశాత్తూ తన భార్య కుక్కల నుంచి తనను తాను రక్షించుకోగలిగింది. అదే పిల్లలకు జరిగి ఉంటే కుక్కల నుంచి తమ ప్రాణాలను కాపాడుకోగలిగేవారా? అని ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.