AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మద్యం తాగాడు, చికెన్‌ బిర్యానీ తిన్నాడు.. అంతలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఏమైందంటే

ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ఈ క్రమంలోనే హైదారాబాద్‌లో నివాసం ఉండే సోదరిని కలవడానికి శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చాడు. సోదరిని అప్పటికే ఇల్లు ఖాళీ చేసి మరో ఇంట్లోకి వెళ్లడంతో అడ్రస్‌ ఎక్కడో తెలుసుకునేందుకు ఫోన్‌ చేశాడు. అయితే తాము ఓ విందులో ఉన్నామని, వచ్చేసరికి ఆలస్యమవుతుందని ఆమె తెలిపింది. దీంతో అంతలోపు...

Hyderabad: మద్యం తాగాడు, చికెన్‌ బిర్యానీ తిన్నాడు.. అంతలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఏమైందంటే
Representative Image
Narender Vaitla
|

Updated on: Jun 23, 2024 | 6:36 AM

Share

హైదరాబాద్‌లో దారుణ సంఘటన జరిగింది. చికెన్ బిర్యానీ తిన్న ఓ వ్యక్తి గొంతులో చికెన్‌ ముక్క ఇరుక్కోవడంతో ఊపిరాడక ప్రాణాలు వదిలాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని కోఠిలో జరిగింది. వివరాల్లోకివెళితే.. సనుగోముల శ్రీకాంత్‌ (39) స్వస్థలం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని అన్నారం గ్రామం.

ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ఈ క్రమంలోనే హైదారాబాద్‌లో నివాసం ఉండే సోదరిని కలవడానికి శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చాడు. సోదరిని అప్పటికే ఇల్లు ఖాళీ చేసి మరో ఇంట్లోకి వెళ్లడంతో అడ్రస్‌ ఎక్కడో తెలుసుకునేందుకు ఫోన్‌ చేశాడు. అయితే తాము ఓ విందులో ఉన్నామని, వచ్చేసరికి ఆలస్యమవుతుందని ఆమె తెలిపింది. దీంతో అంతలోపు కోఠిలో ఓ మద్యం దుకాణంలో మద్యం సేవించిన శ్రీకాంత్‌, అనంతరం చికెన్‌ బిర్యానీ తిన్నాడు.

ఆ తర్వాత స్నేహితుడి ఇంటికి వెళ్లేందుకు ఆటోలో లక్ష్మీ నగర్‌ కాలనీకి బయలుదేరాడు. అయితే చికెన్‌ బిర్యానీ తిన్నసమయంలో గొంతులో ముక్క ఇరుక్కుపోవడంతో శ్వాస ఆడక ఆటోలోనే కప్పకూలిపోయాడు. దీంతో ఇది గమనించిన ఆటో డ్రైవర్‌ రోడ్డు పక్కనే పడుకోబెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో ఇది గమనించిన స్థానికులు శనివారాం ఉదయం పోలీసులకు సమాచారం అందించారు.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు శ్రీకాంత్ మొబైల్‌లో చివరిగా కాల్‌ చేసిన అతని సోదరికి విషయం తెలిపారు. దీంతో ఆమె వివరాలు వెల్లడించింది. సీసీ టీవీ ఆధారంగా ఆటో డ్రైవర్‌ను పిలిపించి మాట్లడగా.. మద్యం కారణంగా చనిపోయినట్లు భావించారు. అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం శవాన్ని ఆసుపత్రికి తరలించగా గొంతులో మాంసం ముక్క ఇరుక్కుపోవడం కారణంగా ఊపిరి ఆడక చనిపోయినట్లు తేలింది.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్