TG DSC Exam Dates: డీఎస్సీకి భారీగా దరఖాస్తులు.. త్వరలో హాల్‌టికెట్లు విడుదల

తెలంగాణ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. డీఎస్సీ పరీక్షకు మొత్తం 2,79,956 దరఖాస్తులు అందినట్లు విద్యాశాఖ తెలిపింది. మొత్తం 11,062 పోస్టుల భర్తీకి విద్యాశాఖ ఈ ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్‌ జారీచేసిన సంగతి తెలిసిందే. డీఈడీ, బీఈడీ పూర్తిచేసివారు టెట్‌ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు మాత్రమే డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ), స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ) పోస్టులకు..

TG DSC Exam Dates: డీఎస్సీకి భారీగా దరఖాస్తులు.. త్వరలో హాల్‌టికెట్లు విడుదల
TG DSC Exam Dates
Follow us

|

Updated on: Jun 23, 2024 | 9:04 AM

హైదరాబాద్‌, జూన్‌ 23: తెలంగాణ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. డీఎస్సీ పరీక్షకు మొత్తం 2,79,956 దరఖాస్తులు అందినట్లు విద్యాశాఖ తెలిపింది. మొత్తం 11,062 పోస్టుల భర్తీకి విద్యాశాఖ ఈ ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్‌ జారీచేసిన సంగతి తెలిసిందే. డీఈడీ, బీఈడీ పూర్తిచేసివారు టెట్‌ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు మాత్రమే డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ), స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ) పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. బీఈడీ పూర్తిచేసిన వారు టెట్‌ పాసైతే స్కూల్‌ అసిస్టెంట్‌లోనే రెండు మెథడాలజీ సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. ఆ ప్రకారం ఒక్కో అభ్యర్ధి రెండు సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకుని ఉంటే డీఎస్సీకి పోటీపడే అభ్యర్థుల సంఖ్య 2 లక్షల వరకే ఉంటుందని విద్యాశాఖ అంచనా వేస్తోంది. ఆ లెక్కన చూస్తే ఒక్కో పోస్టుకు సుమారు 25 మంది పోటీ పడుతున్నారు.

అత్యధికంగా హైదరాబాద్‌ జిల్లా నుంచి 27,027 దరఖాస్తులురాగా.. తర్వాత నల్గొండ నుంచి 15,610 దరఖాస్తులు అందాయి. 5 శాతం నాన్‌లోకల్‌ కోటా ఉండటంతో ఇతర జిల్లాల వారు సైతం హైదరాబాద్‌ జిల్లాకు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో పెద్దఎత్తున దరఖాస్తులు అందాయని భావిస్తున్నారు. అతి తక్కువగా మేడ్చల్‌ జిల్లా నుంచి 2,265 మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా నుంచి 2,828 దరఖాస్తులు అందాయి. ప్రభుత్వం డీఎస్సీకి ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చినందున టెట్‌లో అర్హత సాధించిన వారిలో 23,919 మంది ఫీజు చెల్లించకుండానే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఇక డీఎస్సీ పరీక్షలు జులై 17 నుంచి 31 వరకు ఆన్‌లైన్ లో జరగనున్న సంగతి తెలిసిందే. పరీక్షకు వారం రోజుల ముందు హాల్ టికెట్లు వెలువడే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

విమానాల్లో Wi-Fi ఎందుకు ఉండదు? ఒకవేళ ఉంటే ఏమవుతుంది?
విమానాల్లో Wi-Fi ఎందుకు ఉండదు? ఒకవేళ ఉంటే ఏమవుతుంది?
దసరాతో దశ తిరిగిపోతుంది అంతే..! ఆ రాశుల వారి జీవితాల్లో శుభాలు
దసరాతో దశ తిరిగిపోతుంది అంతే..! ఆ రాశుల వారి జీవితాల్లో శుభాలు
అరకు పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్.
అరకు పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్.
వరద బాధితులకు 'మంచు' ఫ్యామిలీ విరాళం.. చంద్రబాబు బొమ్మ గీసి..
వరద బాధితులకు 'మంచు' ఫ్యామిలీ విరాళం.. చంద్రబాబు బొమ్మ గీసి..
గ్రేటర్ హైదరాబాద్‌లో పోస్టర్లు, వాల్ పెయింటింగ్స్ బ్యాన్..!
గ్రేటర్ హైదరాబాద్‌లో పోస్టర్లు, వాల్ పెయింటింగ్స్ బ్యాన్..!
చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!
చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!
మనదేశంలోని ఈ పర్వతాలపై ట్రెక్కింగ్ చాలా కష్టం..! ఒక సాహసయాత్రే..
మనదేశంలోని ఈ పర్వతాలపై ట్రెక్కింగ్ చాలా కష్టం..! ఒక సాహసయాత్రే..
వాయమ్మో.! వంటలక్క ఆస్తులు ఇన్ని కోట్లా.? విలువ ఎంతో తెలిస్తే
వాయమ్మో.! వంటలక్క ఆస్తులు ఇన్ని కోట్లా.? విలువ ఎంతో తెలిస్తే
ఆ రాశుల వారికి అధికార, గృహ, ఉద్యోగ యోగాలు
ఆ రాశుల వారికి అధికార, గృహ, ఉద్యోగ యోగాలు
లక్ష్యం ఒక్కటే.. కబ్జా చేస్తే ఊరుకునేదీ లేదుః రంగనాథ్
లక్ష్యం ఒక్కటే.. కబ్జా చేస్తే ఊరుకునేదీ లేదుః రంగనాథ్