SSC CPO SI Exam Dates: ఎస్సై రాత పరీక్ష తేదీలు వెల్లడి.. వెబ్‌సైట్లో రోల్ నంబర్, పరీక్ష కేంద్రం వివరాలు
ఢిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్)లో సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి సంబంధించిన రాత పరీక్ష తేదీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. జూన్ 27, 28, 29 తేదీల్లో ఎస్సై రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు కమిషన్ తెలిపింది. రాత పరీక్ష ఆన్‌లైన్ విధానంలో జరుగుతుంది. ఇప్పటికే పేపర్1 అభ్యర్థుల రోల్ నంబర్, పరీక్ష కేంద్రం వివరాలను వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచింది..
న్యూఢిల్లీ, జూన్ 23: ఢిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్)లో సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి సంబంధించిన రాత పరీక్ష తేదీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. జూన్ 27, 28, 29 తేదీల్లో ఎస్సై రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు కమిషన్ తెలిపింది. రాత పరీక్ష ఆన్‌లైన్ విధానంలో జరుగుతుంది. ఇప్పటికే పేపర్1 అభ్యర్థుల రోల్ నంబర్, పరీక్ష కేంద్రం వివరాలను వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి రోల్ నంబర్, పరీక్ష కేంద్రం, నిర్వహణ తేదీ తదితర వివరాలను తెలుసుకోవచ్చని ఎస్సెస్సీ తన ప్రకటనలో వెల్లడించింది. పరీక్ష హాల్ టికెట్లు రెండు రోజుల్లో విడుదల కానున్నాయి.
మొత్తం 4187 సబ్-ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ వెలువరించింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా ఢిల్లీ పోలీసు విభాగంతో పాటు కేంద్ర సాయుధ బలగాలైన (సీఏపీఎఫ్) బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీలోసబ్-ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలు భర్తీ చేస్తారు. పేపర్-1, 2 రాత పరీక్ష, పీఈటీ, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్‌టీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, నెల్లూరు, చీరాల, విజయనగరం, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.