Acharya Laxmikant Dixit: అయోధ్య రాముడి ప్రాణ‌ప్రతిష్ట చేసిన ప్రధాన పూజారి ఆచార్య ల‌క్ష్మీకాంత్ దీక్షిత్ కన్నుమూత.. ప్రధాని మోదీ సంతాపం

ఈ ఏడాది ప్రారంభంలో అయోధ్య‌ రామాలయంలో బాల‌రాముడికి ప్రాణ ప్రతిష్ట చేసిన ప్రధాన పూజారి ఆచార్య ల‌క్ష్మీకాంత్ దీక్షిత్ (86) శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. గ‌త కొన్ని రోజులుగా  అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం 6.30 గంటలకు నిద్రలేచి బాత్రూం వైపు..

Acharya Laxmikant Dixit: అయోధ్య రాముడి ప్రాణ‌ప్రతిష్ట చేసిన ప్రధాన పూజారి ఆచార్య ల‌క్ష్మీకాంత్ దీక్షిత్ కన్నుమూత.. ప్రధాని మోదీ సంతాపం
Acharya Laxmikant Dixit
Follow us

|

Updated on: Jun 24, 2024 | 1:46 PM

వార‌ణాసి, జూన్‌ 23: ఈ ఏడాది ప్రారంభంలో అయోధ్య‌ రామాలయంలో బాల‌రాముడికి ప్రాణ ప్రతిష్ట చేసిన ప్రధాన పూజారి ఆచార్య ల‌క్ష్మీకాంత్ దీక్షిత్ (86) శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. గ‌త కొన్ని రోజులుగా  అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం 6.30 గంటలకు నిద్రలేచి బాత్రూం వైపు నడుస్తుండగా స్పృహతప్పి పడిపోయాడని ఆయన కుమారుడు సునీల్ దీక్షిత్ తెలిపారు. అనంతరం 7 గంటల ప్రాంతంలో వారణాసిలోని తన నివాసంలో తుది శ్వాస విడిచినట్లు మీడియాకు వెల్లడించారు.

వార‌ణాసిలోని గాంగా న‌ది తీరంలో ఉన్న మ‌ణిక‌ర్ణిక ఘాట్‌లో ఆయ‌న మృత‌దేహానికి అంత్యక్రియ‌లు నిర్వహించ‌నున్నారు. ఈ ఏడాది జ‌న‌వ‌రి 22వ తేదీన అయోధ్యలో రామ్‌ల‌ల్లాను ప్రతిష్టించిన విష‌యం తెలిసిందే. ఆ రోజున నిర్వహించిన పూజ‌ల‌కు ఆచార్య ల‌క్ష్మీకాంత్ దీక్షిత్ ప్రధాన పూజారిగా వ్యవహరించారు. వార‌ణాసిలో ఉన్న పండితుల్లో లక్ష్మీకాంత్ దీక్షిత్‌ను అగ్రగ‌ణ్యులుగా పరిగణిస్తారు. ఆయన స్వస్థలం మ‌హారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా. అయితే కుటుంబ‌స‌భ్యులు మాత్రం ఎన్నో త‌రాలుగా వార‌ణాసిలోనే నివ‌సిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఆచార్య ల‌క్ష్మీకాంత్ దీక్షిత్ మృతి ప‌ట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. దీక్షిత్ జీ కాశీలోని పండిత సంప్రదాయానికి ప్రసిద్ధి చెందిన వ్యక్తి. కాశీ విశ్వనాథ్ ధామ్, రామ మందిరం ప్రారంభోత్సవం రోజులో ఆయన సేవలు మరచిపోలేనివి. ఆయన మృతి సమాజానికి తీరని లోటు అని ఎక్స్‌ వేదికగా ఆయన అన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఆచార్య దీక్షిత్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆచార్య ల‌క్ష్మీకాంత్ దీక్షిత్ కాశీకి చెందిన గొప్ప పండితుడు అని, శ్రీరామ జ‌న్మభూమి ప్రాణ ప్రతిష్టలో ఆయ‌న పాల్గొన్నార‌ని, ఆయ‌న మ‌న‌ల్ని వ‌దిలివెళ్లడం.. ఆధ్యాత్మిక‌ ప్రపంచానికి తీరని లోటని సీఎం యోగి పేర్కొన్నారు. సంస్కృత భాష‌కు, భార‌తీయ సంస్కృతికి ఆయ‌న చేసిన సేవ‌ల్ని ప్రజ‌లు ఎప్పటికీ గుర్తుంచుకుంటార‌ని సీఎం యోగి త‌న ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
సల్మాన్ కు పెళ్లి ఎందుకు కాలేదో చెప్పిన సల్మాన్ తండ్రి
సల్మాన్ కు పెళ్లి ఎందుకు కాలేదో చెప్పిన సల్మాన్ తండ్రి
కల్కితో థియేటర్‌ హంగామా చేసిన ప్రభాస్ పెద్దమ్మ
కల్కితో థియేటర్‌ హంగామా చేసిన ప్రభాస్ పెద్దమ్మ
తన యాక్టింగ్‌తో దిమ్మతిరిగేలా చేస్తున్న దుల్కర్ సల్మాన్
తన యాక్టింగ్‌తో దిమ్మతిరిగేలా చేస్తున్న దుల్కర్ సల్మాన్
అడవిలో తప్పిపోయిన వ్యక్తి .. ఎలా బయటపడ్డాడంటే ??
అడవిలో తప్పిపోయిన వ్యక్తి .. ఎలా బయటపడ్డాడంటే ??
చిన్నారి NTR క్లాసికల్ డ్యాన్స్‌.. ఇదిగో వీడియో..
చిన్నారి NTR క్లాసికల్ డ్యాన్స్‌.. ఇదిగో వీడియో..
కొంపముంచిన రీల్స్ సరదా.. కార్లతో సముద్రంలో చిక్కుకున్న యువకులు..!
కొంపముంచిన రీల్స్ సరదా.. కార్లతో సముద్రంలో చిక్కుకున్న యువకులు..!
గాల్లో పల్టీలు కొడుతున్న కార్లో స్టార్ హీరో.. వీడియో చూసి షాక్‌.!
గాల్లో పల్టీలు కొడుతున్న కార్లో స్టార్ హీరో.. వీడియో చూసి షాక్‌.!
కల్కి షో రద్దు.. థియేటర్ మేనేజర్‌కు ఇచ్చిపడేసిన ఫ్యాన్.. వీడియో.
కల్కి షో రద్దు.. థియేటర్ మేనేజర్‌కు ఇచ్చిపడేసిన ఫ్యాన్.. వీడియో.
ఇంటర్నెట్లోకి అప్పుడే వచ్చేసిన కల్కి Full HD ప్రింట్. ఫాన్స్ షాక్
ఇంటర్నెట్లోకి అప్పుడే వచ్చేసిన కల్కి Full HD ప్రింట్. ఫాన్స్ షాక్
కల్కి క్లైమాక్స్‌ చూస్తే.. ఎగ్జైట్మెంట్‌తో అందరూ చేసిన పనికి షాక్
కల్కి క్లైమాక్స్‌ చూస్తే.. ఎగ్జైట్మెంట్‌తో అందరూ చేసిన పనికి షాక్