కాఫీ ప్రియులకు శుభవార్త.. మీ ఆయుష్షు పెరిగినట్టే.. తాజా అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడి..!

కాఫీ తాగే వారిలో మొత్తంగా మరణాల ముప్పు తక్కువగా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. కాఫీలని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఈ ప్రయోజనాలకు దోహదం చేస్తాయి. క్రమమైన శారీరక శ్రమ, పోషకమైన ఆహారం వంటి ఇతర ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లతో సమత్యుల ఆహారంలో భాగంగా కాఫీని మితంగా తీసుకుంటే తప్పేమీ లేదని పరిశోధకులు చెబుతున్నారు.

కాఫీ ప్రియులకు శుభవార్త.. మీ ఆయుష్షు పెరిగినట్టే.. తాజా అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడి..!
Coffee
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 25, 2024 | 7:07 AM

కాఫీ ప్రియులకు శుభవార్త.. ఇటీవల ‘సైన్స్‌ అలెర్ట్‌’లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. కాఫీ తాగేవారి ఆయుష్షు పెరిగినట్టే..! అవును మీరు చదివింది నిజమే.. కాఫీ తాగని వారితో పోలిస్తే.. కాఫీ అలవాటు ఉన్నవారిలో మరణాల ప్రమాదం తక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు.. USలో జరిపిన ఈ అధ్యయనంలో పలు కీలక విషయాలు వెల్లడించారు.

గంటల తరబడి అదేపనిగా కూర్చోవడం, ఎక్కువ సేపు కూర్చుని పనిచేయడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరుతాయన్నది ఇప్పటికే వైద్యులు చాలసార్లు హెచ్చరిస్తూనే వస్తున్నారు. అయితే, ఎక్కువసేపు కూర్చున్నప్పటికీ రోజూ కాఫీ తాగడం వల్ల మరణ ముప్పును తగ్గించుకోవచ్చని తాజా అధ్యయనం తేల్చింది. ఈ విషయంలో కాఫీ ఆశ్చర్యకరమైన ఆయుధంగా పనిచేస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. కాఫీ తాగని వారితో పోలిస్తే ఎక్కువసేపు కూర్చుని ఉన్నప్పటికీ, రోజూ కాఫీ తాగేవారు వివిధ కారణాల వల్ల చనిపోయే ముప్పు తక్కువగా ఉంటుందని వివరించారు.

10 వేలమందిపై జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. నిశ్చల జీవనశైలి కలిగి కాఫీ అలవాటు ఉండేవారిలో హృద్రోగ సమస్యలతో మరణించే ముప్పు తక్కువగా ఉందని పరిశోధకులు తేల్చారు. అలాగే, ఎక్కువసేపు కూర్చుని ఉండి కాఫీ తాగని వారితో పోలిస్తే, రోజుకు 2.5 కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగే వారిలో మొత్తంగా మరణాల ముప్పు తక్కువగా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. కాఫీలని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఈ ప్రయోజనాలకు దోహదం చేస్తాయి. క్రమమైన శారీరక శ్రమ, పోషకమైన ఆహారం వంటి ఇతర ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లతో సమత్యుల ఆహారంలో భాగంగా కాఫీని మితంగా తీసుకుంటే తప్పేమీ లేదని పరిశోధకులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..