Viral News: రెస్టారెంట్ బిర్యానీ ఇష్టం అంటూ తెగ లాగించేస్తున్నారా.. జాగ్రత్త సుమా.. ఆర్డర్ పెట్టిన చికెన్‌లో పురుగు
సాంకేతికత చాలా వేగంగా పెరుగుతోంది.. దీంతో క్షణాల్లో నచ్చిన మెచ్చిన వస్తువులు ఇంటికే చేరుకుంటున్నాయి. అయితే ఒకొక్కసారి సిబ్బంది తొందరపాటు కారణంగా అనేక విషయాలు తప్పుగా జరుగుతూ ఉంటాయి. అప్పుడు తమ వద్దకు డెలివరీ అయ్యిన వస్తువులను తిరిగి ఇవ్వవలసి ఉంటుంది. అలాంటి ఉదంతమే ఈ రోజుల్లో ప్రజల్లో చర్చనీయాంశమైంది. ఇది చూసిన తర్వాత ఎవరైనా షాక్ తింటారు.
ప్రస్తుతం పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ఇంట్లో తయారు చేసిన ఆహారం కంటే బయట ఫుడ్ ని తినడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇందుకోసం ఇంట్లో కూర్చుని ఆన్ లైన్ లో ఆర్డర్ పెడతారు లేదా బయటకు వెళ్లి రెస్టారెంట్ లో హ్యాపీగా నచ్చిన మనసు మెచ్చిన ఆహారాన్ని ఆర్డర్ చేసి కడుపునిండా లాగించేస్తున్నారు. ఇలా ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని తినడం వలన టేస్ట్ కి టేస్ట్ ఉంటుందని సమయం అదా అవుతుందని ఎక్కువ మంది ఆలోచిస్తున్నారు. సాంకేతికత చాలా వేగంగా పెరుగుతోంది.. దీంతో క్షణాల్లో నచ్చిన మెచ్చిన వస్తువులు ఇంటికే చేరుకుంటున్నాయి. అయితే ఒకొక్కసారి సిబ్బంది తొందరపాటు కారణంగా అనేక విషయాలు తప్పుగా జరుగుతూ ఉంటాయి. అప్పుడు తమ వద్దకు డెలివరీ అయ్యిన వస్తువులను తిరిగి ఇవ్వవలసి ఉంటుంది. అలాంటి ఉదంతమే ఈ రోజుల్లో ప్రజల్లో చర్చనీయాంశమైంది. ఇది చూసిన తర్వాత ఎవరైనా షాక్ తింటారు.
హైదరాబాద్ నగరం అంటే అందరికి ముందుగా గుర్తుకు వచ్చేది బిర్యానీనే.. ధమ్ బిర్యానీ ప్రపంచ ప్రసిద్ది పేరుగాంచిందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక్కడ బిర్యానీకి ఉన్న క్రేజ్ స్థానికులకే కాదు భారతదేశం నలుమూలల నుంచి ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తారు. అయితే ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన బిర్యానీలో ఎలుకలు, బొద్దింకలు, కప్పలు, బ్లేడ్‌లు దొరుకుతున్నాయనే ఫిర్యాదులు తరచుగా వినిపిస్తున్నాయి. ఎన్ని ఫిర్యాదులు వచ్చినా ఈ ట్రెండ్ ఆగకపోవడం ఆశ్చర్యకరం. ఇప్పుడు బయటకు వచ్చిన ఈ వార్త వింటే ఎవరైనా షాక్ తినాల్సిందే.. ఓ మహిళ ఆకలి వేసి తిందాం అని ఆన్ లైన్ లో బిర్యానీ ఆర్డర్ చేసింది. అయితే ఈ బిర్యానీలో పురుగు బయటికి వచ్చింది.
ఇక్కడ చిత్రాన్ని చూడండి
Mehfil biryani, Kukatpally Bugs in chicken pieces @cfs_telangana This is the response from @Swiggy (Refund of 64rs for a bill of 318rs : Order id – 178009783111586) Please stop ordering from Mehfil kukatpally pic.twitter.com/o8UBaTCzk2
— Sai Teja (@Karlmarx__07) June 23, 2024
భాగ్యనగరానికి చెందిన సాయి తేజ అనే వ్యక్తి తాను తినే ఆహారంలో పురుగు కనిపింన విషయాన్ని ప్రస్తావిస్తూ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో ఒక చిత్రాన్ని పంచుకున్నారు. కూకట్‌పల్లిలోని ‘మెహ్‌ఫిల్ బిర్యానీ’ షాప్ నుంచి ఏ ఫుడ్ ఆర్డర్ చేయవద్దని ఇతర వినియోగదారులకు సూచించాడు కూడా. ఓవైపు సోషల్ మీడియాలో ఫోటో షేర్ చేస్తూ.. మరోవైపు ఈ విషయంపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐకి కూడా ఫిర్యాదు చేశారు. ఈ పోస్ట్ ఇంటర్నెట్‌లో పోస్ట్ చేయడంతో నెట్టింట్లో ఓ రెంజ్ లో వైరల్‌గా మారింది.
ఇప్పటి వరకూ ఈ వీడియోను వేలాది మంది చూస్తూ.. రకరకాల కామెంట్స్ చేస్తున్న్నారు. అయితే ఈ ఘటన స్విగ్గీ యాప్ సిబ్బంది సాయి తేజకు మొత్తం బిల్లు రూ. 318లో రూ. 64 వాపసు ఇచ్చింది. అయితే కంపెనీ ఇచ్చిన డబ్బులతో సాయి సంతోషంగా లేడు. ఈ ‘మెహ్ఫిల్ బిర్యానీ’ యజమాని ప్రముఖ స్టాండ్-అప్ కమెడియన్ జాకీర్ ఖాన్ అన్న సంగతి తెలిసిందే.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..