Beautiful Waterfalls: రాజస్థాన్‌లో కూడా అందమైన జలపాతాలు.. వర్షాకాలంలో వీటి అందాలు చూడడానికి రెండు కళ్ళు చాలవేమో..
రాజస్తాన్ లో అందమైన ప్రదేశాలు, కోటలు, రాజరికపు పాలనను గుర్తు చేసే ఎన్నో ప్యాలెస్ లు ఉన్నాయి.. ఈ సంగతి అందరికీ తెలిసిందే.. అయితే వీటితో పాటు రాజస్థాన్‌లో కూడా చాలా జలపాతాలు ఉన్నాయని ఎవరికైనా తెలుసా.. ఈ జలపాతాలు, ప్రకృతి, పచ్చదనం ఎవరి హృదయాన్ని అయినా ఆనందపరుస్తుంది. వర్షాకాలంలో ఈ ప్రదేశాల అందం మరింత పెరుగుతుంది.
రాజస్థాన్ పేరు వినగానే థార్ ఎడారి.. అక్కడ కట్టిన సంస్థానాల కోటలు గుర్తుకు వస్తాయి. అదే సమయంలో వేసవి కాలంలో రాజస్థాన్‌కు వెళ్దాం అని అంటే అమ్మో అనేసి ప్రయాణానికి వీలైనంత దూరంగా ఉంటారు. ఎందుకంటే రాజస్థాన్ లో రికార్డ్ స్తాయిలో ఉష్ణోగ్రత ఉంటుంది. అదే సమయంలో పచ్చదనం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ ఏడాది రాజస్థాన్‌లోని ఉష్ణోగ్రత గత రికార్డులను బద్దలు కొట్టింది. అయితే రాజస్తాన్ లో అందమైన ప్రదేశాలు, కోటలు, రాజరికపు పాలనను గుర్తు చేసే ఎన్నో ప్యాలెస్ లు ఉన్నాయి.. ఈ సంగతి అందరికీ తెలిసిందే.. అయితే వీటితో పాటు రాజస్థాన్‌లో కూడా చాలా జలపాతాలు ఉన్నాయని ఎవరికైనా తెలుసా.. ఈ జలపాతాలు, ప్రకృతి, పచ్చదనం ఎవరి హృదయాన్ని అయినా ఆనందపరుస్తుంది. వర్షాకాలంలో ఈ ప్రదేశాల అందం మరింత పెరుగుతుంది.
రాజస్థాన్ దీనికే సొంతమైన సంస్కృతి, రుచికరమైన ఆహారం, చారిత్రక కోటలకు ప్రసిద్ధి చెందింది. అయితే ఏడాదిలో ఎక్కువ సమయం వేడిగా ఉండే రాజస్థాన్‌లో కనులకు విందు చేసే అనేక జలపాతాలు ఉన్నాయి. ఇక్కడకు వెళ్లి చల్లదనం అనుభవిస్తూ ఆనందంగా గడపవచ్చు. ఈ రోజు ఆ జలపాతాలు ఏమిటో చూద్దాం..
భీమలత జలపాతం
ఏడారి ప్రదేశం రాజస్థాన్‌లో పచ్చదనంతో నిండిన ప్రదేశాన్ని చూడాలనుకుంటే.. భీమ్లాట్ ను ఎంపిక చేసుకోవచ్చు. ఈ ప్రాంతం ప్రకృతి సౌందర్యానికి నిధి. రాజస్థాన్‌లోని బుండి నుంచి సుమారు 35 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత భీమలత జలపాతం వద్దకు చేరుకోవచ్చు. వర్షాకాలంలో ఈ ప్రదేశం అందాల గురించి వర్ణించడానికి కూడా సరిపోవు. ఇది చూడదగిన జలపాతం కూడా .
ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి
View this post on Instagram
పదఝర్ మహాదేవ్ జలపాతం
రాజస్థాన్‌లోని బుండి ప్రాంతంలో ఉన్న పదఝర్ మహాదేవ్ జలపాతం అందం కూడా చూడదగ్గదే. ఈ ప్రదేశం దీని సహజ సౌందర్యంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ రామేశ్వర్ మహాదేవ్ గుహను కూడా సందర్శించవచ్చు. ఆధ్యాత్మిక శాంతిని కలిగిస్తుంది.
ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి
View this post on Instagram
మెనాల్ జలపాతాన్ని సందర్శించండి
రాజస్థాన్‌లోని అత్యంత ప్రత్యేక వారసత్వ ప్రదేశాల్లో ఒకటైన చిత్తోర్‌ఘర్ కోట చాలా మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇక్కడ మేనల్ జలపాతం ప్రవహిస్తుంది. ఇది హృదయాన్ని ఆకట్టుకుంటుంది. ఆహ్లాదపరుస్తుంది. దాదాపు 15 మీటర్ల ఎత్తు నుంచి భూమి మీదకు జాలువారే ఈ జలపాతం చాలా అందంగా కనిపిస్తుంది.
ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి
View this post on Instagram
చులియా జలపాతం
రాజస్థాన్‌లోని రాణా ప్రతాప్ సాగర్ డ్యామ్ సమీపంలో ఉన్న జలపాతం ఆ రాష్ట్రంలోని ఉన్న అందమైన పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఇక్కడ ఏర్పడిన సహజ శిలల దృశ్యం కూడా మనసును ఆకట్టుకుంటుంది. ఈ వృత్తాకార జలపాతం ఆకర్షణీయంగా కనిపిస్తూ కనుల విందు చేస్తుంది.
ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి
View this post on Instagram
ఎవరైనా రాజస్థాన్‌కు వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే.. అక్కడి చారిత్రక కట్టడాలను చూడడం, షాపింగ్ చేయడం మాత్రమే కాదు ప్రకృతి అందాలతో నిండిన ఈ నీటి జలపాతాలను కూడా సందర్శించవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..