AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anushka Shetty: వింత వ్యాధితో బాధపడుతున్న స్వీటీ.. నవ్వడం మొదలు పెడితే షూటింగ్ కూడా ఆపెయ్యాల్సిందేనట..

తెలుగు, తమిళ, సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనుష్క శెట్టి.. బాహుబలి సినిమా కంటే ముందే హిందీ ప్రేక్షకుల్లో కూడా సింగం వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా అనుష్క శెట్టి తన ఆరోగ్యం గురించి షాకింగ్ న్యూస్ వెల్లడించింది. తనకు అరుదైన వ్యాధి సోకిందని చెప్పింది. తాను నవ్వడం మొదలుపెడితే ఆపుకోలేనని.. అలా నవ్వుతూనే ఉంటానని ప్రకటించింది. ఇలా నవ్వుతూ మళ్లీ సాధారణ స్థితికి రావడానికి 15-20 నిమిషాలు పడుతుందని తెలిపింది.

Anushka Shetty: వింత వ్యాధితో బాధపడుతున్న స్వీటీ.. నవ్వడం మొదలు పెడితే షూటింగ్ కూడా ఆపెయ్యాల్సిందేనట..
Anushka Shetty
Surya Kala
| Edited By: |

Updated on: Aug 12, 2024 | 10:00 PM

Share

సినీ పరిశ్రమకు ఏమైంది… గత కొంతకాలంగా స్టార్ నటీనటులు రకరకాల వ్యాధుల బారిన పడుతున్న సంగతి వెల్లడిస్తూ సినీ ప్రియులకు షాక్ ఇస్తున్నారు. తాజాగా దక్షిణాది స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి తన ఆరోగ్యం గురించి షాక్ న్యూస్ రివీల్ చేసింది. తాను కూడా అరుదైన వ్యాధితో తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు వెల్లడించింది. తెలుగు, తమిళ, సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనుష్క శెట్టి.. బాహుబలి సినిమా కంటే ముందే హిందీ ప్రేక్షకుల్లో కూడా సింగం వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా అనుష్క శెట్టి తన ఆరోగ్యం గురించి షాకింగ్ న్యూస్ వెల్లడించింది. తనకు అరుదైన వ్యాధి సోకిందని చెప్పింది. తాను నవ్వడం మొదలుపెడితే ఆపుకోలేనని.. అలా నవ్వుతూనే ఉంటానని ప్రకటించింది. ఇలా నవ్వుతూ మళ్లీ సాధారణ స్థితికి రావడానికి 15-20 నిమిషాలు పడుతుందని తెలిపింది.

లాఫింగ్ వ్యాధి బారిన పడిన అనుష్క

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్టార్ హీరోయిన్ అనుష్క పలు విషయాలను పంచుకుంటూ తనకు లాఫింగ్ వ్యాధి ఉందని తెలిపింది. నవ్వడం కూడా ఒక వ్యాధి అని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవచ్చు. అయితే ఎవరైనా ఒక నిమిషం లేదా రెండు నిముషాలు నవ్వుతారు. కానీ అనుష్క విషయంలో అలా జరగదు. ఆమె ఒక్కసారి నవ్వడం మొదలుపెడితే 15-20 నిమిషాల పాటు నవ్వు ఆపుకోవడం కష్టం. ఏదైనా కామెడీ సన్నివేశాన్ని చూస్తున్నప్పుడు లేదా షూట్ చేస్తున్నప్పుడు.. నవ్వుతూ అలా నేలపై పడుకుటుంది. దీంతో చాలా సార్లు షూటింగ్ కూడా ఆపేయాల్సి వచ్చిందని స్వీటీ స్వయంగా వెల్లడించింది.

ఈ అరుదైన వ్యాధి ఏమిటంటే?

అనుష్క సూడోబుల్బార్ ఎఫెక్ట్ అంటే PBA అనే వ్యాధి బారిన పడింది. ఇది అరుదైన నాడీ సంబంధిత రుగ్మత. ఈ వ్యాధి నేరుగా మెదడును ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాది సోకిన వ్యక్తి అదుపు లేకుండా నవ్వడం లేదా ఏడవడం చేస్తాడు. అనుష్క ఏ వ్యాధి బారిన పడిందో స్వయంగా ప్రకటించలేదు.. నవ్వుతూ ఏకంగా కొన్ని నిమిషాల పాటు ఉండిపోతా అని లక్షణాలు మాత్రమే చెప్పిప్పింది. దీనిని బట్టి స్వీటీ కూడా సూడోబుల్బార్ సమస్యను ఎదుర్కొంటున్నట్లు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అనుష్క చివరిసారి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం.. ఘటి, కథనార్ అనే సినిమాల్లో నటిస్తోంది అనుష్క.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఆలుగడ్డలు ఎక్కువ కాలం తాజా ఉండాలా? ఈ సులభమైన చిట్కాలు పాటించండి!
ఆలుగడ్డలు ఎక్కువ కాలం తాజా ఉండాలా? ఈ సులభమైన చిట్కాలు పాటించండి!
భార్యను స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త..!
భార్యను స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త..!
బిగ్ బాస్‌లో డబ్బులిచ్చారు కానీ నా జీవితంతో ఆడుకున్నారు
బిగ్ బాస్‌లో డబ్బులిచ్చారు కానీ నా జీవితంతో ఆడుకున్నారు
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!