AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వానలో తడవకుండా బైక్ మీద ఈ గొడుగుతో రయ్యి రయ్యిన ప్రయాణించవచ్చు.. చౌకగా ఎక్కడ దొరుకుతుందంటే

వాస్తవానికి బైక్ మీద ప్రయాణం ఎండ, వాన అనే తేడా లేకుండా ఇబ్బందులను కలిస్తుంది. అటువంటి సమయంలో బైక్ వద్దు కారు ముద్దు అనిపిస్తుంది. అయితే ఇక నుంచి ద్విచక్రవాహన దారులు అటువంటి ఇబ్బందులను ఎదుర్కోవలసిన అవసరం లేదు. ఎందుకంటే బైక్ లేదా స్కూటర్‌పై కారులాగా ఎండ, వానల నుంచి రక్షణ ఇచ్చే గొడుగు ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులోకి వచ్చింది. ఈ గొడుగును బైక్ కు ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

వానలో తడవకుండా బైక్ మీద ఈ గొడుగుతో రయ్యి రయ్యిన ప్రయాణించవచ్చు.. చౌకగా ఎక్కడ దొరుకుతుందంటే
Motor Scooter Umbrella
Surya Kala
|

Updated on: Jun 25, 2024 | 9:06 AM

Share

వరుణుడు కరునిస్తున్నాడు.. దీంతో భానుడి భగభగల నుంచి ఉపశమనం కొంతమేర లభిస్తోంది. ఎండ వేడి, ఉక్కబోత తగ్గి క్రమంగా వాతావరణం చల్లబడడం మొదలైంది. తెలుగు రాష్ట్రాలతో సహా పలు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ వానలు బైక్ మీద ప్రయాణించే వారికి తీవ్ర ఇబ్బందులను కలిగిస్తున్నాయి. వాస్తవానికి బైక్ మీద ప్రయాణం ఎండ, వాన అనే తేడా లేకుండా ఇబ్బందులను కలిస్తుంది. అటువంటి సమయంలో బైక్ వద్దు కారు ముద్దు అనిపిస్తుంది. అయితే ఇక నుంచి ద్విచక్రవాహన దారులు అటువంటి ఇబ్బందులను ఎదుర్కోవలసిన అవసరం లేదు. ఎందుకంటే బైక్ లేదా స్కూటర్‌పై కారులాగా ఎండ, వానల నుంచి రక్షణ ఇచ్చే గొడుగు ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులోకి వచ్చింది. ఈ గొడుగును బైక్ కు ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. దీంతో అకస్మాత్తుగా కురిసే వర్షం నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ఈ రోజు ఈ గొడుగుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం..

యూనివర్సల్ మోటార్ స్కూటర్ గొడుగు

మోటార్ సైకిల్ పై ప్రయాణించే ప్రయాణీకులకు ఎండ, వానల నుంచి రక్షణ కల్పించే విధంగా యూనివర్సల్ మోటార్ గొడుగు ప్రస్తుతం మార్కెట్ లో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది. ఈ గొడుగు ద్విచక్ర వాహనాన్ని అన్ని వైపుల నుండి కవర్ చేస్తుంది. అంతేకాదు బైక్ కు ఈజీగా సెట్ అవుతుంది కూడా.. ఈ గొడుగు ఎండ , వర్షపు వాతావరణం రెండింటికీ మంచిదని నిరూపింస్తోంది. కారులా అనిపించే ఈ గొడుగు ధర కూడా అందుబాటులో ఉంది. ఎవరైనా సరే ఈ గోడుగుని ఆన్‌లైన్‌లో చౌకగా పొందువచ్చు. అన్ని రకాల ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లో ఈ యూనివర్సల్ గొడుగు సులభంగా దొరుకుంతుంది. అయితే ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ నుంచి 37 శాతం తగ్గింపుతో కేవలం రూ. 24,691లకు కొనుగోలు చేయవచ్చు.

ఈ గొడుగు ముందు భాగంలో టోపీని అమర్చారు. ఇది ముందు నుంచి వచ్చే సూర్యకాంతి లేదా వర్షపు నీరు మిమ్మల్ని చేరకుండా రక్షణగా నిలుస్తుంది. అంతేకాదు వర్షంలో నీటి నుండి మిమ్మల్ని రక్షించడానికి వీలుగా బైక్ ను అన్ని వైపుల నుంచి కవర్ చేస్తూ బైక్ మీద వర్షంలో ప్రయాణిస్తున్న ప్రయాణీకులకు కారులో ప్రయాణిస్తున్న అనుభూతిని ఇస్తుంది.

ఇవి కూడా చదవండి

మురెన్ బైక్ షీల్డ్ గొడుగు

ద్విచక్రవాహన దారులకు ఎండం, వర్షం నుంచి తలను రక్షించే విధంగా ఏర్పాటు చేసిన గొడుగు మురెన్ బైక్ షీల్డ్ గొడుగు. ఇది బైక్ షీల్డ్ పైన పందిరి వలె అన్ని వైపులా కవర్ చేయదు. అయితే తలపై సూర్యకాంతి లేదా వాన నీరు పడకుండా రక్షణ కల్పిస్తుంది. దీనిని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ ఆన్ లైన్ ఈ కామర్స్ దిగ్గజ సంస్థలనుంచి అత్యంత చౌకగా అంటే రూ.1500 నుంచి 2 వేల వరకు వరకూ కొనుగోలు చేయవద్దు. ఈ మురెన్ బైక్ షీల్డ్ గొడుగులు రకరకాల ప్లాట్‌ఫారమ్‌ లో లభిస్తున్నాయి.

ఇవి మాత్రమే కాదు.. ఎలక్ట్రికల్ యుగంలో వచ్చిన మార్పుల్లో భాగంగా బైక్ మీద వానా కాలం కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా ప్రయాణించడానికి వర్షం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీ బైక్ కు సరిపోయే విధంగా రకరకాల గొడుగులు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల  కోసం క్లిక్ చేయండి..