ఈ రోజు సంకటహర చతుర్థి వ్రతం.. పిల్లల అభివృద్ధి కోసం గణపతికి పూజ శుభ సమయం, ఎప్పుడు ఉపవాసం విరమించాలంటే..
కృష్ణపింగళ సంకటహర చతుర్థి వ్రతం పిల్లల సంతోషం, శ్రేయస్సు, సంపదకు ప్రసిద్ధి చెందింది. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల కుటుంబంలో సౌభాగ్యం, సంతోషం పెరుగుతుంది. అంతేకాదు వ్యాపార అభివృద్ధి కారకంగా భావించి కృష్ణపింగళ చతుర్థి రోజున చేసే ఉపవాసం హిందూ మతంలో చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున భక్తి శ్రద్దలతో పూజ చేస్తారు. ఉపవాసం ఉంటారు. ఈ ఏడాది కృష్ణపింగళ సంకటహర చతుర్థి వ్రతం జూన్ 25న అంటే ఈ రోజు నిర్వహించనున్నారు.
సంకటహర చతుర్థికి హిందూ ధర్మంలో అత్యంత ప్రాముఖ్యత ఉంది. సంకటహర చతుర్థి రోజున విఘ్నాలకధిపతి వినాయకుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పుజిస్తారు. ఈ సంకటహర చతుర్థి పున్నమి వెళ్ళిన నాలగవ రోజున వస్తుంది. ఇక ఈ చతుర్థి తిధి మంగళవారం రోజున వస్తే అది అత్యంత విశిష్టత గల సంకటహర చతుర్థి గా పరిగనిస్తారు. ఈ రోజున అంగారకి సంకటహర చతుర్థి అని జేష్ఠమాసంలో వచ్చే చతుర్ధిని కృష్ణపింగళ సంకటహర చతుర్థి అని అంటారు. ఈ రోజున ఉపవాసం చేయడం ద్వారా గణేశుని ఆశీస్సులు, ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్మకం. ఈ రోజు గజాననుడు ఏకదంత గణేశుడు రూపాన్ని పూజిస్తారు. హిందూ మతంలో వినాయకుడిని అడ్డంకులు తొలగించేవాడుగా భావించి అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తారు. అందుకే ఈ రోజున గణపతిని పూజలు చేయడం, ఉపవాసం ఉండటం వల్ల భక్తులకు సంబంధించిన అన్ని రకాల ఆటంకాలు తొలగిపోతాయని విశ్వాసం.
కృష్ణపింగళ సంకటహర చతుర్థి వ్రతం పిల్లల సంతోషం, శ్రేయస్సు, సంపదకు ప్రసిద్ధి చెందింది. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల కుటుంబంలో సౌభాగ్యం, సంతోషం పెరుగుతుంది. అంతేకాదు వ్యాపార అభివృద్ధి కారకంగా భావించి కృష్ణపింగళ చతుర్థి రోజున చేసే ఉపవాసం హిందూ మతంలో చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున భక్తి శ్రద్దలతో పూజ చేస్తారు. ఉపవాసం ఉంటారు. ఈ ఏడాది కృష్ణపింగళ సంకటహర చతుర్థి వ్రతం జూన్ 25న అంటే ఈ రోజు నిర్వహించనున్నారు.
కృష్ణపింగళ సంకటహర చతుర్థి 2024 శుభ సమయం
జేష్ఠ మాసంలోని కృష్ణ పక్ష చతుర్థి తిథి జూన్ 25, 2024 ఉదయం 1:23 గంటలకు ప్రారంభమై రాత్రి 11:10 గంటలకు ముగుస్తుంది. ఈ రోజున ఉదయం 5.23 గంటల నుంచి 7.08 గంటల వరకు గణేశుడిని పూజించడానికి అనుకూలమైన సమయం. సాయంత్రం పూజకు అనుకూలమైన సమయం సాయంత్రం 5:36 నుంచి రాత్రి 8:36 వరకు ఉంటుంది.
వినాయకుడిని ఏ విధంగా పూజించాలంటే
ఉపవాసం చేయాలనుకునే వారు ఈ రోజు పొద్దున్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసి, స్నానం చేసి, ఆపై గణేశుడిని పూజించాలని తీర్మానం చేసుకోండి. అనంతరం గణేశుడి విగ్రహం లేదా చిత్రం ముందు కూర్చుని పూజించండి. దీపాలు, ధూపం, పండ్లు, పువ్వులు మొదలైన వాటిని పూజలో ఉపయోగించండి. ఉపవాసం రోజున వినాయకుని కథ విని, కీర్తనలు అలపించి, గణపతి మహిమను కీర్తించాలి. ఉపవాసం దీక్ష ముగింపు సమయంలో గణేశుడికి నైవేద్యంగా సమర్పించిన ఆహారాన్ని ప్రసాదంగా తినాలి.
మతపరమైన ప్రాముఖ్యత
కృష్ణపింగళ సంకటహర చతుర్థి ప్రాముఖ్యత హిందూ మతంలో విశిష్ట స్థానం ఉంది. మంగళవారం రోజున వచ్చిన సంకటహర చతుర్థి రోజున గణపతిని నియమానుసారం పూజించి చంద్ర దర్శనం తర్వాత రాత్రి ఉపవాసం విరమిస్తారు. ఇలా చేయడం వలన గణేశుడి ప్రత్యేక ఆశీర్వాదాలను పొందే అవకాశం అధికంగా ఉంటాయని నమ్మకం. ఈ రోజున విఘ్నాలు తొలగించే గణేశుడిని పూజించడం ద్వారా అన్ని రకాల ఆటంకాలు, కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలు లభిస్తాయని నమ్ముతారు. సంకటహర చతుర్థి నాడు ఉపవాసం పాటించడం ద్వారా వ్యక్తి మతపరమైన, ఆధ్యాత్మిక పురోగతిని పొందుతాడు. ఈ రోజు చేసే ఉపవాసం దీక్ష చేసిన వ్యక్తి తన మనస్సు, ఆత్మను శుద్ధి చేసుకునే అవకాశాన్ని పొందుతాడని నమ్మకం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.