Kitchen Hacks: ఈ వస్తువులను నీటిలో కలిపి నేలను శుభ్రం చేయండి.. ఇల్లంతా ఆహ్లాదకరమైన సువాసనే
ఇంట్లో సరైన సూర్యకాంతి పడక పోవడం, స్వచ్చమైన గాలి రాకపోవడం వలన లేదా వర్షాకాలంలో వచ్చే తేమ లేదా ఇంట్లో ఉండే పాత వస్తువుల కారణంగా వింత వాసన వస్తూ ఇంట్లో ఉన్నవారిని తీవ్ర ఇబ్బందికి గురి చేస్తుంది. అయితే ఇంట్లో ఉన్నవారు మానసికంగా ప్రశాంతంగా ఉండడంకోసం ఇంట్లో ఆహ్లాదకరమైన సువాసన వెదజల్లడం చాలా ముఖ్యం. కనుక ఇల్లు మంచి వాసన వచ్చేలా మాప్ వేస్తున్న సమయంలో నీటిలో కొన్ని రకాల పదార్థాలను జోడించవచ్చు. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..
ఇంట్లో పరిశుభ్రతకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తారు. ఎందుకంటే ఇల్లు శుభ్రంగా ఉంటే కంటికి ఇంపుగా ఉండడమే కాదు.. ఆరోగ్యంగా కూడా ఉంటారు. పరిశుభ్రంగా ఉన్న ఇల్లు చూడటం కూడా చాలా ఉపశమనం కలిగిస్తుంది.. అదే సమయంలో ఇంటి నుంచి తాజా సువాసన వస్తూ ఉంటే ఒత్తిడి, అలసట కూడా మాయమవుతాయి. అందుకనే ఎక్కువ మంది తమ ఇల్లు సువాసన వెదజల్లడం కోసం తరచుగా రూమ్ ఫ్రెషనర్‌లను ఉపయోగిస్తున్నారు. అయితే మార్కెట్‌లో లభించే అనేక రూమ్ ఫ్రెషనర్‌లలో ఉపయోగించే రసాయనాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. కొన్ని సార్లు అలెర్జీలకు కూడా కారణమవుతున్నాయి. అయితే ఇలాంటి రసాయన రూమ్ ఫ్రెష్ నర్స్ కు బదులుగా ఇంటిని తుడుచుకునేటప్పుడు నీటిలో కొన్ని సహజమైన వస్తువులను మిక్స్ చేస్తే.. శుభ్రం చేసిన తర్వాత ఇల్లు ఆహ్లాదకరమైన సువాసనను కలిగి ఉంటుంది. ఉపశమనం ఇస్తుంది.
ఇంట్లో సరైన సూర్యకాంతి పడక పోవడం, స్వచ్చమైన గాలి రాకపోవడం వలన లేదా వర్షాకాలంలో వచ్చే తేమ లేదా ఇంట్లో ఉండే పాత వస్తువుల కారణంగా వింత వాసన వస్తూ ఇంట్లో ఉన్నవారిని తీవ్ర ఇబ్బందికి గురి చేస్తుంది. అయితే ఇంట్లో ఉన్నవారు మానసికంగా ప్రశాంతంగా ఉండడంకోసం ఇంట్లో ఆహ్లాదకరమైన సువాసన వెదజల్లడం చాలా ముఖ్యం. కనుక ఇల్లు మంచి వాసన వచ్చేలా మాప్ వేస్తున్న సమయంలో నీటిలో కొన్ని రకాల పదార్థాలను జోడించవచ్చు. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..
- నిమ్మ తొక్కలు: నిమ్మకాయ నుంచి వాసన తాజా దనాన్ని ఇస్తుంది. రిఫ్రెష్ అనుభూతిని ఇస్తుంది. ఇంటిని తుడుచుకోవడానికి ఉపయోగించే నీటిలో నిమ్మ తొక్కలను వేసి ఆ నీటిని మరిగించాలి. అనంతరం ఈ నీటిలో ఇంటిని తుడుచుకుంటే నేలమీద ఉండే మురికి పోతుంది. సూక్ష్మక్రిములు నాశనం అవుతాయి. ఇల్లు శుభ్రపడి తాజా సువాసనతో ఆహ్లాదకరంగా అన్పిస్తుంది.
- ఎసెన్షియల్ ఆయిల్స్: ఇంటిని శుభ్రం చేయడానికి తీసుకున్న నీటిలో కొన్ని రకాల ఎసెన్షియల్ ఆయిల్స్ ను కూడా జోడించడం వలన మంచి ఫలితం ఉంటుంది. నీటిలో కొన్ని చుక్కల నిమ్మ, లావెండర్, గులాబీ, చందనం మొదలైన సువాసనలతో కూడిన ఎసెన్షియల్ ఆయిల్స్ ను కలిపి తుడవం వలన మనసు రిలాక్స్‌గా అనిపిస్తుంది. పరిమళం ఆహ్లాదకరంగా ఉంటుంది.
- బేకింగ్ సోడా: ఎక్కువ మంది వంట గదుల్లో లభించే బేకింగ్ సోడా కూడా బెస్ట్ ఆప్షన్. వంటగదిలో సులభంగా దొరికే బేకింగ్ సోడాను వివిధ రకాల ఆహార వస్తువుల తయారీతో పాటు ఇల్లు సువాసన వెదజల్లడం కోసం కూడా ఉపయోగించవచ్చు. నిజానికి బేకింగ్ సోడా నీటిలో కలిపి ఇంటిని శుభ్రం చేయడం వలన నేలమీద మచ్చలు, మరకలు పోయి శుభ్రంగా తళతళలాడుతూ కనిపిస్తుంది. ఇంట్లో తుడుచుకున్న తర్వాత మీరు తాజాదనాన్ని అనుభవిస్తారు.
- సుగంధ ద్రవ్యాలు: లవంగాలు, దాల్చినచెక్క వంటి ఆహ్లాదకరమైన సువాసనను ఇచ్చే సుగంధ ద్రవ్యాలు కూడా ఇంటిని శుభ్రం చేస్తాయి. దాల్చిన చెక్క, కొన్ని లవంగాలను నీటిలో వేసి మరిగించాలి. ఈ నీటితో ఇంటిని తుడుచుకోవాలి. మీకు కావాలంటే ఈ నీటిని స్ప్రే బాటిల్‌లో నింపి ఫ్రెష్‌నర్‌గా కూడా ఉపయోగించవచ్చు. ఈ నీటితో తడుపడం వల్ల ఈగలు, ఇతర కీటకాలు రాకుండా నిరోధింపబడతాయి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)