AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: వార్నీ ఇదేం స్టంట్‌ బ్రో.. రీల్స్ కోసం రిస్క్‌ చేసి ట్రాక్టర్ వీల్ మధ్యలో..!

15 సెకన్ల పాటు అలానే టైరు మధ్యలో తిరుగుతూ ఉన్నాడు.. ట్రాక్టర్ నడిపే వ్యక్తి కాస్త వేగంగా డ్రైవ్ చేసిన కిందపడిపోయేవాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ సమయంలో చేయి ప్రమాదవశాత్తూ జారిపోయి ఉంటే టైరు కింద పడిపోతే ప్రాణాలు పోయేవి. కానీ అతను ఈ విషయాన్ని పట్టించుకోలేదు.

Watch: వార్నీ ఇదేం స్టంట్‌ బ్రో.. రీల్స్ కోసం రిస్క్‌ చేసి ట్రాక్టర్ వీల్ మధ్యలో..!
A man holds a running tractor tire
Jyothi Gadda
|

Updated on: Jun 25, 2024 | 9:08 AM

Share

Viral Video: ఈ రోజుల్లో రీల్స్‌ పిచ్చి ప్రజల్లో బాగా ముదిరింది. అందుబాటులోకి వచ్చిన విచ్చలవిడి ఇంటర్‌నెట్‌ వినియోగంతో చాలా మంది ప్రజలు రీల్ ఫీవర్‌తో సతమతమవుతున్నారు. ప్రతి వ్యక్తి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో రీల్ చేసి ఫేమస్ అవ్వాలని తాపత్రయపడుతున్నారు. తన వీడియోపై వీలైనన్ని ఎక్కువ లైక్‌లు వ్యూస్ రావాలని నానా అవస్థలు పడుతున్నారు. దీని కోసం వారు తమ జీవితాలను కూడా పణంగా పెడుతున్నారు. కేవలం రీల్ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టే ఇలాంటి అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంతకు ముందే ఇద్దరు స్కూల్‌ విద్యార్థులు నడిరోడ్డుపై చేసిన స్టంట్‌ వారిలో ఒక విద్యార్థిని ఎలా ప్రమాదంలో పడేసిందే చూశాం. ఆ వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లతో తీవ్ర విమర్శలకు గురైంది. ఆ తర్వాత ఇప్పుడు కొత్త వీడియో వైరల్ అవుతోంది.

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఈ వీడియో చూస్తే మీరు ఖచ్చితంగా సీరియస్‌ అవుతారు. వీడియోలో వ్యక్తి చేసిన స్టంట్‌ చూస్తే మీ క‌ళ్ల‌ను మీరే న‌మ్మ‌లేరు.. రీల్‌ కోసం దైనికైనా రెడీ అన్నట్టుగా చేశాడు.. వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి ట్రాక్టర్ టైర్‌లో దూరి కూర్చుని ఉన్నాడు. ఆ తర్వాత మరో వ్యక్తి ఆ ట్రాక్టర్ నడపడం ప్రారంభించాడు.. టైర్‌లో ఉన్న ఆ వ్యక్తి సర్కిల్‌లలో కదలుతూ ఉన్నాడు. 15 సెకన్ల పాటు అలానే టైరు మధ్యలో తిరుగుతూ ఉన్నాడు.. ట్రాక్టర్ నడిపే వ్యక్తి కాస్త వేగంగా డ్రైవ్ చేసిన కిందపడిపోయేవాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ సమయంలో చేయి ప్రమాదవశాత్తూ జారిపోయి ఉంటే టైరు కింద పడిపోతే ప్రాణాలు పోయేవి. కానీ అతను ఈ విషయాన్ని పట్టించుకోలేదు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ X లో @PalsSkit అనే ఖాతాతో నుంచి అప్‌లోడ్ అయింది. ఈ వీడియోను ఇప్పటికే 1400 మంది చూశారు. 68 మంది కామెంట్లు చేశారు. నెటిజన్లు దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నారు. మన దేశంలో ఇటువంటి వారికి కొదవలేదని అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..