Tollywood: టాలీవుడ్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. కుర్రాళ్ల ఫేవరెట్ బ్యూటీ.. ఎవరో గుర్తించారా..?
ఇప్పటికీ ఈ ముద్దుగుమ్మ కుర్రాళ్ల ఫేవరేట్ హీరోయిన్. అప్పట్లో చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ తార.. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది. ఈ బ్యూటీ పెళ్లి విషయం ఇప్పటికీ అభిమానులకు క్లారిటీ లేదు. కానీ ప్రస్తుతం తన బాబును చూసుకుంటూ మాతృత్వాన్ని ఆస్వాదిస్తుంది. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా.. ?

సోషల్ మీడియాలో స్టార్స్ చిన్ననాటి ఫోటోస్ ఏ రేంజ్లో ట్రెండ్ అవుతుంటాయో తెలిసిందే. ఇటీవల చాలా రోజులుగా టాలీవుడ్ సినీ తారల చైల్డ్ హుడ్ ఫోటోస్ తెగ చక్కర్లు కొడుతున్నాయి. అందులోనే ఓ క్యూట్ చిన్నారి ఫోటో ఆకట్టుకుటుంది. పైన ఫోటోను చూశారు కదా. అందులో కనిపిస్తున్న ఆ బూరె బుగ్గల బుజ్జాయి ఎవరో తెలుసా..?. ఒకప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్. తెలుగు, తమిళం, హిందీలో అనేక సినిమాల్లో నటించి స్టార్ డమ్ అందుకుంది. ఇప్పటికీ ఈ ముద్దుగుమ్మ కుర్రాళ్ల ఫేవరేట్ హీరోయిన్. అప్పట్లో చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ తార.. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది. ఈ బ్యూటీ పెళ్లి విషయం ఇప్పటికీ అభిమానులకు క్లారిటీ లేదు. కానీ ప్రస్తుతం తన బాబును చూసుకుంటూ మాతృత్వాన్ని ఆస్వాదిస్తుంది. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా.. ? తనే హీరోయిన్ ఇలియానా.
ముంబాయిలో జన్మించిన ఇలియానా.. సినిమాల్లోకి రాకముందు మొదట్లో మోడలింగ్ చేసింది. ఆ సమయంలో పలు వ్యాపార ప్రకటనలలో నటించింది. 2006లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన దేవదాసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఇలియానా.. అదే ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు, పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన పోకిరి సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది. ఈ రెండు చిత్రాలతో తెలుగు ఇండస్ట్రీలో ఇలియానా క్రేజ్ మారిపోయింది. దీంతో టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ అందుకుంటూ బిజీగా గడిపింది. రాఖీ, మున్నా, ఆట, జల్సా, కిక్, రెచ్చిపో వంటి చిత్రాలతో ఆకట్టుంది.
తమిళంలో విజయ్ దళపతి నటించిన నన్బన్ చిత్రంలో నటించింది. ఈ సినిమాను తెలుగులో స్నేహితుడు పేరుతో రిలీజ్ చేశారు. ఈ సినిమాతో అటు కోలీవుడ్ ఇండస్ట్రీలోనూ ఫేమస్ అయ్యింది. తెలుగు, హిందీ, తమిళంలో వరుస సినిమాలు చేస్తూ ఆకస్మాత్తుగా చిత్రాలకు దూరమయ్యింది. చాలా కాలం పాటు సైలెంట్ గా ఉన్న ఈ అమ్మడు.. సడెన్ గా ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేసింది. గతేడాది పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.కొన్ని నెలల క్రితమే తన భర్తను అభిమానులకు పరిచయం చేసింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన కొడుకు ఫోటోస్ షేర్ చేస్తుంది ఇలియానా.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




