ఈ ఫొటోలోని బుడ్డోడు ఇప్పుడు మల్టీ ట్యాలెంటెడ్ యాక్టర్.. హీరో, విలనిజం, యాంకరింగ్ ఏదైనా అదరగొడతాడంతే?

హీరో, సైడ్ రోల్స్, విలనిజం.. ఇంకా టీవీ షోల్లో హోస్టింగ్, యాంకరింగ్.. ఇలా ఏ రోల్ అయినా పర్‌ఫెక్ట్‌ గా చేస్తాడంతే. తెలుగులో పాత్రకు తగ్గట్టుగా నటించే అతి కొద్ది మంది నటుల్లో ఇతను కూడా ఒకరు. అయితే దురదృష్టమో మరే కారణమో తెలియదు కానీ.. ఈ యాక్టర్ తరచూ వివాదాల్లో ఇరుక్కుంటుంటాడు. ముఖ్యంగా

ఈ ఫొటోలోని బుడ్డోడు ఇప్పుడు మల్టీ ట్యాలెంటెడ్ యాక్టర్.. హీరో, విలనిజం, యాంకరింగ్ ఏదైనా అదరగొడతాడంతే?
Tollywood Actor
Follow us
Basha Shek

|

Updated on: Jun 04, 2024 | 3:38 PM

ఈ ఫొటోలో అమాయకంగా కనిపిస్తోన్న బుడ్డోడిని గుర్తు పట్టారా? ఇప్పుడతను టాలీవుడ్ లో ట్యాలెంటెడ్ యాక్టర్. అంటే హీరో, సైడ్ రోల్స్, విలనిజం.. ఇంకా టీవీ షోల్లో హోస్టింగ్, యాంకరింగ్.. ఇలా ఏ రోల్ అయినా పర్‌ఫెక్ట్‌ గా చేస్తాడంతే. తెలుగులో పాత్రకు తగ్గట్టుగా నటించే అతి కొద్ది మంది నటుల్లో ఇతను కూడా ఒకరు. అయితే దురదృష్టమో మరే కారణమో తెలియదు కానీ.. ఈ యాక్టర్ తరచూ వివాదాల్లో ఇరుక్కుంటుంటాడు. ముఖ్యంగా డ్రగ్స్ కు సంబంధించిన కేసుల్లో తరచూ ఇతని పేరు వినిపిస్తోంది. దీంతో ఎప్పటికప్పుడు తన మిస్టర్ క్లీన్ అని నిరూపించుకోవాల్సి వస్తోంది. మరి ఈ బుడ్డోడు ఎవరో గుర్తు పట్టారా? కొంచెం కష్టంగా ఉందా? అయితే ఇతను చాలా రోజుల తర్వాత హీరోగా మన ముందుకు వస్తున్నాడు. అది కూడా ఓ ఫుల్ లెంగ్త్ రొమాంటిక్ మూవీతో. ఇప్పటికే ఈ సినిమాలోని కిస్సింగ్ సీన్ల నంబర్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. యస్. అతను మరెవరో కాదు త్వరలోనే ‘లవ్ మౌళి’గా మన ముందుకు రానున్న హ్యాండ్సమ్ యాక్టర్ నవదీప్. ఇందులో నవవదీప్ 2.0 ను చూస్తారని అంటున్నాడీ ట్యాలెంటెడ్ హీరో.

కిస్సింగ్ సీన్లపై నెట్టింట రచ్చ..

అవనీంద్ర దర్శకత్వంలో నవదీప్ హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ లవ్ మౌళి. పంఖురి గిద్వానీ, భావన సాగి ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 7 గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజిబిజీగా ఉంటోందీ చిత్ర బృందం. అయితే లవ్ మౌళి చిత్రంలో లిప్‍లాక్ సీన్ల విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‍గా మారింది. ఈ సినిమాలో ఏకంగా 43 ముద్దు సీన్లు ఉంటాయని నెట్టంట న్యూస్ చక్కర్లు కొడుతోంది. దీనికి తగ్గట్టుగానే ట్రైలర్ మొత్తం రొమాంటిక్ సీన్స్ తో నింపేశారు. దీతో ఈ మూవీకి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ ఇచ్చింది

ఇవి కూడా చదవండి

లవ్ మౌళిగా మన ముందుకు వస్తోన్న హీరో నవదీప్..

View this post on Instagram

A post shared by Nav Deep 2.0 (@pnavdeep)

లవ్ మౌళి ప్రమోషన్లలో బిజిబీజీగా నవ్ దీప్..

View this post on Instagram

A post shared by Nav Deep 2.0 (@pnavdeep)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..
కరీనా కపూర్‌పై పాక్ నటుడి కామెంట్స్.. అభిమానుల ఆగ్రహం
కరీనా కపూర్‌పై పాక్ నటుడి కామెంట్స్.. అభిమానుల ఆగ్రహం
అంబానీ కూతురా.. మజాకా..! రంగులు మార్చే ఈ కారు ధర తెలిస్తే షాక్..
అంబానీ కూతురా.. మజాకా..! రంగులు మార్చే ఈ కారు ధర తెలిస్తే షాక్..