- Telugu News Photo Gallery Cinema photos Telugu Indian Idol 3 Auditions In USA, Mrunal Thakur Lehanga Photos Viral
Tollywood News: యూఎస్‌లో ‘తెలుగు ఇండియన్ ఐడల్ 3’.. ముత్యాల లెహంగాలో మృణాల్..
ర్యాంప్ వాక్ చేయడం తనకు చాలా ఇష్టమని అన్నారు మృణాల్ ఠాకూర్. ఎంత బిజీగా ఉన్నా, ర్యాంప్ వాక్ చేసే అవకాశం వస్తే వదులుకోనని చెప్పారు. రీసెంట్‌గా తాను ర్యాంప్ వాక్ కోసం ధరించిన ఎరుపు రంగు లెహంగా కోసం 1400 గంటలు వర్కర్లు కష్టపడ్డారని అన్నారు. ముత్యాలు పొదిగిన డ్రెస్ ధరించడం ఆనందంగా అనిపించిందని అన్నారు. రజనీకాంత్‌గారితో కలిసి నటించాలని ఎప్పటి నుంచో అనుకునేవాడినని అన్నారు హీరో రానా.
Updated on: Jun 05, 2024 | 8:39 PM

Mrunal Thakur: ర్యాంప్ వాక్ చేయడం తనకు చాలా ఇష్టమని అన్నారు మృణాల్ ఠాకూర్. ఎంత బిజీగా ఉన్నా, ర్యాంప్ వాక్ చేసే అవకాశం వస్తే వదులుకోనని చెప్పారు. రీసెంట్‌గా తాను ర్యాంప్ వాక్ కోసం ధరించిన ఎరుపు రంగు లెహంగా కోసం 1400 గంటలు వర్కర్లు కష్టపడ్డారని అన్నారు. ముత్యాలు పొదిగిన డ్రెస్ ధరించడం ఆనందంగా అనిపించిందని అన్నారు.

Rana: రజనీకాంత్‌గారితో కలిసి నటించాలని ఎప్పటి నుంచో అనుకునేవాడినని అన్నారు హీరో రానా. ఆ కల ఇప్పుడు నెరవేరిందని చెప్పారు. డైరక్టర్ కథ చెప్పగానే విని ఇంప్రెస్ అయినట్టు తెలిపారు. జ్యుడిషియల్, పోలీస్ వ్యవస్థ తదితర అంశాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని చెప్పారు. ఎంతో రీసెర్చి చేసి ఈ కథను రాశారని ప్రశంసించారు.

Shah Rukh Khan: గతేడాది వరుస సినిమాలతో మెప్పించారు కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్. ఈ ఏడాది ఇప్పటిదాకా ఏ ప్రాజెక్టూ మొదలుపెట్టలేదు. జూన్ నుంచి తన తదుపరి సినిమాను ప్రారంభిస్తానని అన్నారు షారుఖ్. గతేడాది బ్యాక్ టు బ్యాక్ మూడు ప్రాజెక్టులతో తన శరీరాన్ని కష్టపెట్టానని అన్నారు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నట్టు తెలిపారు.

Aha: ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ 3 కోసం మెగా ఆడిషన్స్ తొలిసారి యుఎస్ఎలో జరుగుతున్నాయి. మే4న న్యూజెర్సీలోని టీవీ9 యుఎస్ఎ స్టూడియోస్‌లో జరిగాయి. మే 11న డల్లాస్‌లోని కాకతీయ లాంజ్, యుఎస్ఎ టెక్సాస్ విల్, లూయిస్ విల్లేలో జరుగనున్నాయి. న్యూ యార్క్ టైమ్ స్క్వేర్‌లో ఇండియన్ ఐడల్ సీజన్ 3 ప్రోమో ఆకట్టుకుంది. మే 5న హైదరాబాద్‌లో మెగా ఆడిషన్స్ ప్రారంభం కానున్నాయి.

Mamitha Baiju: ప్రేమలు సినిమాతో తెలుగు కుర్రకారును ఆకట్టుకున్న నటి మమిత. ఆమెకు తల్లిదండ్రులు నమిత అని పేరు పెట్టారట. అయితే ఆసుపత్రి సిబ్బంది మమిత అని నమోదు చేశారట. స్కూల్లో చేరే సమయంలో ఆ విషయాన్ని గుర్తించారట. అయినా పేరు వైవిధ్యంగానే ఉందని అలాగే కంటిన్యూ చేశారట. మమిత అంటే మిఠాయి అని చెప్పారు ఈ బ్యూటీ.




