- Telugu News Photo Gallery Cinema photos Prabhas Kalki Movie Craze In Bollywood, Ram Charan Game Changer Flash Back Episode
బాలీవుడ్‌లో ‘కల్కి’ క్రేజ్.. ‘గేమ్ చేంజర్’ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్
ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ 3 కోసం మెగా ఆడిషన్స్ తొలిసారి యుఎస్ఎలో జరుగుతున్నాయి. మే4న న్యూజెర్సీలోని టీవీ9 యుఎస్ఎ స్టూడియోస్‌లో జరిగాయి. మే 11న డల్లాస్‌లోని కాకతీయ లాంజ్, యుఎస్ఎ టెక్సాస్ విల్, లూయిస్ విల్లేలో జరుగనున్నాయి. న్యూ యార్క్ టైమ్ స్క్వేర్‌లో ఇండియన్ ఐడల్ సీజన్ 3 ప్రోమో ఆకట్టుకుంది. మే 5న హైదరాబాద్‌లో మెగా ఆడిషన్స్ ప్రారంభం కానున్నాయి. గుంటూరు కారం, హనుమాన్, టిల్లు స్క్వేర్ సినిమాల తర్వాత ఈ ఏడాది మరింత క్రేజ్ తెచ్చుకున్న సినిమాగా కల్కి పేరు నమోదవుతోంది.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Anil kumar poka
Updated on: Jun 05, 2024 | 9:09 PM

Aha: ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ 3 కోసం మెగా ఆడిషన్స్ తొలిసారి యుఎస్ఎలో జరుగుతున్నాయి. మే4న న్యూజెర్సీలోని టీవీ9 యుఎస్ఎ స్టూడియోస్‌లో జరిగాయి. మే 11న డల్లాస్‌లోని కాకతీయ లాంజ్, యుఎస్ఎ టెక్సాస్ విల్, లూయిస్ విల్లేలో జరుగనున్నాయి. న్యూ యార్క్ టైమ్ స్క్వేర్‌లో ఇండియన్ ఐడల్ సీజన్ 3 ప్రోమో ఆకట్టుకుంది. మే 5న హైదరాబాద్‌లో మెగా ఆడిషన్స్ ప్రారంభం కానున్నాయి.

Kalki: గుంటూరు కారం, హనుమాన్, టిల్లు స్క్వేర్ సినిమాల తర్వాత ఈ ఏడాది మరింత క్రేజ్ తెచ్చుకున్న సినిమాగా కల్కి పేరు నమోదవుతోంది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో అమితాబ్, దీపిక, దిశా పాట్ని కీలక పాత్రల్లో నటించారు. జూన్ 27న విడుదల కానుంది కల్కి 2898ఏడీ.

Game changer: రామ్‌చరణ్, కియారా అద్వానీ జంటగా నటించిన సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమా నయా షెడ్యూల్ రాజమండ్రిలో ప్రారంభమవుతోంది. సినిమాలోని కీలక తారాగణం అంతా ఈ షెడ్యూల్‌లో పాల్గొననున్నారు. కథ ప్రకారం ఈ షెడ్యూల్ చాలా కీలకమట. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌ని చిత్రీకరిస్తున్నట్టు టాక్.

Devara: తారక్ హీరోగా నటిస్తున్న సినిమా దేవర. ఈ సినిమా అక్టోబర్‌లో విడుదల కానుంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా మ్యూజిక్ మీద మంచి హైప్ ఉంది. తారక్ పుట్టినరోజున ఫస్ట్ సాంగ్‌ని విడుదల చేస్తారన్నది టాక్.

Kareena Kapoor Khan: చిన్న పిల్లలు తమ తల్లి చేసే ఉద్యోగం గురించి కూడా మాట్లాడుతారని అన్నారు కరీనాకపూర్. పిల్లలకు హాలీడేస్ ఉన్నప్పుడు తను పని మీద వెళ్తే... 'ఎప్పుడూ పనీ పనీ అంటావు. నాకు నీతో ఉండాలని ఉంది' అని అంటారట. తైమూర్ అలా అన్న ప్రతి సారీ మనసు చివుక్కుమంటుందని అన్నారు కరీనా.





























