- Telugu News Photo Gallery Cinema photos Actress Kajal Aggarwal Shares Yellow Colour Saree Photos, Fans Says Santoor Mummy
Kajal Aggarwal: ‘సంతూర్ మమ్మీ’లా మారిపోయిన కాజల్ అగర్వాల్.. చీర కట్టులో ఎంత అందంగా ఉందో చూశారా?
సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘకాలం పాటు హీరోయిన్ గా కెరీర్ కొనసాగిస్తోన్న వారిలో కాజల్ అగర్వాల్ ఒకరు. లక్ష్మీ కల్యాణం సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన ఈ చందమామా గత పుష్కరకాలంగా సినిమాలు చేస్తూనే ఉంది.
Updated on: Jun 04, 2024 | 2:51 PM

సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘకాలం పాటు హీరోయిన్ గా కెరీర్ కొనసాగిస్తోన్న వారిలో కాజల్ అగర్వాల్ ఒకరు. లక్ష్మీ కల్యాణం సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన ఈ చందమామా గత పుష్కరకాలంగా సినిమాలు చేస్తూనే ఉంది.

ఆ మధ్యన పెళ్లి, పిల్లోడు అంటూ కాస్త గ్యాప్ ఇచ్చినప్పటకీ ఇప్పుడు జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తోంది. డెలివరీ అయిన రెండు నెలలకే షూటింగ్ కు హాజరైందీ అందాల తార.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఇండియన్ 2 లాంటి క్రేజీ భారీ ప్రాజెక్టు ఉంది. శంకర్ తెరకెక్కించిన ఈ భారతీయుడు సీక్వెల్ లో కమల్ హాసన్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు నటిస్తున్నారు.

ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే కాజల్ నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీ కూడా త్వరలోనే రిలీజ్ కానుంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది కాజల్ అగర్వాల్. తన లేటెస్ట్ ఫొటోస్, వీడియోలను అందులో షేర్ చేస్తుంటుంది.

అలా తాజాగా యెల్లో కలర్ శారీలో కనిపించింది కాజల్ అగర్వాల్ . ఈ ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. సంతూర్ మమ్మీలా ఉందంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.




