- Telugu News Photo Gallery Cinema photos IS Heroine Janhvi Kapoor Doing Special Song In Allu Arjun's Pushpa 2 Movie
Janhvi Kapoor: ఏంటి అమ్మడు.. సౌత్ పై కన్నేసావా.! మూడో హీరోతో జాన్వీ పాప.
అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది.. ఆ ఒక్కదానికి తప్ప అన్నట్లు మారిపోయిందిప్పుడు పుష్ప 2 స్పెషల్ సాంగ్ పరిస్థితి. ఇకపై ఈ కన్ఫ్యూజన్‌తో పనిలేదు. ఎందుకంటే ఆ పాటలో బన్నీతో చిందేయడానికి ఓ భామ ఫైనల్ అయిపోయింది కాబట్టి. మరి సమంతను మరిపించే సత్తా ఉన్న ఆ సుందరి ఎవరు..? పుష్ప 2లో స్పెషల్ ఛాన్స్ ఎవరికి దక్కింది.? పాటొచ్చి మూడేళ్ళైనా ఇంకా ఆ మత్తు వదలట్లేదు.
Updated on: Jun 17, 2024 | 3:39 PM

ఎక్స్ పోస్టింగ్ విషయం జాన్వీ దృష్టికి వెళ్లటంతో ఆమె టీమ్ క్లారిటీ ఇచ్చింది. అసలు జాన్వీ కపూర్‌కు ఎక్స్‌లో అకౌంటే లేదని చెప్పింది ఆమె సోషల్ మీడియా టీమ్. జాన్వీ కేవలంలో ఇన్‌స్టాలో మాత్రమే ఉన్నారని, ఫేక్ అకౌంట్స్ విషయంలో మోసపోవద్దని కోరారు.

ఎందుకంటే ఆ పాటలో బన్నీతో చిందేయడానికి ఓ భామ ఫైనల్ అయిపోయింది కాబట్టి. మరి సమంతను మరిపించే సత్తా ఉన్న ఆ సుందరి ఎవరు..? పుష్ప 2లో స్పెషల్ ఛాన్స్ ఎవరికి దక్కింది.? పాటొచ్చి మూడేళ్ళైనా ఇంకా ఆ మత్తు వదలట్లేదు.

పుష్పలో అన్ని పాటలు ఒకెత్తు అయితే.. కేవలం సమంత సాంగ్ మరో ఎత్తు. ఊ అంటావా మావా అంటూ ఈమె చేసిన రచ్చకు ఇండియా షేక్ అయిపోయింది. ఇలాంటి పాట పుష్ప 2లోనూ ప్లాన్ చేస్తున్నారు సుకుమార్.

అందుకే సమంతను మరిపించే బ్యూటీ కోసం చూస్తున్నారు. దీనికోసం చాలా రోజులుగా వేట సాగుతుంది. ఓ సారి ఊర్వశి రౌతెలా అన్నారు.. మరోసారి యానిమల్ ఫేమ్ త్రిప్తి దిమ్రి అన్నారు.. ఇంకోసారి దీపిక పదుకొనే అన్నారు..

కానీ ఈ ఛాన్స్ ఎవరికి వస్తుందో మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ లేదు. కానీ పుష్ప 2 స్పెషల్ సాంగ్ ఎవరు చేస్తున్నారో కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఆ లక్కీ ఛాన్స్ అటు తిరిగి ఇటు తిరిగి జాన్వీ కపూర్ చెంత చేరింది.

త్వరలోనే దీనిపై అధికారిక సమాచారం రానుంది. జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ కంటే టాలీవుడ్‌పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. దేవరతో పాటు రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాలోనూ ఈమె హీరోయిన్‌గా నటిస్తున్నారు.

వీటితో పాటు ఇప్పుడు పుష్ప 2 స్పెషల్ ఛాన్స్ ఈ భామకే దక్కింది. జూన్ మొదటి వారంలోనే అల్లు అర్జున్, జాన్వీపై స్పెషల్ సాంగ్ చిత్రీకరణ జరగనుందని తెలుస్తుంది.





























