Miral OTT: ఓటీటీలోకి మరో ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.. ‘మిరల్’ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

ఓటీటీలోకి క్రైమ్, సస్పెన్స్, హారర్, థ్రిల్లర్ సినిమాలకుమంచి ఆదరణ దక్కుతోంది. థియేటర్లలో కలెక్షన్లు రాకపోయినా డిజిటల్ స్ట్రీమింగ్ లో మాత్రం రికార్డు వ్యూస్ సొంతం చేసుకుంటాయి. అందుకే ఆయా భాషలకు తగ్గట్టుగా డబ్బింగ్ చేసి మరీ ఓటీటీలోకి తమ సినిమాలను రిలీజ్ చేస్తుంటారు. అలా తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన ఒక ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఒకటి ఓటీటీలోకి వచ్చేస్తోంది.

Miral OTT: ఓటీటీలోకి మరో ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.. 'మిరల్' స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Miral Movie
Follow us
Basha Shek

|

Updated on: Jun 05, 2024 | 12:57 PM

ఓటీటీలోకి క్రైమ్, సస్పెన్స్, హారర్, థ్రిల్లర్ సినిమాలకుమంచి ఆదరణ దక్కుతోంది. థియేటర్లలో కలెక్షన్లు రాకపోయినా డిజిటల్ స్ట్రీమింగ్ లో మాత్రం రికార్డు వ్యూస్ సొంతం చేసుకుంటాయి. అందుకే ఆయా భాషలకు తగ్గట్టుగా డబ్బింగ్ చేసి మరీ ఓటీటీలోకి తమ సినిమాలను రిలీజ్ చేస్తుంటారు. అలా తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన ఒక ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఒకటి ఓటీటీలోకి వచ్చేస్తోంది. అదే ప్రేమిస్తే ఫేం భరత్ నటించిన మిరల్. నిజానికి ఈ మూవీ నవంబర్, 2022లోనే తమిళంలో రిలీజైంది. యావరేజ్ గా నిలిచింది. కానీ అప్పుడు తెలుగు వెర్షన్ ఎక్కడా రిలీజ్ కాలేదు.  సుమారు రెండున్నరేళ్ల తర్వాత అంటే మే 17న  మిరల్ తెలుగు వెర్షన్ థియేటర్లలో రిలీజైంది. అయితే ఎలక్షన్లు, ఐపీఎల్ ఫీవర్ ఉండడంతో ఈ సినిమా ఎంత వేగంగా థియేటర్లలోకి వచ్చిందో అంతే వేగంగా వెళ్లిపోయింది.  ఇప్పుడీ సస్పెన్స్  థ్రిల్లర్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మిరల్ తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే మిరల్ తమిళ్ వెర్షన్ ఇప్పటికే ఆహా తమిళ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కాబట్టి తెలుగు వెర్షన్ కూడా ఆహా ఓటీటీలోనే రానుందని సమాచారం.

ఇప్పటికే ఆహా తమిళ్ లో ఒరిజెనల్ వెర్షన్ స్ట్రీమింగ్..

జూన్ 7 నుంచి ఆహాలో మిరల్ మూవీ స్ట్రీమింగ్ కానుందని సమాచారం. అంటే తెలుగు వెర్షన్ థియేటర్లలో రిలీజైన మూడు వారాలకే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోందన్న మాట. అయితే ఇది అఫీషియల్ డేట్ కాదు.. కాని ఇదే తేదీ కన్ఫర్మ్ అని నెట్టింట టాక్ నడుస్తోంది. ఎం శక్తివేల్ తెరకెక్కించిన మిరల్ సినిమాలో వాణీ భోజన్ కథానాయికగా నటించింది. డైరెక్టర్ కే.ఎస్. రవి కుమార్, మీరా కృష్ణన్, రాజ్ కుమార్, కావ్య అరివుమణి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై జి. ఢిల్లీ బాబు మిరల్ సినిమాను నిర్మించారు. ఎస్. ఎన్. ప్రసాద్ సంగీతం సమకూర్చారు. సురేశ్ బాల సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. అలాగే కలైవాణన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.
మిరల్ సినిమాలో హీరో భరత్, వాణీ భోజన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అదానీ అంటేనే వివాదాలు.. ఎందుకని..? టార్గెట్ ఎందుకు చేశారు..
అదానీ అంటేనే వివాదాలు.. ఎందుకని..? టార్గెట్ ఎందుకు చేశారు..
'మరోసారి అమ్మను కాబోతున్నా'.. శుభవార్త చెప్పిన టాలీవుడ్ హీరోయిన్
'మరోసారి అమ్మను కాబోతున్నా'.. శుభవార్త చెప్పిన టాలీవుడ్ హీరోయిన్
మోక్షజ్ఞ టాలీవుడ్‌ ఎంట్రీపై ఇంట్రస్టింగ్‌ బజ్‌
మోక్షజ్ఞ టాలీవుడ్‌ ఎంట్రీపై ఇంట్రస్టింగ్‌ బజ్‌
3రోజుల విదేశీ పర్యటనతో ప్రధాని మోదీ రికార్డ్‌..!
3రోజుల విదేశీ పర్యటనతో ప్రధాని మోదీ రికార్డ్‌..!
అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం భారతీయులకే సాధ్యమన్న సింధియా ఎందుకంటే
అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం భారతీయులకే సాధ్యమన్న సింధియా ఎందుకంటే
ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి సమ్మిట్ ఉపయోగకరం
ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి సమ్మిట్ ఉపయోగకరం
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఎప్పుడు, ఎక్కడంటే?
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఎప్పుడు, ఎక్కడంటే?
అదానీపై కేసుతో బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ నేతల మధ్య మాటల యుద్ధం..
అదానీపై కేసుతో బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ నేతల మధ్య మాటల యుద్ధం..
'పెట్టుబడులకు గుజరాత్ ప్రపంచ వేదికగా మారింది'.. గుజరాత్‌ సీఎం
'పెట్టుబడులకు గుజరాత్ ప్రపంచ వేదికగా మారింది'.. గుజరాత్‌ సీఎం
విమానంలో సిగరెట్‌ తాగాడు.. ఆ తర్వాత ??
విమానంలో సిగరెట్‌ తాగాడు.. ఆ తర్వాత ??